Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 20 (JANUARY 20)

0

 

సంఘటనలు


  • 1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు.
  • 1993: అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
  • 2009: అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు.
  • 2010: నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు.
  • 2011: భారత దేశము : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొబైల్ నంబర్ పొర్టబులిటీ (Mobile Number Portability) సర్వీసుని ప్రారంభించారు.
  • 2011 : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాస్కర్ శ్రీనివాస్ - APL - ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో తన క్రికెట్ ప్రస్థానానికి తొలి అడుగు వేశారు. వెస్ట్ చీతాస్ క్రికెట్ టీం కు 2011-2017 వరకు టీం కెప్టెన్ గా తన సేవలు అందించారు. 2018 నుంచి చీఫ్ కోచ్ గా తన సేవలు కొనసాగిస్తున్నారు. 2019 లో ఆంధ్రా క్రికెట్ ఆర్గనైజేషన్ ఇతని సేవలను గుర్తించి క్రీడా తరంగ బిరుదు తో సత్కరించింది.



జననాలు


  • 1907: బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968)
  • 1920: బి.విఠలాచార్య,'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (మ.1999)
  • 1940: కృష్ణంరాజు, తెలుగు నటుడు, రాజకీయవేత్త.
  • 1960: విజయ నరేష్, తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.



మరణాలు



  • 1900: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822)
  • 1988: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1890)
  • 2008: సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(జ.1939)
  • 2016: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)
  • 2016: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932)

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages