Type Here to Get Search Results !

Service సందేహాలు - సమాధానాలు

0

 

సందేహాలు - సమాధానాలు -

 ప్రశ్న:

ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవు వాడుకోవాలి??

జవాబు:

జీఓ.186 ; ఆర్ధిక ; తేదీ:23.7.75 ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవు గా వాడుకోవచ్చు.

 

. ప్రశ్న:

ఒక టీచర్ ఏదైనా పరీక్ష రాయాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలా??

జవాబు:

 సర్వీసులో ఉండి ఏ పరీక్ష రాయాలన్నా పై అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.

•••••••••

. ప్రశ్న:

ఒక sgt వేరే dsc లో sa గా ఎంపిక ఐతే వేతన రక్షణ ఉంటుందా?అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా??

జవాబు:

మీరు పై అధికారి అనుమతి తో relieve ఐతే FR.22(a) ప్రకారం రక్షణ ఉంటుంది. ఇంక్రిమెంట్ కి మాత్రం రక్షణ ఉండదు.sa గా చేరిన సంవత్సరం నకు మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తారు.

•••••••••

. ప్రశ్న:

నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను.పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా??

జవాబు:

పెన్షన్ ను ఆదాయం గా చూపాలి.గ్రాట్యుటీ, కమ్యుటేషన్,సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.

•••••••••

. ప్రశ్న:

నేను బదిలీ అయ్యాను.పాత మండలం లో చాలా ఎంట్రీ లు వేయలేదు.ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు.ఆ ఎంట్రీ ల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి??

జవాబు:

సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చు.🙋🏻‍♂️

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages