Type Here to Get Search Results !

నిజకార్యసముద్దరణార్థమై మహిం

 నిజకార్యసముద్దరణార్థమై మహిం

బనివడి యల్పమానవునిఁబ్రార్థనజేయుట తప్పు గాదుగా

యనఘతఁ గృష్ణజన్మముననా వసుదేవుఁ మీఁదుటెత్తుగాఁ

గనుఁగొని గాలిగానికడకాళ్ళకు మ్రొక్కఁడె నాఁడు భాస్కరా!

 

భావం:

 

ఎంత గొప్పవానికైనాసమయం వచ్చినప్పుడు నీచుని వేడుకొనుట తప్పు కాదు. పూర్వము శ్రీకృష్ణమూర్తి జన్మించినప్పుడు అతని తండ్రి వసుదేవుడు గాడిదకాళ్లు పట్టుకోలేదా?

Show ad in Posts/Pages