Type Here to Get Search Results !

నీ దరిలేని నేను విలువలేని కాసునే !!!

0

 వదలకు వదలి వదలి వెళ్ళమాకే;

కదలకు కదలి కదిలి కదలమాకే;

జారమాకే జారిపోకే చేయి జారిపోకే ఓ నా జూలీ!

నా యద వీణ తీగ తుంచకే ఓ నా నెరజాణ!!

ఓ నా చెలి !నా కళ్లలోకన్నీరునింపమాకే ఓ నా అనార్కలి!!

నా గుండెల్లో అగ్గి శోక మంట గోలి పెట్టమాకే ఓ నా లైలా!

శ్వాస ఆడక ఊపిరి ఆగిపోతుందియే ఓ నా ఊపిరి !!

నిన్ను వదలి నేనుండ లేనే ఓ నా ప్రియ సఖి!

నీవు కనబడకపోతే;

నా మనసు విలవిలలాడేనే ఓ నా లతాంగి!!

ఇక నీవు నన్ను వదిలి కదిలి వెళ్ళితే నా పాదాలలో వణుకే వణుకు అందుకే  వెళ్ళమాకే ‌ఓ నా కోమలి!

నేనుఉండగలనా?చెప్పవే ఓ నా మనసా...!!

ఏ పొరపచ్చలు లేక కలిసిమెలిసి మెదిలిన మనం యడబాటు అవసరమా? ఓ నా ఆణిముత్యం!

ఏం జరిగిందని నా నుంచి నీ దూరం ;

నాపై నమ్మకం లేకనా ? మాటకోసం ప్రాణం ఇస్తానే ఓ నా ప్రాణేశ్వరీ !!

నాలో ఆవేశమా? యిసుమంత లేదే ఓ నా వయ్యారి!

నీపై నే దాచినప్రేమను విడిచి దహించకే;

నే ఉండలేను ఓ నా బంగారం!!

నీ దరి లేని నేను విలువలేని కాసునే

అందుకే నీవు నేను త్రాసు లా! ఉందాంలే ఓ నా సింగారి.....!!

నీవు నేను జతగా ఉంటే హోలీ! ( రంగేళి) ఓ నా మనోహరిణీ!!


రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages