1.
చేయి జారిన బంధం నోరు జారిన మాట తిరిగి రావు.అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది.
2.
మనం చేసే ప్రయత్నం ఎన్నటికీ వృధా కాదు. వైఫల్యం అన్నది ఏ ఒక్కరికి శాశ్వతం కాదు.కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది
3.
ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకు.నీ మీద ఉంచిన నమ్మకాన్ని,గౌరవాన్ని కోల్పోయావని త్వరలో తెలుస్తుంది.మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతోకాలం నిలువదు.
4.
"మనం ఎంచుకున్న దారి సరైనదైనప్పుడు నిదానంగా వెళ్లినా పర్లేదు గమ్యం చేరిపోతాము. ఎంచుకునే దారి తప్పైనప్పుడు పరిగెత్తుకువెళ్లినా ఎప్పటికి గమ్యం చేరలేము."
5.
"కొన్ని గాయాలు నొప్పిని కలిగిస్తాయి. కొన్ని గాయాలు కనువిప్పుని కలిగిస్తాయి."
6.
మనిషికి "అసూయ" ఎక్కువైతే
ఆనందం దూరమవుతుంది.
"అహంకారం" ఎక్కువైతే
అందరూ దూరం అవుతారు.
అందుకే మనిషి "ఎదిగే" కొద్దీ
ఒదిగి ఉండడం నేర్చుకోవాలి.
7.
ఒకరికి "మాట" ఇవ్వడం
మంచినీళ్ళు తాగినంత సులభం.
"నిలబెట్టు"కోవడమే
నీళ్ళ మీద నడిచినంత కష్టం.
అందుకే ఎవరికైనా మాట "ఇచ్చేముందు"
నిలబెట్టుకునే సామర్థ్యం ఉందో లేదో చూసుకోవాలి.
8.