We love reading Summer Camp activities
Day - 10 (03.05.2024) Class- 3,4 and 5
Key For Day 10 Activities ( Click Here)
STORY READING :
ఆ పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.
"నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో
పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి అప్పగించారాదూ!” అన్నాడు.
భగవంతుడు వెంటనే
"అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే
ఉంటాయి” అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.
ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.
ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు రైతు.
కురిసింది. ఆగమనగానే ఆగింది.
తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో గాలిని విసరమన్నాడు. విసిరింది.
విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి.
పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా
ఉంది.
కోతల కాలం వచ్చింది.
రైతు ఒక కంకి కోశాడు.
గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు. లోపల ధాన్యం లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ
ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది.
"హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు.
"వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను.
కాలానుగుణంగా, ఋతువులకి తగట్టుగా. అయితే పైరు పాడైపోయిందే!
ఏం?
ఎందుకు?"
భగవంతుడు నవ్వాడు. "నా ఆధీనంలో గాలి బలంగా వీచేది. అప్పుడు
అమ్మను కౌగిలించుకొనే పిల్లల్లా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా జోచ్చుకొని గట్టిగా పట్టుకొనేవి. వాన తక్కువైనా నీటికోసం వేళ్లను నాలుగు
పక్కలకు పాకించేది. పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.
అన్ని వసతులు నువ్వే
కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని
అందించాలని దానికి తెలీదు.
"నాకు నీ గాలి, వాన,ఎండ వద్దు. నువ్వే ఉంచుకో". అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని
తిరిగిచ్చేశాడు.
నీతి
జీవితం లో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు.
కష్టాలు మిమ్మల్ని అదిమేటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సవాళ్ళే మనిషికి
పరిపూర్ణతను ఇస్తాయి
STORY READING :
A small farmer once had a severe fight with that divine person.
" What do you know about Piru ? You make it rain when you like. You make the wind blow at that time. There is a big quarrel with you. Don't you hand over all that work to a farmer without speaking!" He said.
The Lord immediately said, "So! But from today the wind , rain and sun will all be in your ajamais" and he was satisfied.
That farmer's happiness knows no bounds.
Seasons have changed. "Wana! It should rain," said the farmer.
rained Stopped as soon as it arrived.
Wetland plowing. He threw the wind at the desired speed. threw
Sowed Wind , rain and sun all happened according to the word of the farmer.
The piru grew green and vegetated. The farm is very pleasant to see.
Harvest season has arrived.
The farmer cut a field. Nut grinder choo sadu. He was excited. No grain inside. He looked at everything saying yarn, bran , another , another. No grain at all. Everything is just fluff.
" Harry God!" He called out angrily.
" I have used rain , sun and wind in appropriate doses. Seasonally , according to the seasons. But the piru is spoiled! What ? Why ?"
God smiled. "In my possession, the wind would blow strongly. Then like children hugging their mother, their roots would dig deep into the earth and hold on tightly. Even if the rain was scanty, they would stretch their fingers in four directions for water. Only if there was a struggle would the trees grow strong to protect themselves.
Piru became lazy when you provided all the facilities yourself. It does not know how to provide healthy grain unless it has been grown with a smile.
" I don't want your wind , rain , sun. Keep it yourself". Saying that, the farmer returned what God had given him.
Moral
If everything in life dies well , then there will be no more boredom and emptiness. You become more resourceful when you are faced with difficulties. Challenges make a man perfect
తెలుగు కృత్యం
( పిల్లలూ వీచిని మీ తల్లిదండ్రుల సహాయంతో మీ నోటు పుస్తకంలో రాసుకొని , సమాధానాలు మీ ఉపాధ్యాయులకు పంపించండి)
ENGLISH Activity
MATHS Activity
Do the Divisions.
(నోట్ బుక్‌లో వ్రాసి లేదా ప్రింట్ తీసి , సమస్యలు సాధించి మీ టీచర్/స్కూల్ గ్రూప్‌కి వాట్సాప్ చేయండి.)
( Print or Write on note book and do the Divisions and watsapp to your teacher/ school group.)
Thinking Puzzle :