Type Here to Get Search Results !

జయహో జయహో వీర జవాన్ :: సుగుణ మద్ది రెడ్డి

0

 



జయహో జయహో వీర జవాన్

 జయ జయజయహో వీర జవాన్


 సరిహద్దుల్లో  సైన్యమా

 భారత రక్షణ కవచమా

 శత్రు గుండెల్లో సింహమా

భరతమాత వీరతిలకమా//జయ//


వెన్నుచూపని వీరుడా

ముందుకు నడిచే ధీరుడా

  సాహసించే శూరుడా

వెలుగునిచ్చే సూర్యుడా//జయ//


మంచు కొండల్లో కంచుకోటవి

 కారడవుల్లో కాంతిరేఖవి

నీటిలో తిరిగే తిమింగళానివి

గాలిలో ఎగిరే ఉక్కు పక్షివి// జయ//


   దేశం కోసం ఆరాటం

 అలుపెరగని నీపోరాటం

 ఓ వీర జవాన్ నీకు సలాం

అమర జవాన్ నీకు సలాం


రచన. సుగుణ మద్ది రెడ్డి

 ఐలవారిపల్లె

 ఐరాల

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages