Type Here to Get Search Results !

అరిషడ్వర్గాలు ఏవో మీకు తెలుసా...

0

 

కామము ;  ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.

క్రోధము : కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.

లోభము :  కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.

మోహము : తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.

మదము : తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.

మాత్సర్యము: తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.

ఈ అరిషడ్వర్గాలు శరీరములో చేరి మంచితనాన్ని దొంగిలించి చెడు కర్మలను కలిగించడానికి కారకులగుచున్నారు. అరిషడ్వర్గాలనే దొంగలనుండి జాగ్రత్త వహించితే ముక్తికి మార్గము సులభమవుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages