Type Here to Get Search Results !

మబ్బులచాటున జాబిల్లి : (బాలగేయం) :: శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

0

   

    బాల సాహిత్యం

     (బాలగేయం)


మ-మా-మి-మీ-ము-మూమృ-మె-మే-మై-మొ-మో-మౌమం*

----------------


శీర్షిక:.   "జాబిల్లి "


మబ్బులచాటున జాబిల్లి


మాయామర్మంతెలియనితల్లి 


మిలమిలమెరిసేతారలతో


మీగడతరకలమెరుపులతో


ముద్దుగ నవ్వెను జాబిల్లి


మూలము వెన్నెలజాబిల్లి.


మృదువుగతోచెనుజాబిల్లి


మెరుపులనవ్వులజాబిల్లి 


మేఘాలలోతేలిఆడినది 


మైమరపించే అందమది


మొయిలుచాటునదాగుంది 


మోముదాచిననుచూసింది 


మౌనమునేమాట్లాడించింది


మంచిగ పకపకనవ్వింది!!

********


మబ్బులచాటున జాబిల్లి!

మాయామర్మంతెలియని

తల్లి.!! 


స్వీయరచన:✍️

శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

హైదరాబాద్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages