సంఘటనలు
- ద్వంద్వ పౌరసత్వం (17 జనవరి 1997)
- ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ఇచ్చేది లేదని భారత ప్రభుత్వం 1997లో ఇదే రోజున ప్రకటించింది. ద్వంద్వ పౌరసత్వం అరాచక శక్తులకు అస్త్రంగా మారుతుందని.. ఉగ్రవాదులకు ఊతమిస్తుందనే అభిప్రాయంతో నాడు ద్వంద్వ పౌరసత్వానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- అనిల్ కుంబ్లే నయా రికార్డు (17 జనవరి 2008)
- భారత క్రికెట్ ఆటగాడు అనిల్ కుంబ్లే పేరిట భారత క్రికెట్ చరిత్రలో చెరిగిపోని రికార్డులు ఉన్నాయి. 2008లో ఇదే రోజు కుంబ్లే వికెట్లతో ఆట ఆడేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో 600 వికెట్లు పడగొట్టిన భారతీయ బౌలర్ గా అనిల్ కుంబ్లే రికార్డు నెలకొల్పినది ఈరోజే. ఈ రికార్డును ఆస్ట్రేలియా జట్టుపై నమోదు చేశాడు. కాగా కుంబ్లే కెరీర్ లో మొత్తం 132 టెస్టుు ఆడిన కుంబ్లే మొత్తం 619 వికెట్లు పడగొట్టారు.
- 1989 : మొదటిసారి ఒక భారతీయుడు కల్నల్ జీకే బజాజ్ దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నాడు. 1989 జనవరి 17వ తేదీన ఈ ఘనత సాధించాడు
జననాలు
- 1706 : బెంజమిన్ ఫ్రాంక్లిన్ ( అమెరికా విప్లవం లో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకరు )
- 1908 : ఎల్.వి.ప్రసాద్ , గొప్ప సినీనిర్మాత దర్శకుడు మరియు నటుడు
- 1911 : ప్రముఖ ఆర్థికవేత్త అయిన జార్జ్ స్టిల్.. ఆర్థిక శాస్త్రంలో జార్జ్ స్టిగ్లర్ చేసిన కృషికిగాను ఏకంగా నోబెల్ బహుమతిని అందుకున్నారు
- 1915 : ఎం.జి.రామచంద్రన్ , తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి , ప్రముఖ సినిమా నటుడు
- 1942: మహమ్మద్ అలీ , మూడు సార్లు హెవీ వెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తి శాలి
- 1945: మడిపలి భద్రయ్య , ఉత్తమ ఉపాధ్యాయులు మరియు ఆధ్యాత్మిక వేత్త
- 1945: ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ జన్మదినం ఈరోజు
మరణాలు
- జ్యోతిబసు , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , భారతదేశంలో
అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సొంతం