ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్
- ముఖ్యాంశాలు
ప్రభుత్వ నిధుల యొక్క జమాఖర్చులకు సంబంధించిన
నిబంధనలు ఫైనాన్షియల్ కోడ్ లో పొందుపరచబడి
ఉంటాయి. ప్రత్యేక నిబంధనలు లేని సందర్భంలో ఇవి స్థానిక సంస్థలకు
కూడా వర్తిస్తాయి.
వాటిలో
ముఖ్య మైనవి.
1. ప్రభుత్వముగాని లేక సంబంధిత అధికారిగాని చేసిన నిధుల
మంజూరు అట్టి మంజూరు తేదీ నుండిఒక సం|| అమలులో వుంటుంది. అయితే పిఎఫ్ నుండి అనుమతించబడే
అడ్వాన్సు మంజూరు 3
నెలల
మాత్రమే అమలులో వుంటుంది. (ఆర్టికల్-50)
2. వేతన స్థిరీకరణ వెనుకటి తేదీ నుండి జరిగినప్పుడు
దాని ఆధారంగా టీఏ బకాయిలకు క్లెయిమ్
చేయుటకు
అనుమతించబడును. (ఆర్టికల్-52)
3. ఉద్యోగి ఆప్షన్ ఇచ్చినప్పటి నుండి 6 నెలలలోగా వేతన
స్థిరీకరణ చేయాలి. (ఆర్టికల్ -53)
4. అధికముగా డ్రా చేసిన నిధులకు డ్రాయింగ్ అధికారియే
బాధ్యుడగును. (ఆర్టికల్-54)
5. ఉద్యోగి యొక్క వేతనములో 3వ వంతుకు మించి పే బిల్లునందు
తగ్గింపులు వుండరాదు. (ఆర్టికల్-
58)
6. ఉద్యోగుల జీతభత్యములను తదుపరి నెల మొదటి తేదీన చెల్లించాలి.
7. అన్ని మేనేజిమెంట్లలోని ఉపాధ్యాయులకు ఏప్రిల్ నెల
జీతమును వేసవి సెలవుల ప్రారంభమునకు
ముందు
రోజున చెల్లించాలి. ఆ రోజు సెలవు రోజైనచో మరుసటి రోజున చెల్లించాలి. (జి.ఓ. 287
ఆర్థిక,
తేది. 12.11.1987)
8. ట్రెజరీ ద్వారా జీతం పొందేవారు నెల చివరి రోజుకు5రోజులముందుగా
ట్రెజరీలో బిల్లును ఇవ్వాలి.
(ఆర్టికల్
-73)
9.
డ్రాయింగ్ అధికారిచే సంతకం చేయబడిన ఇంక్రిమెంటు సర్టిఫికెట్ ను జీతపు బిల్లుకు జతపరచాలి.
(ఆర్టికల్-75)
10.
ఉద్యోగి మరణించిన రోజునకు, అతడు మరణించిన సమయమేదైనను, జీతము లేక సెలవు జీతముమొదలగునవి
చెల్లించబడును. సందేహము లేనప్పుడు లీగల్ హైర్ సర్టిఫికెట్ దాఖలు చేయకపోయినను
మరణించిన
ఉద్యోగి వారుసులకు అతని జీతభత్యములు చెల్లించవచ్చును. (ఆర్టికల్-80)
11.
కన్పించకుండా పోయిన ఉద్యోగి మరణించినట్లు ధృవీకరణ అయ్యేవరకు అతని జీతభత్యములను
వారసులకు
చెల్లించరాదు. (ఆర్టికల్ -81), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు - 1972 ప్రకారము 7
సం||లుగా
కనిపించని ఉద్యోగి మరణించినట్లు భావించి అతనికి సంబంధించిన చెల్లింపులను
అనుమతించవచ్చును.
అయితే సంవత్సర కాలంగా కనిపించని ఉద్యోగి కుటుంబమునకు పెన్షన్
చెల్లించు
అవకాశము జి.ఓ. 241 ఆర్థిక,తేది. 10.09.1987 ద్వారా కల్పించబడినది.
12.
పిఎఫ్, జీవిబీమా,వృత్తిపన్ను, సహకార బ్యాంకులకు సంబంధించిన తగ్గింపులు మాత్రమే జీతము
బిల్లు
నుండి అధికారయుత తగ్గింపులుగా పరిగణించబడతాయి (ఆర్టికల్ -85)
13. ఉద్యోగి చెల్లించవలసిన ఆదాయం పన్నును జీతపు బిల్లుల
నుండి డ్రాయింగ్ అధికారే తగ్గించాలి.
(ఆర్టికల్
-86)