Type Here to Get Search Results !

అక్షరాలు నేర్చుకోవాలి..!! :: కొప్పుల ప్రసాద్

0

 బాలల గేయం


అక్షరాలు నేర్చుకోవాలి..!!


అక్షరాన్ని నేర్చుకో

బతుకుతెరువు మార్చుకో

బుద్ధిని పెంచుకో

మమతలు పంచుకో...


పాఠశాలకు పోతుంటే

పాఠాలు నేర్చుకుంటే

జ్ఞానము ఎంతో వస్తుంది

జిజ్ఞాస తీరుతుంది...


గురువుకు నమస్కారం

అదే పిల్లల సమస్కారం

చదువులకు పరిష్కారం

మంచివాడిగా మారే అవకాశం..


పుస్తకాలే నేస్తాలు

తోడుగా నిలిచే గ్రంధాలు

ప్రక్కనుండి పలకరిస్తూ

జ్ఞానానింతో అందిస్తాయి..


ఆటపాటలే ఇష్టం

ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరుబయటే ఆనందం

అందరితో తిరగడమే సంతోషం...


భవితకు వారసులం

బాధ్యతగల పౌరులం

భరతమాత బిడ్డలం 

దేశసేవే  మా కర్తవ్యం..


కొప్పుల ప్రసాద్

నంద్యాల

9885066236

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages