ఆంధ్రప్రదేశ్
సెలవు నియమాలు, 1933
AP
లీవ్ రూల్స్ 4.10.1933 నుండి అమలులోకి వచ్చాయి..
సెలవు నిబంధనలు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. కార్యాలయాలు / సంస్థలు / సంఘాలు మరియు సెలవు శాఖ(వెకేషన్
డిపార్ట్మెంట్) లో పనిచేసే ఉద్యోగులతో సహా స్థానిక సంస్థలు.
v ప్రభుత్వ ఉద్యోగి తన
సెలవు దరఖాస్తులో తన స్పష్టమైన చిరునామాను పేర్కొనాలి (FR - 74).
v సెలవును హక్కుగా క్లెయిమ్
చేయడం సాధ్యం కాదు. (ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి.)
v సెలవు సరిగా మంజూరు
చేయబడాలి., సరైన ఉపశమనం(relief) మరియు సరైన ఛార్జీని అప్పగించాలి).
v ఉద్యోగి తన ఇష్టానికి
వ్యతిరేకంగా సెలవు తీసుకోవాల్సిన అవసరం లేదు. (FR 67)
v ముందస్తు అనుమతి లేకుండా
విధులకు హాజరు కాకపోవడం డైస్ నాన్ గా పరిగణించబడుతుంది. (FR-18)
v మంజూరు చేసిన సెలవు
యొక్క స్వభావాన్ని మార్పు చేసే అధికారం sanctioning authority కి లేదు
v తప్పనిసరి పరిస్థితుల్లో
ప్రభుత్వ ఆదేశాల మేరకు సెలవు నుండి రీకాల్ మరియు సెలవు కుదింపు (ఎఫ్‌ఆర్ - 70, ఎపి టిఎ రూల్స్ 76, ఎఫ్‌ఆర్ -
72).
v సెలవు సమయంలో ప్రభుత్వ
ఉద్యోగి ఎటువంటి ఉపాధిని చేపట్టకూడదు.
(FR - 69)
v దరఖాస్తు చేసిన సెలవుకు
పబ్లిక్ హాలిడేస్ ప్రిఫిక్స్ లేదా సఫిక్స్
చేయడానికి అనుమతించబడతాయి. (Govt.Memo.No
865/1210 / FR-1, Dt.25.9.81)
v సెలవు దరఖాస్తుకు స్థానిక సెలవుదినాలు
సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ చేయడానికి అనుమతించబడవు. (FR-68)
v సస్పెండ్ చేయబడిన ఉద్యోగికి
ఎటువంటి సెలవు మంజూరు చేయబడదు. (FR 55 మరియు
74)
v ఒక ప్రభుత్వ ఉద్యోగి
(అతను / ఆమె) కింది సందర్భాల్లో రాజీనామా చేసినట్లు భావించబడుతుంది:
‘ఒక సంవత్సరం’ మించిన కాలానికి అనుమతి
లేకుండా విధులకు హాజరుకాకపోతే. (5) సంవత్సరాలు దాటిన నిరంతర కాలానికి డ్యూటీకి హాజరుకాకపోవడం
సెలవు ఉండి లేదా సెలవు లేకుండా.
v ప్రభుత్వం ఆమోదించిన
కాలానికి మించి foreign service లో నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు అయితే (ఎఫ్‌ఆర్
-18 (ఎ) మరియు 5 (ఎ) మరియు (బి) సెలవు నిబంధనలు)
AP లీవ్ రూల్స్ 1933 ప్రకారం ప్రభుత్వ
ఉద్యోగులకు కల్పించబడుతున్న కొన్ని ముఖ్య సెలవులు.
- ప్రసూతి
సెలవులు: మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇచ్చే నిమిత్తం 2010లో మంజూరు చేసిన జిఓ
నెంబర్ 152 ప్రకారం 180 రోజుల సెలవులు డెలివరీ సమయంలో వాడుకోవచ్చు. ఈసెలవులు
వేతనంతో కూడుకున్నవి.
- క్యాజువల్
సెలవులు: ఉద్యోగులకు సంవత్సరానికి
15 రోజులు సాధరాణ సెలవులు మంజూరు చేస్తారు. 1981లో జీఓ నెంబర్ 52 మంజూరుచేసింది.
- ఐచ్చికసెలవులు:
ప్రభుత్వ ఉద్యోగులకు క్యాలెండర్ ఇయర్కు ఐదురోజులు ఐశ్చిక సెలవులు మంజూరు చేస్తారు.
అయితే క్యాలెండర్లో పేర్కొన్న పండుగలలో మాత్రమే ఈసెలవులు ఉపయోగించుకునే వీలుంటుంది.
ఇవికూడా వేతనంతో కూడుకున్నవే.
- అర్థవేతన
సెలవులు: అర్ధ వేతన సెలవులు కింద ప్రభుత్వం 1994లో మంజూరుచేసిన 317 జీఓ కింద ప్రభుత్వ
ఉద్యోగులకు సంవత్సరానికి 20 అర్ధ వేతనపు సెలవులు మంజూరుచేస్తారు. వీటిని వాడు కున్న
ఉద్యోగులకు ఆయా రోజులలో సగం వేతనం చెల్లిస్తారు.
- పితృత్వ
సెలవులు: 2015లో ప్రభుత్వం మంజూరు చేసిన 231 జీఓ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ
సెలవులు కింద 15 రోజులు మంజూరు చేశారు. ప్రసవం పొందిన భార్యకు సేవలందించేందుకు భర్తకు
ఈసెలవులు ఇస్తారు.
- సంపాదిత
సెలవులు(ఎర్న్డ లీవ్స్): క్యాలెండర్ ఇయర్కుగాను 30 సంపాదిత సెలవులు మంజూరు చేస్తారు.
ఈసెలవులు వాడుకోగా మిగిలిన వాటిని అదే ఏడాది అమ్ముకోవచ్చు. అంటే ఆమొత్తానికి సమానమైన
వేతనాన్ని పొందవచ్చు. 1994లో ప్రభుత్వం 317 జీఓను మంజూరుచేసింది.
- కుటుంబ
నియంత్రణ సెలవులు: కుటుంబ నియంత్రణ చేసుకున్న పురుష ఉద్యోగులకు ప్రభుత్వం ఆరు రోజుల
వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తారు. మహిళా ఉద్యోగులకు మాత్రం 14 రోజులు మంజూరుచేస్తారు.
వీటిని మంజూరుచేస్తూ 1968లో జీఓ నెంబర్ 1415ను విడుదలచేసింది.
- అబార్షన్
సెలవులు: అబార్షన్ సెలవులు కింద ప్రభుత్వం 1976లో జీఓ నెంబర్ 762ను విడుదల చేసింది.
దీనిప్రకారం అబార్షన్ సెలవులు కింద మహిళా ఉద్యోగులు 42 రోజులు సెలువులు ప్రభుత్వం మంజూరుచేస్తుంది.
- చైల్డ్
కేర్ లీవ్: *ప్రభుత్వం చైల్డ్ కేర్ లీవ్ కింద 2016లో జీఓ నెంబర్ 209 ప్రకారం ప్రభుత్వ
ఉద్యోగులకు 90 రోజులు సెలవులు మంజూరుచేస్తుంది.
- రీకానలైజేషన్
సెలవులు: 1981లో జీఓ నెంబర్ 102 ప్రకారం రీకానలైజేషన్ కింద 21 రోజుల సెలవులు మంజూరు
చేస్తారు.
- రక్తదాన
సెలవు: ఉద్యోగులకు రక్తదాన సెలవు కింద ఒక్కరోజు మంజూరు చేస్తారు. 1984లో జీఓ నెంబర్
137ను ప్రభుత్వం జారీచేసింది.
- యూనియన్
లీడర్స్ స్పెషల్ సెలవులు: ప్రభుత్వరంగ సంస్థలలో యూనియన్ నాయకులుగా పనిచేస్తున్న ఉద్యోగులకు
స్పెషల్ క్యాజువల్ లీవ్ కింద 21 రోజులు మంజారుచేస్తూ 1994లో జీఓ నెంబర్ 470 విడుదల
చేసింది.
- హిస్టరెక్టమి
సెలవులు: 2011లో హిస్టరెసక్టమి సెలవులు 45 రోజులు మంజూరుచేస్తూ జీఓ నెంబర్ 52ను విడుదల
చేసింది.