Type Here to Get Search Results !

ముచ్చటైన మురిసే జంటగా !!! హాయి హాయిగా!!!

0

సంసారం ఓ పండు వెన్నెల రేయిలా ;

ప్రేమానురాగాలు గుండెల్లో నిండగా;

అందమైన ముద్దుగొమ్మ చీరకొంగు

 తెరచాపై!

ముచ్చటైన జతగాడు తెడ్డులా తోడైతే!!

 

అలల తాకిడి ఎదురీత అయిన తడబాటు ఉండక;

యడబాటు గమనం లేక జీవిత పడవ ప్రయాణం సాగునులే!


అణువు అణువున అణుకువ ఉన్న తణుకు బెణుకులు లేక ఆగదులే జీవిత నౌక!!


ఒడిదుడుకులు వచ్చినా పొరపచ్చలు వచ్చిన మచ్చికతో చేయునులే సంసారం!


ఏ ఒకరు అలిసి సొలిసిన ఒకరినొక్కరి ఆసరాతో అలుపు సొలుపులేక ఒదిగిపోదురులే కుటుంబ సాగరానా!!


బరువు బాధ్యతలు భారం కావు లే

ఆటపాటలతోమున్నుముందుకు సాగేనులే !


తీరం ఏదైనా ఆలుమగల బంధం ఒకటేలే;

అదే ఆధారం! మహత్తర దారం ఒకటై

కష్టాల కడలిని దాటవేయునులే!!


పెను గాలులు వీచిన,జడివానలు కురిసిన !

ఓర్పుతో, నేర్పుతో ,కలుపు గోరు లతో

ముసిముసి నవ్వుల హరివిల్లు చెందునులే!!


చెల్లాచెదురుగా చెందరు లే, చల్లగా ఉందురులే! నూరేళ్ళ పంటగా!! ముచ్చటైన మురిసే జంటగా  !!! హాయి హాయిగా !!!


కలిమిలేములు కావిడికుండల్లా సరిగమపదని స ల సరస విలాసాలా సాగేనులే సంసారం ...సంసారం


రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages