బాల పంచపదులు
అంశం : వీధి అరుగు
శీర్షిక : ఇంటి వెలుగు
1.
గుమ్మానికి అందం తోరణం!
ఇంటికి అరుగు ఆభరణం!
జరుగు జ్ఞాన ప్రసరణం!
పెరుగు గౌరవ స్మరణం!
వీధి అరుగు ,
ఇంటి వెలుగు, రామా!
2.
ఆరుగులలో ,
మేలు మా అరుగు!
ఏమా
కళకళలాడే ఆ మెరుగు!
దారిన వెళ్లే,
జనం కాస్త ఆగు!
అందరూ ఎంతో,
గౌరవం ఒసగు!
వీధి అరుగు ,
ఇంటి వెలుగు, రామా!
3.
ఇంటి ముందు అరుగులు!
ఆత్మీయతకు కొలువులు!
సమావేశాల నెలవులు!
సంభాషణల పొదుగులు!
వీధి అరుగు,
ఇంటి వెలుగు, రామా!
4.
చిన్ని పిల్లల,
చక్కని ఆటలు!
రోజులు సరి ,
రెండు పూటలు!
అవి పెద్దలను ,
పిలిచే పీటలు!
వారి తరగని ,
మాటల. ఊటలు!
వీధి అరుగు
ఇంటి వెలుగు, రామా!
5.
రాత్రి అవి,
అనాధల ఆశ్రయాలు!
ఇళ్శు ఇచ్చే,
స్వచ్ఛంద సహాయాలు!
నిజం అవి,
ఆనందాల మడుగులు!
చెరగని ,
జ్ఞాపకాల మందిరాలు!
వీధి అరుగు,
ఇంటి వెలుగు ,రామా!
6.
నేడు వీధి అరుగులు లేవు!
అసలు ,
సొంత ఇళ్ళే కానరావు!
అపార్ట్మెంట్స్ ,
చాలా చాలా లావు!
వీధి అరుగు,
జనం మరిచిపోవు!
వీధి అరుగు ,
ఇంటి వెలుగు ,రామా!
_________
డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
9441058797