Type Here to Get Search Results !

ఫంగస్ వృక్ష జాతికి చెందుతుందా లేదా జంతుజాతికి చెందిందా?

0

 


ఫంగస్‌ పురాతనమైన రాళ్లపై చెట్ల వేళ్లపై భూభాగంపై ఏర్పడే బూజు. దీనిని 'శిలీంధ్రం' అని కూడా అంటారు. పై చెప్పిన వాటిపై మనం చూసే ఫంగస్‌ పెరుగుతున్న భాగం. అయితే పైకి మనకు కనిపించేది చాలా తక్కువ శాతం. ఎక్కువ భాగం అతి సన్నని దారాల రూపంలో భూమి ఉపరితలం కింద వ్యాపించి ఉంటుంది.

ఫంగస్‌ అటు వృక్ష జాతికిగానీ, ఇటు జంతు జాతికిగానీ చెందినదికాదు. అదో ప్రత్యేక జాతి. ఇప్పటి వరకు శాస్త్రజ్ఞులు ఒక లక్ష ఫంగస్‌ రకాలను కనిపెట్ట గలిగారు. కానీ ఫంగస్‌ జాతులు మూడు లక్షల వరకు ఉన్నాయని వారి అంచనా. ఫంగస్‌ స్థిరమైన, దృఢమైన స్థానాల్లో పెరగడం వల్ల అది జంతు జాతి కన్నా వృక్ష జాతికి చెందినదని భావించారు. కానీ మొక్కలలాగ ఫంగస్‌ కిరణజన్య సంయోగక్రియను జరుపలేవు. అంతేకాకుండా వాటి కణాల్లో మొక్కలలో ఉండని జంతువులలో మాత్రమే ఉండే 'చిటిన్‌' అనే పెంకులాంటి పదార్థం ఉంటుంది. ఇదే కాకుండా దానికున్న శారీరక, జన్యులక్షణాల ఆధారంగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఫంగస్‌ మొక్కలకన్నా జంతువుల వైపే మొగ్గు చూపుతుందని తేలింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages