జూలై 1న డాక్టర్స్ డే లేదా
వైద్యుల దినోత్సవం
భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం ‘డాక్టర్స్‌డే’
లేదా వైద్యుల దినోత్సవాన్ని జూలై 1న జరుపుకుంటారు.
అనుక్షణం ఆరోగ్యాన్ని , శారీరక , మానసిక స్థైర్యాల్ని అందించే
ఈ వైద్య నారాయణులకు ఏమిచ్చి రుణము తీర్చుకోవాలి? డాక్టరు చికిత్స చేసేశాడు, రోగి ఫీజు చెల్లించాడు
అనుకుంటే ఆ ప్రాణదాత రుణము తీరిపోతుందా ? ఆ బంధము తెగిపోతుందా
? ఆ దాత పోసిన ఊపిరి అనుక్షణము కృతజ్ఞతను నింపుకుని పదేపదే గుర్తు
చేస్తూ ఉంటుంది కదూ. అందుకే ఈ వైద్యులకోసం ప్రపంచమంతా ఒక రోజు కేటాయించిం ది. అదే
ప్రపంచ డాకటర్స్ డే దినోత్సవం . వాళ్లను గుర్తు పెట్టుకు ని ఈ రోజున డాక్టర్లందరూ సుఖ
సంతోషాలు , ఆయురారోగ్యాలు , సిరి సంపదలతో చల్లగా ఉండాలని దేవున్ని ప్రార్ధించి శుభాకాంక్షలు
తెలియజేస్తారు.
చరిత్ర
మన దేశంలో 1991 నుంచి డాక్టర్స్‌డే నిర్వహించడం ప్రారంభమైంది. డాక్టర్ బిపిన్‌చంద్ర
రాయ్ జూలై 1,1882న జన్మించారు, జూలై 1, 1962 మరణిచారు ఆయన గౌరవర్థం
జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించాలని భారత ప్రభుత్వం
నిర్ణయించింది. బీసి రాయ్‌కలకత్తా మెడికల్‌కాలేజీలో చదివారు. ఆ తరువాత ఆరోగ్యశాఖలో
చేరారు. ఉన్నత చదువుల కోసం రాయ్‌చేసుకున్న అభ్యర్థనను ఆ సంస్థ డీన్ పలుమార్లు తిరస్కరించారు.
అయినా పట్టు వదలకపోవడంతో ప్రవేశాన్ని కల్పించారు. కేవలం రెండేళ్ల మూడు నెలల్లో ఎంఆర్‌సీపీ, ఎఫ్‌ఆర్‌సీఎస్(1911లో) పూర్తి చేసిన అరుదైన వ్యక్తి రాయ్. అనంతరం కలకత్తాలోనే ప్రాక్టీసు ప్రారంభించారు.
కలరా విజృంభించిన సమయంలో వేలాదిమంది ప్రాణాల్ని కాపాడారు. జాతిపిత మహాత్మా గాంధీకి
వైద్యుడిగా, స్నేహితుడిగా వెన్నంటి నడిచారు. 1961లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక
కూడా రోజూ సాయంత్రం కొంత సమయాన్ని వైద్య సేవలకు కేటాయించారు. ఆయన స్ఫూర్తి కొనసాగించేందుకు
‘డాక్టర్స్‌డే’ ను నిర్వహిస్తున్నారు.