Type Here to Get Search Results !

నలుగురితో ఉండాలి! :: గద్వాల సోమన్న

0

 నలుగురితో ఉండాలి!



------------------------------ 

పూవులోని తావిలా

నగవులోని సొగసులా

నలుగురితో ఉండాలి!

దండలో దారంలా


దివ్వెలోని వెలుగులా

మువ్వలోని నాదంలా

నలుగురితో ఉండాలి!

బువ్వలోని సారంలా


మెడలోని హారంలా

మడిలోని పైరులా

నలుగురితో ఉండాలి!

గుడిలోని  దైవంలా


ఒడిలోని పాపల్లా

బడిలోని గురువుల్లా

నలుగురితో ఉండాలి!

సడిలేని నడిరేయిలా


-గద్వాల సోమన్న

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages