అందం అందమే! అది ఏ వర్ణమైనొకటే;
చూసే కళ్ళకే తెలుసు;అందం మనసు కు సంబంధం
మనసు చెడు అయితే పచ్చది అయినా ;
పనికిరాని అందం;మంచిది అయితే నల్లది కూడా
బహుశా బహుళ ముచ్చటే;
అదే అనురాగ సంగమం ల అనుసంధానం!!
పెనవేసుకొని అల్లుకున్నే ఆనందాల పరవశ సన్నివేశం! అదే ప్రేమబంధం!!
నచ్చడం, నచ్చకపోవడం నిర్ణయం ఆయా హృదయాలదే;
మెచ్చటం మెచ్చకపోవడం నిర్ణయం ఆలోచన పరిధిదే;
ఒక బంధం తెగిపోయిన, తెగకపోయిన ఆపలేము ,
కలుపలేము,కలయిక అర్ధం చేసుకోనే మానసిక స్ధితిదే !
నిర్ణయం తనదే అయినా సరే ఆయా క్షణాల ప్రేరణదే !!
కాల మనే మనసులో నాటే సరికొత్త విత్తే ఆకర్షణ అదే ఘాటైన ప్రేమ!
దానికి ఎవరైనా ఏదొకసమయాన తలవంచక తప్పదు ;
మహిలో!!
మదిగనిలో దాగిన మణి రత్నమాలు! ఎద సొరంగంలో దాచిన వజ్రాల హారాలు!!
ఒకరికి నచ్చింది వేరొకరికి మెచ్చాలి అంటే అది జరగని తంతు! అదొక తిక్కే!!
ఆ హృదయ మీటలో తిరిగే భ్రమణ చలనాలు వారికే తెలుసు !
అందుకే దేనిని అలుసుగా చూడకు; అది నీ కంటిలో నలుసు అనుకోకు !!
రచన.. సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.