ఓ సినిమా మీద
విపరీతమైన హైప్ ఏర్పడాలంటే పాటలు క్లిక్ అవ్వాలి. పాటలు బాగుంటే సినిమా మీద ఆటోమెటిగ్గా
అంచనాలు పెరుగుతున్నాయి. ఒక్క పాట క్లిక్.. ఓపెనింగ్స్ తెచ్చిన పెట్టిన సందర్భాలెన్నో
ఉన్నాయి. అలా ఒక్క పాట క్లిక్ అయినా చాలు అని మేకర్లు అనుకుంటూ ఉంటున్నారు. అసలే ఇప్పుడు
ఒక పాట ట్రెండింగ్‌లోకి వస్తే రీల్స్, షార్ట్స్ అంటూ
సోషల్ మీడియా మొత్తం ఆ సినిమా గురించి చర్చలు జరుగుతుంటాయి. అలా సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ కాంబోలో వచ్చిన ఊరుపేరు భైరవకోన సినిమాలోంచి నిజమే
నే చెబుతున్నా అనే పాట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ పాట రిలిక్స్ మీకోసం..
Nijame Ne
Chebutunna Song Lyrics from Ooru Peru Bhairavakona | Sundeep Kishan | Sid
Sriram | VI Anand | Shekar Chandra
తానానే నానానే
నానానేనా
తానానే నానానేనే
తానానే నానానే
నానానేనా
తారారే రారారరే
నిజమే నే చెబుతున్నా
జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న
ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా
వెళ్లకే వదిలెళ్ళకే
నా గుండెని దోచేసిలా
చల్లకే వెదజల్లకే
నా చుట్టూ రంగుల్నిలా
తానారే రారారె
రారారెనా
తారారె నానారేరే
తానారే నానారె
తానారెనా
తారారే రారారరే
వెన్నెల తెలుసే
నాకు,
వర్షం తెలుసే
నిను కలిసాకే
వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు, మాటా తెలుసే
మౌనంలో దాగుండె
మాటలు తెలుసే
కన్నుల్తో చూసేది
కొంచమే
గుండెల్లో లోతే
కనిపించెనే
పైపైన రూపాలు
కాదులే
లోలోపలి ప్రేమే
చూడాలిలే
నిజమే నే చెబుతున్న
జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న
ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న
పెదవులతోటి పిలిచే
పిలుపులకన్నా
మనసారా ఓ సైగే
చాలంటున్నా
అడుగులతోటి దూరం
కొలిచేకన్నా
దూరాన్ని గుర్తించని
పయణంకానా
నీడల్లే వస్తానే
నీ జతై
తోడల్లే ఉంటానే
నీ కథై
ఓ ఇనుప పలకంటి
గుండెపై
కవితల్ని రాసావు
దేవతై
నిజమే నే చెబుతున్నా
జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్నా
ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న
ఆ హా హా