Type Here to Get Search Results !

అందరమూ ఒకటే

  అందరమూ ఒకటే


అందరమూ ఒకటే-

మనమందరమూ ఒకటే

మన మందిరమూ ఒకటే

మన మందిరమూ ఒకటే


అందరి చరిత్ర ఒకటే

అందరి ప్రవర్తనొకటే!

భావిచరిత్ర వర్తనమంతా

ఒకటేనంటూ రాయుదుమింక  ।అందరమూ ।


మతములు వేరు మనుగడ ఒకటే

జాతులు వేరు నీతులు ఒకటే

మతములు జాతులు వేరుగనున్నా 

భారతీయమది అందరిదీ  ।అందరమూ‌ ।


భాషలు వేరు! భావములొకటే

భాషలతల్లి! సంస్కృతమొకటే

భాష భావముల భేదములున్నా

భారత హృదయము అంతా ఒకటే  ।అందరమూ ।


విద్యలు ఒకటే! కళలు ఒకటే

వినోద విజ్ఞానమ్ములు ఒకటే

భిన్నత్వమ్మున ఏకత్వమ్మలె

వివిధ భారతి హృదయమ్మొక్కటే  ।అందరమూ ।

Show ad in Posts/Pages