Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 26 (JANUARY 26)

0

 

సంఘటనలు


  • 1565: దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది.
  • 1950: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ..
  • 1950:భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
  • 1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
  • 1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
  • 1950: భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ పదవిని స్వీకరించాడు.
  • 1957: జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది.
  • 1965: హిందీ భాషను భారత అధికార భాషగా గుర్తించారు.
  • 2001: గుజరాత్ లో భయంకర భూకంపం - 20,000 మంది దుర్మరణం.



జననాలు


  • 1926: ఆవంచ హరికిషన్ నిజాం విమోచన ఉద్యమకారుడు .
  • 1935: వాండ్రంగి రామారావు, తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, మరియు ఆకాశవాణి ప్రసంగికుడు
  • 1956: భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ.
  • 1957: శివలాల్ యాదవ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు .
  • 1961: మల్లేశ్ బలష్టు, కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు మరియు సినీ నటుడు.
  • 1968: రవితేజ (నటుడు),తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.
  • 1968: నర్సింగ్ యాదవ్, తడు తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో కలిపి సుమారు 500 చిత్రాలలో నటించాడు
  • 1985: నవదీప్, భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు



మరణాలు


  • 1839: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (జ.1763)
  • 1986: కొర్రపాటి గంగాధరరావు,. నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)
  • 2010: తెలుగు సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.1927)
  • 2015: ఆర్.కె.లక్ష్మణ్, ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924)



🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷



🔻భారత గణతంత్ర దినోత్సవం


🔻ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages