We love reading Summer Camp
activities Day - 9 (02.05.2024) Class- 3,4 and 5
Key For Day 8 Activities ( Click Here)
STORY READING :
( పిల్లలూ మీరే ఈ కథకు పేరు పెట్టండి )
దొంగపిల్లి
భాగీరధీ నది ఒడ్డన పెద్ద
జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో జరధ్గవమనే ముసలి గ్రద్ధ ఉండేది. ఆ గ్రద్ధకు
కళ్ళు కనిపించవు అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహరంలో ఆ
గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద పక్షులు బయటకు వెళ్ళినపుడు వాటి పిల్లలకు మంచి
మంచి కథలు చెప్పి నిద్ర పుచ్చేది. ఒక రోజు 'దీర్ఘకర్ణము' అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు
పైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న
జరధ్గవము తొర్రలోంచి బయటకు వచ్చి 'ఎవరక్కడ...?' అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైనే
పోయాయి. తప్పించుకోవటానికి దానికి దారి కనిపించలేదు. ఏదైతే అది అయ్యింది అనుకొని 'అయ్యా ! నా పేరు దీర్ఘకర్ణము నేను పిల్లిని' అని చెప్పింది. వెంటనే జరధ్గవము...' నీవు పిల్లివా! ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో
లేకపోతే నీ ప్రాణాలను తీస్తాను' అంటూ హెచ్చరించింది.
అయ్యా! కోపగించుకోకండి
నేను పుట్టింది పిల్లిజాతి అయినా నాకూ ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు. నేను మాంసం
తినను. పైగా బ్రహ్మచారిని. ఇక్కడి పక్షులు మీరు చాలా మంచివారని చెప్పుకోవటం విని, మీతో స్నేహం చెయ్యాలని వచ్చాను అంది.
దీర్ఘకర్ణుడి మాటలకి జరధ్గవము సంతోషించింది. ఆ రోజు నుండి ఆ రెండు మంచి మిత్రులు
అయ్యాయి. ప్రతిరోజూ దీర్ఘకర్ణుడు సాయంత్రం పూట జరధ్గవము దగ్గరకు వచ్చి ఓ గంట సేపు
కబుర్లు చెప్పి వెళ్ళిపోతుండేవాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి.
చెట్టుపై నున్న పక్షులు
తమ పిల్లలు మాయం అవుతున్నాయన్న సంగతి తెలుసుకున్నాయి. అవన్నీ ఒకరోజు కలిసి
కట్టుగావచ్చి జరధ్గవమును తమ పిల్లలు మాయం అయపోతున్నాయి అన్న విషయం అడిగాయి.
జరధ్గవము తనకు ఏ పాపం తెలియదని చెప్పింది. పక్షులు జరధ్గవము తొర్ర లోపలకు వెళ్ళి
చూసాయి. తొర్ర నిండా పక్షుల ఈకలు, బొమికలు కనిపించాయి. అవన్నీ దీర్ఘకర్ణుడు పక్షి పిల్లలను చంపి తిని జరద్గవము
తొర్రలో తెలివిగా పడేసినవి.
పక్షులన్నీ జరద్గవమే తమ
పిల్లలను చంపి తింటోందని అనుకుని ఆ ముసలి గ్రద్ధను సూదిగా ఉండే తమ ముక్కులతో
పొడిచి చంపాయి. అయ్యా! పిల్లి మాంసాహారి అని తెలిసినా దాని మాయమాటలు నమ్మి దానిని
ఈ చెట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్తి జరిగింది నాకు అని గ్రద్ధ ప్రాణాలు విడిచింది.
చూసారా! పుట్టుకతో వచ్చిన
బుద్ధి పుడకలతో గానీ పోదు పిల్లి మాటలు నమ్మినందుకు ఆ గ్రద్ధకు ఎలాంటి ఆపద
వచ్చిందో. అందుకే మనకి తెలియని వాళ్ళు చెప్పే మాటలను మనం నమ్మరాదు. నమ్మితే
జరద్గవములా మనం కూడా చిక్కుల్లో పడతాం.
STORY READING :
( Kids name this story yourself)
thief
There is a big juvvi tree on the bank of river Bhagiradi. There was an old eagle named Zaradhgava in the trunk of that tree. The eagle could not see the eyes, so the birds on that tree used to give some of the food they got to the eagle. When the eagle birds went out, they told their children good stories and fell asleep. One day a cat named ' Edgikarnamu ' climbed up the tree to eat the baby birds. Seeing the cat, the baby birds screamed in fear. Hearing those screams, Zaradhgava came out of the shed and asked ' Where... ?' She shouted angrily. The cat's life was lost due to that scream. There was no way for it to escape. Whatever happened, thought ' Oi! My name is a rectangle, I am a cat . Don't do it immediately... ' You are a cat! Get down from this tree first, otherwise I will take your life, ' she warned.
Yay! Don't get angry, I was born as a cat, but I didn't get the Buddhas of that race. I don't eat meat. A celibate. She said that the birds here are saying that you are very good and I have come to befriend you. Jaradgava was happy at the words of Irkishkarna. From that day the two became good friends. Every day Irkishkarna used to come to Zaradhgawam in the evening and chat for an hour and leave. A few days passed.
The birds on the tree knew that their children were perishing. All of them came together one day and asked Zaradhgava about their children dying. Zarathgava says he knows no sin. The birds went inside the jaradhgava and looked. Birds' feathers and feathers were found in the shed. All of them were killed and eaten by Irkishkarna and cleverly thrown in Jaradgava's thorra.
All the birds stabbed the old eagle with their needle-like beaks, thinking that it was Jaradgava who was killing and eating their young. Yay! Gradha gave up her life saying that I was punished enough for not allowing the cat to reach this tree even though I knew it was a carnivore.
Did you see! What kind of danger did that eagle face for believing the cat's words even with the fragments of wisdom born from birth. That is why we should not believe the words of those who do not know us. If we believe, we will also get into trouble like Jaradgavam.
తెలుగు కృత్యం
( పిల్లలూ వీచిని మీ తల్లిదండ్రుల సహాయంతో మీ నోటు పుస్తకంలో రాసుకొని , సమాధానాలు మీ ఉపాధ్యాయులకు పంపించండి)
ENGLISH Activity
MATHS Activity
Do
the Multiplication.
(నోట్ బుక్‌లో వ్రాసి లేదా ప్రింట్ తీసి
, సమస్యలు సాధించి మీ టీచర్/స్కూల్ గ్రూప్‌కి వాట్సాప్ చేయండి.)
( Print or
Write on note book and do the Multiplication and watsapp to your teacher/
school group.)
Thinking Puzzle :