- విద్యార్థులకు స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్
- కేజీబీవీ, వివిధ రెసిడెన్షియల్ స్కూళ్ల 9వ తరగతి విద్యార్థులకు అవకాశం
- 2024-25 2 ລ້ నుంచి అమలు
- జీవో విడుదల చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీ, వివిధ రెసిడెన్షియల్
స్కూళ్ల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం
గ్లోబల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రా మ్ను అందుబాటులోకి తెచ్చింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి వీరిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో
ఉన్న ఆయా రెసిడెన్షియల్ స్కూళ్లకు కొద్దిరోజులు పంపించనున్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాల
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించేందుకు, వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అందుకునేందుకు ప్రభుత్వం ఇప్ప టికే పలు విజయవంతమైన
సంస్కరణలను అమలు చేస్తోంది.
ఈ క్రమంలో రాష్ట్రంలోని 352 కేజీబీవీలు, 50 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 17,221 మంది 9వ తరగతి విద్యార్థులకు
స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ను అమలు చేయనున్నారు.
ఈ కార్య క్రమం ద్వారా విద్యార్థులు విభిన్న విద్యా వాతావరణాలను తెలుసుకునే అవకాశం, వివిధ ప్రాంతాల విద్యార్థుల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందని, తద్వారా వారి ఆలోచనా పరిధి పెరుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
ఒక్కో స్కూల్ నుంచి 10 శాతం లేదా నలుగురు చొప్పున
విద్యార్థుల ఆసక్తి మేరకు ఈ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేస్తారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాక 15వ తేదీ నుంచి విద్యార్థుల మార్పిడి ప్రోగ్రామ్కు ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం