Type Here to Get Search Results !

పాల పిట్ట - సజ్జ కంకి

0



 

మా ఊరి చెరువుగట్టుమీద ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుమీద ఒక పాలపిట్ట గూడు కట్టుకొని ఉంది. దాని పిల్లలు మూడు బుజ్జిపిట్టలు. ఆ బుజ్జిపిట్టలు చూడముచ్చటగా ఉంటాయి. వాటి అచ్చటా ముచ్చటా చూసుకొంటూ పాలపిట్ట సంతోషంగా

ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక సజ్జచేను ఉంది.

 

               ఒకనాడు ఒక సజ్జకంకిని తెచ్చింది పాలపిట్ట.తన బుజ్జిపిట్టలకు పెట్టింది. కానీ ఆ సజ్జగింజలు చాలా గట్టిగా ఉన్నాయి. బుజ్జిపిట్టలు తినలేకపోయాయి. ఒకరోజు అనుకోకుండా సజ్జకంకి జారి చెట్టుకింద ఉన్న మంటలో పడింది. మంట ఆరిపోయాక పాలపిట్ట సజ్జకంకిని తీసి గింజలను బుజ్జిపిట్టలకు పెట్టింది. అవి కరకరలాడుతూ రుచిగా ఉండేసరికి బుజ్జిపిట్టలు లొట్టలువేసుకొంటూ ఆరగించాయి. అప్పుడు పాలపిట్ట ఇంతకాలం పచ్చిగింజలు తిన్నా ఇంత రుచిగా లేవు. కాల్చితింటేనే రుచిగా ఉంటాయని అనుకుంది. ఓహో! అందుకేనేమో ఈ మనుషులు వేరుసెనగ గింజలు వేయించుకొని తింటారని అనుకుంది.

 

పాల పిట్ట (Indian Roller / Neelkanth)

  • పాల పిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి. దీనిని "Indian Roller", "Blue Jay" అనే ఇంగ్లీష్ పేర్లతో కూడా పిలుస్తారు.
  • దీని రెక్కలు నీలం, తెలుపు, గోధుమ, నలుపు రంగులతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.
  • పొటో కోసం "Indian Roller bird" అని వెతికితే ప్రముఖ స్టాక్ ఫోటోల వెబ్సైట్‌లలో చాలా ఫోటోలు ఉంటాయి


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages