సంకల్ప శక్తి
👉మనలో అందరికి సంకల్ప శక్తి ఉంటుంది. దినినే ఇచ్చా శక్తి అని కూడా అంటారు...
సాధారణం గా మనము ఒక్క ఆలోచన పై ఎక్కువ సేపు నిలవలేము. ఇది మన మానసిక
దౌర్బల్యము లేదా మనో చాంచల్యం.
మనస్సు కోతి వంటిది అని, కోతి ఒక కొమ్మ మీద నుండి ఇంకోక కొమ్మ పై ఎందుకు ఎగుతుతుందో
దానికే తెలియదు. ఇలానే మనస్సు కూడా ఒక
ఆలోచన నుండి ఇంకోక ఆలోచన పై క్షణకాలం కన్నా తక్కువ సమయంలో మారుతుంది. దానిని
ఒక ఆలోచన మీద నిలిపే తర్ఫీదు ఇవ్వాలి.
సాధారణంగా మనము దేని మీద అయినా నిఘా పెడితే అది మన నియంత్రణ లోకి వస్తుంది.
అలాగే మన ఆలోచనల పై నిఘా పెట్టగలిగితే అవి నియంత్రణ లోకి
వస్తాయి. అప్పుడు మనము ఒక్క ఆలోచన మీద ఎక్కువ సమయం ఉండగలము. తద్వారా మనము మన ఇచ్చా
శక్తి ని పెంచుకోవచ్చు. విశ్వామిత్రుడు
సృష్టి కి ప్రతి సృష్టి చేయగలిగాడు అంటే అది కేవలం తన ఇచ్చా శక్తి తో మాత్రమే. మన
ఆలోచనల పై అదుపు పెట్టి, మనం
ఎల్లప్పుడూ భగవత్ ధ్యానం లో ఉండడం ద్వారా వస్తుంది.