చరిత్రలో ఈరోజు - ఫిబ్రవరి 26 (TODAY IN HISTORY FEBRUARY 26)
సంఘటనలు
- 1975 : భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్రను అహ్మదాబాదులో ప్రారంభం.
- 1993: అలాన్ బోర్డర్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును అధికమించాడు.
జననాలు
- 1802: విక్టర్ హ్యూగో, ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త. (మ.1885)
- 1829: లెవీ స్ట్రాస్, బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో సంస్థ స్థాపకుడు జననం.
- 1932: హేమలతా లవణం, సామాజిక సేవకురాలు జననం.
- 1962:: శివాజీ రాజా, తెలుగు నటుడు.
- 1982: ఎలకా వేణుగోపాలరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రికెట్ ఆటగాడు.
మరణాలు
- 1869: అఫ్జల్ ఉద్దౌలా, నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. (జ.1827)
- 1887: ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు. (జ.1865)
- 1908: కొడాలి లక్ష్మీనారాయణ , గ్రంథాలయ పరిశోధకులు, ఉత్తమ ఉపాధ్యాయులు. (జ.1908)
- 1962: అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1882)
- 1966: భారతీయ అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు వి.డి.సావర్కర్ మరణం. (జ.1883).
- 2004: శంకర్‌రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
- 2019: తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత, విమర్శకుడు, ద్వాదశి నాగేశ్వరశాస్త్రి
పండుగలు , జాతీయ దినాలు
- కువైట్ విముక్తి దినం.