Type Here to Get Search Results !

బాల పంచపది : వర్షం , ముద్దు బిడ్డలు , చెట్లు :: పోరంకి నాగరాజు (గోపాల)

0

 527)

బాల పంచపది

పి.నాగరాజు 9-9-2022


వర్షం

మిల మిల మెరుపులు మెరిసెను

జడి జడిగ వానలు  కురిసెను

చెరువులు కళ కళ లాడెను

పైరులు పచ్చగా తళ తళ లాడెను

రైతుల మోములు మురిసెను గోపాల!


528)

ముద్దు బిడ్డలు

భరతమాత ముద్దు బిడ్డలము

అమ్మానాన్నల మురిపాలము

కొమ్మకు పూచిన రెమ్మలము

అమాయకపు పసి  పాపలము

దేశానికి కాబోయే వారసులము గోపాల!


చెట్లు 

529)

చెట్లు చల్లని నీడ నిచ్చును బాలలు

ప్రాణవాయువు నిచ్చును బాలలు

పూలు కాయలను ఇచ్చును బాలలు

పక్షులకు గూడు నిచ్చును బాలలు

తరువులే గురువులు మనకు గోపాల!



పోరంకి నాగరాజు (యస్.ఏ) హిందీ

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కామవరపుకోట

నా కలం పేరు గోపాల

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages