సంఘటనలు
- 1943: రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు రష్యా లోని స్టాలిన్‌గ్రాడ్ వద్ద రష్యా సైన్యానికి లొంగిపోయాయి.
- 1953: శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్ మరియు వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 1953 జనవరి 31లో ప్రచురించబడింది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడింది. చూడు : పి.శంకరనారాయణ
- 1963: నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది.
- 1972: నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
- 2009: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్ కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
జననాలు
- 1763: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)
- 1895: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త
- 1905: కందుకూరి రామభద్రరావు, ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. (మ.1976)
- 1927: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
- 1974: రక్ష, భారత సినీ నటి.
- 1974: వనమాలి, వర్థమాన సినీ గీత రచయిత.
మరణాలు
- 1626: సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి.
- 1666: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (జ.1592)
- 1969: మెహర్ బాబా, అవతార్, (జ.1894)
- 1972: మహేంద్ర, నేపాల్ రాజు.
- 1973: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త .
- 2003: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి
- 2009: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు (జ.1933).