లే లేత వర్ణ సుగంధ గులాబీ నా కోసమే! దివినుంచి భువికి తరలి వచ్చిన నాజూకైన అందాల పుష్ప మణి దీపిక!!
ముచ్చటైన నీ నగుమోము బహు అరుదుగా కనువిందు!
వజ్రకాంతులు వెదజల్లే ఆ కన్నుల సంపద అరవిందం ఓ! అపరంజి బొమ్మ!!
నిటారైన నీ నాసికా నీ అందచందాలను పట్టింపు లేని రెట్టింపు చేసే ఓ చిలిపి సొగసరి!
ముద్దబంతి లాంటి నీ సొట్ట బుగ్గలు మురిపం చేయగా నా చేతి వేళ్ళు నిలువక నిన్నే చేరుచుండే ఓ! నా ప్రియ ఆకర్షణీ!!
ఓహో!ఎర్ర గులాబీ రెక్కల పెదాల కదలికలు! నా మనంబున మత్తుగా గమ్మత్తుగా చిరు మందహాసపు జల్లు! కురిసింది ఓ! చిరుమందహాసిని!
ఆ పెదాల పై నీలిరత్నపు పుట్టుమచ్చ నా ఎద అంతరంగంలో తరంగపు అలజడి రేపింది ఓ! పుత్తడి రెమ్మ!!
పసిడి పూత తామరాకు పై నాట్యం ఆడే ముత్యాల నీటిబిందువులాగ తళతళలాడే నీ పంటి సరాలు! నా ఒంటి నరాలను!! జలదరింప చేసే జలతరంగణీ!!
నిన్ను నే చూడ నాలో దాగిన నలత నలిగి పోయే! నా మనసు నాట్యం ఆడే !
నా హృదయం ఆనందంతో చిందు లాడే! నా హృదయ హరణీ!!
నీ నయన చూపుల ఒరవడిలో వెలువడే తాకిడికి నా పాదాల చలన అలికిడితో నాలో వేడి రగిలే రమణీ!
నీ ఇంపైన నడుము వంపుసొంపులు నాలోని కలతను కరిగించి దూరం చేసే ఓ! నా ఇంద్రాణి!!
నీలో కమ్మని అనురాగ సుధలు సుగంధ సుగుణాలు విరజిమ్మే శక్తి, నీలోనే దాగి ఉన్నాయే; ఓ! విరబూసిన మనో పుష్పరాణీ!! నా నారీ!!
రా! రారా! మెల్లమెల్లగా రా! నా చెంత చేరు చంద్రలోక ప్రతిరూపమా! నా కలల యువరాణి! నన్ను ఏలే యువరాణీ!! ఓ సిరిచందనాల వదన!!!
రచన..సయ్యద్. హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.