Type Here to Get Search Results !

ముత్యమంత తెల్లనైన మనసు బాలలు ! :: శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

0

 "బాలగేయం"


ముత్యమంత తెల్లనైన మనసు బాలలు !

వెన్నెలంత స్వచ్ఛమైన

వెలుగు బాలలు !!


విరిసే పువ్వు వంటివారు బాలలు !

మెరిసే నవ్వు వంటివారు బాలలు !!


కురిసేచినుకు వంటివారు బాలలు !

కన్నులలో కాంతి నింపు

వారు బాలలు !!


చిరునవ్వుకు చిరునామా

చిట్టి బాలలు !

తెలుగుజాతి దివ్యభవిత

ఘనులు బాలలు !!


స్వీయరచన: 6.9.2022.


శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

హైదరాబాద్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages