Type Here to Get Search Results !

గ, ఘ - అక్షరాలతో జాతీయాలు

0

 

గంగి గోవు :  చాల మంచి వాడని అర్థం.

 

గం.భా.స. : గంగాభాగీరధీ సమానురాలైన.వితంతువులకు గౌరవపూర్వకంగా సూచించేందుకు వాడుతుండేవారు. భర్త మరణించిన స్త్రీ కదా అని చులకనగా చూడకుండా గంగ అంతటి పవిత్రురాలుగా భావించేవారు.[గంగాభాగీరథీ సమానురాలు ]

 

గంట వాయించు : గంటవాయించు అనే జాతీయాన్ని మరిచిపోయాడు, లేదా మోసగించాడు అనే సందర్భాలలో వాడతారు. దేవుడికి గంటవాయిస్తూ నైవేద్యం పెడతారు. ఆయన ఎటూ ఆరగించడు. పేరుకు భగవంతుడికి నైవేద్యమే కానీ ఆరగించేవారు భక్తులే.అనవసర ఆర్భాటం చేసి అసత్య ప్రమాణాలు చేసేవారిని గంటవాయించడం అనే జాతీయంతో పోల్చుతారు.

 

గండం గడిచింది : కష్టాలు తొలిగాయాయని అర్థం. ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు

 

గండగత్తెర (పని) :  గండభేరుండం : గండభేరుండం (Gandabherunda) రెండు తలల డేగ/పక్షి రూపంలో ఉండే పురాణజీవి.

 

గండి పడింది : ఉదా: వాని రాబడికి గండి పడింది. ఆదాయం తగ్గితే ఈ మాట వాడతారు . కాలవకు గండి పడితే అందులోని నీరంతా పక్కదారి పట్టి వృధాగా పోతుందు. అదేవిధగా ఒకరి సంపాదన అంతా వృధాగా పోతుంటే ఈ జాతీయాన్ని వాడుతారు.

 

గంపశ్రాద్ధం :  గంపలా గందరగోళంగా ఉండే తలకట్టు" లేదా "గంపలా చెదిరిన జట్టు". ఇది గంపతో పోల్చదగిన విధంగా చెదిరిపోయిన లేదా గజిబిజిగా ఉన్న జుట్టును సూచిస్తుంది.

 

గంపెడంత ఆశతో వచ్చారు : ఎంతో ఆశ పెట్టుకొని వచ్చారు: ఉదా: వారు నీమీద గంపెడంత ఆశతో వచ్చారు.

 

గంతకు తగ్గ బొంత : ఎవరికి తగ్గది వారికి: ఉదా: గంతకు తగ్గ బొంత ఎక్కడో ఒక చోట రాసి పెట్టే వుంటుంది. (సంబందాల గురించి)

 

గగన కుసుమం : ఆకాశ కుసుమం, అది ఉండదు.అలభ్య వస్తువు, అవసరానికి పనికిరాని విషయం, దాన్ని తేవటం మన వల్లకాదు

 

గగనమగు : క్షీణించిపోవు ( ఈ రోజుల్లో నిజాయితి పరులు గగనమై పోయారు.) ఏదైనా అరుదుగా వుంటే ఈ మాటను వాడతారు.

 

గచ్చపొద :  వివరణ: గచ్చకాయలు: అనేవి ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగించే ఒక రకమైన ఆట వస్తువులు. గచ్చపొద: అంటే అలాంటి గచ్చకాయలు కాయలుగా ఉండే ఒక పొద లేదా చిన్న మొక్క

 

గజకచ్ఛపాలు : గజకచ్ఛపాలు అనే పదం "ఏనుగు మరియు తాబేలు" అనే అర్థాన్ని సూచిస్తుంది మరియు తరచుగా గరుత్మంతుడు ఒక కొమ్మను ఏనుగు, తాబేలు కొట్టుకుంటూ ఉన్న ఒడ్డున విడిచిపెట్టిన ఒక పురాణ కథనాన్ని సూచిస్తుంది. ఈ పదం అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలను కూడా సూచిస్తుంది.

 

గజగర్భం – గాంధారిగర్భం : ప్రతిఫలం లేని నిష్ఫల ప్రయత్నం లేదా వ్యర్థమైన పని. ఏనుగు గర్భవతి అయినప్పుడు అది ఎంత కాలం గర్భాన్ని నిలుపుకుంటుందో తెలియదు. అలాగే, ఎప్పుడో ఒకప్పుడు జరిగే అవకాశం ఉన్న ఏదైనా పనిని ఆశించి, దాని కోసం కాలం గడపడాన్ని "గజగర్భం - గాంధారిగర్భం" అంటారు.

 

గజ స్నానము : ఏనుగులు స్నానం చేయడమనేది ఒక దీర్ఘ కాలిక క్రీడ. అవి మడుగు జొచ్చి గంటల తరబడి స్నానం చేస్తాయి. అలా ఎవరైనా ఎక్కువ సేపు స్నానం చేస్తే గజ స్నానం అంటారు.

 

గజ దంత పరీక్ష : అందరికీ తెలిసిందే తెలుసుకోవటం.అనవసరమైన పని . ఏనుగుకు ఉండే దంతాలేవో పైకి కనిపిస్తూనే ఉంటాయి. అయినా పనిగట్టుకొని మరీ దగ్గరకు కూడా వెళ్ళి ఎన్ని దంతాలున్నాయని పరీక్షించటం అనవసరమైన పని .

 

గజదాహం : ఏనుగుకు దాహం వేస్తే అది పెద్ద జంతువు కనుక చాలా ఎక్కువ నీళ్ళు తాగుతుందన్న భావన.అత్యాశ, దురాశ, కొద్దివాటితో తృప్తి పడడు

 

గజరుగజరులు పోవు : పిండి పిండి యగు

 

గజ్జెలగుర్రం :

 

గణపతి పూజ : ముందుగా జరిపేది గణపతి పూజ. ప్రమద గణాలకు అధిపతి కనుక వినాయకుడిని గణపతి అని అన్నారు.

 

గట గటా : వారు గట గటా నీరు త్రాగు తున్నారు.

 

గట్టెక్కాడు : దీనికి అర్థం: కష్టాలు తొలగి పోయాయని అని అర్థం; హమ్మయ్య అతని కష్టాలు నేటితో గట్టెకాయి అని అంటుంటారు.

 

గడ కర్రలా పెరిగాడు :  ఉదా: వాడు గడ కర్రలా పెరిగాడు ఏం లాభం?. ఒక మనిషి ఒడ్డూ పొడువు బాగా వుండి ఏ పనీ చేత కాక పోతే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

 

గట్టి కొమ్మ : బాగా ఆదుకునే మనిషి . ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దూకే ప్రయత్నం చేసేటప్పుడు ఆధారంగా గట్టి కొమ్మ దొరికితే క్షేమంగా అవతల వైపునకు చేరవచ్చు. అదే వోటి కొమ్మ అయితే మధ్యలోనే విరిగి ప్రమాదం సంభవించవచ్చు.

 

గట్టివాడే.....  : చాల తెలివైన వాడిని గురించి ఈ మాట వాడతారు. ఉదా: వాడు గట్టివాడె.... పరీక్షల్లో మంచి మార్కులే తెచ్చుకున్నాడు.

 

గడ్డం దువ్వటం : విజయ గర్వాన్ని ప్రకటించటం, సంతోషాన్ని వ్యక్త పరచటం. మీసం మెలేయటం, గడ్డం దువ్వటం

 

గడ్డి తింటున్నాడు : లంచం మేయటం, అవినీతికి పాల్పడటం. వాడు నానా గడ్డి తింటున్నాడు. (గడ్డి మేస్తున్నాడు)

 

గడ్డి పీకుతున్నారా ఇంత సేపు : ఏమిచేస్తున్నావు ఇంత సేపు అని అడగడానికి కోపంగా అనండము. ఉదా: గడ్డి పీకు తున్నారా ఇంత సేపు?,,,

 

గడ్డి పోసకు కూడ సరి పోలరు : అత్యల్పమైనది అర్థం.

 

గడ్డి వామి దగ్గర కుక్క కాపల : (తను తినదు, ఆవులను తిననీయదు.) వాడు తినడు వేరెవరిని తిననీయడు. అటువంటి సందర్భంలో ఈ మాట వాడతారు

 

గడ్డీగాదం : నానా చెత్త .గాదం అంటే ఆకు, కసవు . చిందరవందరగా పడిన గడ్డి, ఆకులు, కసవు .అంతగా విలువలేని పదార్థాలు


గడ్డపార మింగుదామన్నట్టు : తెలివితక్కువ తనం, ప్రాణహాని

 

గడ్లెఏసుడు : ప్రాణం పోయే ముందు గడ్డిపైన పడుకో బెట్టడం (ఇది ఓ ఆచారం)

 

గతజల సేతుబంధం : విషయం జరిగాక దాని నివారణోపాయాలు చెప్పటం

 

గతుక్కు మన్నాడు : అంతా చెప్పాక నాలిక్కరుచుకున్నాడు. గతుక్కమన్నాడు. చెప్పకూడనిదేదో పొరబాటున చెప్పేస్తే అప్పుడు అతని మనస్సులో జరిగే ఘర్షణకు ముఖంలో కనబడే ఆందోళనను ఈ జాతీయం ద్వారా చెప్తారు.

 

గప్పగప్ప : ఘుమఘుమ సువాసనలు ఘుమఘుమలాడటం, పరిమళాలు వ్యాపించటం

 

గప్పాలు కొడుతున్నాడు : తన గురించి గొప్పలు చెప్పు కుంటున్నాడు.

 

గబ్బిలాయి : గబ్బిలాయిని అపశకునపు పక్షిగాను, అందవికారమైనది గాను, దురదృష్ణమునకు మారు పేరుగాను దారిద్ర్యానికి కారణంగాను ఉటంకిస్తుంటారు. నిజానికి గబ్బిలము అందవికారముగాను, అది పూర్తి స్థాయి జంతువుగాను కాకుండా.... ఒక పక్షిగాను కాకుండ వుంటుండి. అది కనబడిన వెంటనే దానిని వెంబడించి తరుముతారు. అది ప్రవేశించిన ఇంటిలో దరిద్రము తాండవిస్తుందని నమ్ముతారు ప్రజలు. ఆవిధంగా నిందా వాచకముగా ఇతరులను నించించే టప్పుడు..... గబ్బిలాయి మొఖం, అని. తెలివి లేనివాడనే అర్థంలోను ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

 

గర గర : అసూయ పడటం . కళ్ళలో దుమ్ము, ధూళి పడ్డప్పుడు లేదా కంటికేవైనా అంటువ్యాధుల్లాంటివి సోకినప్పుడు గరగరలాడుతున్నాయంటారు. ఎదురుగా ఉన్న దాన్ని అలాంటి స్థితిలో ఎవరూ చూడలేరు. ఎంతో బాధగా ఉంటుంది. ఎదుటివారి అభివృద్ధి చూడలేని, ఓర్వలేని అసూయాగుణం ఉన్న స్థితి.

 

గరంగరంగా ఉన్నాడు : కోపంగా ఉన్నాడు. ఎవరైనా కోపంగా వున్నారంటే.... వాడు గరంగరంగా వున్నాడు జాగ్రత్త అని ముందుగానే హెచ్చరిస్తారు. ఆ సందర్భంగా ఈ మాటను వాడుతారు.

 

గ్రహణం పట్టినట్టు : అభివృద్ధి క్షీణించటం, ఎలాంటి ఎదుగుదల లేకపోవటం తేజోవిహీనమై ఉండటం. ఉదా: వానికి గ్రహణం పట్టినట్లుంది. వాని చేసే పనులన్నీ విఫలమౌతున్నాయి. అని అంటుంటారు.

 

గయ్యాళి గంప : ఉదా: సూర్య కాంతం గయ్యాళి గంప పాత్రకు పెట్టింది పేరు. ఎక్కువగా నోరు చేసుకునే స్త్రీనిగురించి ఈ మాట వాడతారు సూర్యకాంతం పేరు ఎంత అందమైనదో...... ప్రతి ఒక్కరికి తెలుసు. కాని ఆ పేరును తమ పిల్లలకు పెట్టుకునేందుకు జనం జంకుతారు. కారణం? సూర్య కాంతం గారు గయ్యాళి పాత్రలో జీవించిన విధానం. ఆమె నటనా కౌశల్యానికి ఎన్ని బిరుదులిచ్చినా ..... అవన్ని దీనికంటే పెద్దవి కావు. అవునా? కాదా ? అది ఎవరో పనిగట్టుకొని ఇచ్చిన బిరుదు కాదు. జనబాహుళ్యంలో అనుకోకుండా ఆమెకు సహజంగా అమరిన బిరుదు.

 

గ్రంథసాంగుడు : గ్రంథసాంగుడు అనగా తెలుగులో ఒక వ్యక్తిని సూచించే పదం, దీని అర్థం "గ్రంథాన్ని సాంగ (సంపూర్ణంగా) అధ్యయనం చేసి, తెలుసుకున్నవాడు" అని చెప్పవచ్చు.

 

గల్లంతయ్యాడు : కనబడకుండా పోయాడు. ఉదా: ఆ వరదల్లో ఇద్దరు మరణించగా మరొకడు గల్లంతయ్యాడు.

 

గ్రహణం వీడింది : కష్టాలు తొలిగి పోయాయని అర్థం: ఉదా: ఈ దెబ్బతో వాని గ్రహణం వీడింది అని అటుంటారు.అటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

 

గాలి వాన వెలిసి నట్టుంది : రణ గొణ శబ్దం తర్వాత ప్రశాంతత ఏర్పడితే ఈ మాట వాడతారు

 

గాట్లో పెట్టాలి : ఉదా: వాని నడత సరిగా లేదు: వాడిని గాట్లో పెట్టాలి. చక్కదిద్దాలి అని అర్థము.

 

గాడిద కొడకా : ఊత పదం .... నిందా వాచకం. ఒక తిట్టు. గాడిద అంటే నీచమైనదని. దానితో పోల్చి తిడితారు.

 

గాడిద గత్తర : క్రమశిక్షణ రాహిత్యంతో గోలగోల.మూర్ఖ పద్ధతిలో ఎవరెన్ని చెప్పినా వినకుండా గోల చేయటం

 

గాడిద గుడ్డు : ఇది విరివిగా వాడె ఊత పదం.

 

గాడిదగుడ్డు కంకరపీచు : సృష్టిలో లేనివి . గాడిద పిల్లలను పెడుతుందే కానీ గుడ్లను పెట్టదు. కంకరరాయిని పగలగొడితే ముక్కలవుతుంది కానీ ఆ ముక్కలకు పీచు ఉండదు. ఇలా అసలక్కడ ఏమీ లేదు అని చెప్పటం.అది ఉత్తుత్తి సంగతి. అందులో ఏమీ పస లేదుఅని.

 

గాడిదపిల్ల కోమలం : "గాడిదపిల్ల కోమలికం" లేదా "గాడిదపిల్ల కోమలం" అని కూడా ఉపయోగిస్తారు. దీని అర్థం "ఉన్నంతలో మాయమయ్యే స్వభావం" లేదా "త్వరగా మాసిపోయే కోమలత్వం" అని. ఈ జాతీయాన్ని ఆంగ్లంలో "A superficial charm" లేదా "A transient loveliness" అని అర్థం చేసుకోవచ్చు.

 

గాడిద పొర్లినట్లు : గాడిద బూడిదలో, మట్టిలో పొర్లుతుంటుంది. దున్నపోతులు, పందులు బురదలో పొర్లుతుంటాయి. అలా పొర్లటం వాటికి అసహ్యం అనిపించదు. పైగా ఆనందాన్నీ అనుభవిస్తుంటాయి. ఎక్కడపడితే అక్కడ పొర్లి మర్యాదను పాడుచేసుకోవటం.

 

గాడిలో పడింది : దారిలో పడింది. ఉదా: వాడి నడవడిక ఇప్పుడు గాడిలో పడింది.

 

గాజుల మల్లారం :  గాజుల మల్లారం అంటే సాధారణంగా తెలుగులో గాజులతో తయారుచేసే మాల, ఆభరణం అని అర్థం. ఇది గాజు ముత్యాల మాలగా, పండుగల్లో, పూజలు లేదా ప్రత్యేక సందర్భాలలో ఉపయోగించే అలంకార వస్తువుగా ఉంటుందని అర్థం.

 

గాజులు తొడుక్కుని కూర్చోవటం : అసమర్థత. స్త్రీ అబల అనే భావన.అసమర్థులుగా ఉండిపోవటం

 

గాదంలో దోస : నివురుకప్పిన నిప్పు .దోస తీగకు పిందెలొచ్చి ఓ మోస్తరు కాయలయ్యేదాకా దట్టమైన ఆకుల మధ్యనే ఉండి ఎవరికీ కనిపించవు. అప్పటివరకు ఏమీ లేదనుకున్న వాడికి గొప్ప సంపదలున్నాయని తెలియటం

 

గానుగెద్దు :  నూనె తీసే యంత్రానికి (గానుగకు) కట్టబడిన ఎద్దు అని అర్థం. ఈ ఎద్దు నిరంతరం గానుగ చుట్టూ తిరుగుతూ నూనె తీయడానికి సహాయపడుతుంది, ఇది శ్రమించే, నిరంతరం పనిచేసే జీవికి ప్రతీకగా నిలుస్తుంది.

 

గాంధీ లెక్కలో రాసెయ్  : డబ్బు విషయంలో లెక్కలు వ్రాసెటప్పుడు..... ఎటూ తేలని పద్దులను గాంధీ లెక్కలో రాసెయ్ అని అంటుటారు. అనగా.... అది అంత ప్రధానమైనది కాకపోవడమో..... లేక దొంగ లెక్కలు వ్రాయడానికి అవకాశము కల్పించేదో అయి వుంటుందని అర్థం. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

 

గాయి గాయి : అల్లరి, లోల్లి, సందడి .విపరీతంగా అల్లరి చేయటం.

 

గాలం వేశాడు : ఏదో పన్నాగం పన్నాడు: ఉదా: వాడు ఆ అమ్మాయికి గాలం వేశాడు.

 

గాలికెగిరిపోవటం : ఆచరణలోకి రాకపోవటం ఎవరూ పట్టించుకోకపోవటం

 

గాలి పాట : ఎవరూ పట్టించుకోనిది, ఉపయోగములేనిది అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు.


గాలి మాట : పుకారు: ఆధారం లేని మాట. కల్పితం/

 

గాలి మేడలు : ఊహాలోకంలో విహరిస్తున్నాడు

 

గాలి వాటం మనిషి : ఒక పద్ధతి లేకుండా ఎటు పడితె అటు పోయేవాడు. ఆ అర్థంలో ఈ మాటను వాడుతారు

 

గాలికి ధూళికి : పని పాట లేకుండా..... బేవార్సుగా తిరిగే వాళ్ళ గురించి ఈ జాతీయాన్ని వాడుతారు.

 

గాల్లో తేలి యాడు తున్నాడు : ఉదా: వాడు గాల్లో తేలి యాడు తున్నాడు.... ఊహల్లో విహరిస్తున్నాడని అర్థం.,

 

గిరిగీసుకొని కూర్చున్నాడు ; ఎవారిమాట వినకుండా తన దారినే తాను నడచే వాడిని గురించి ఈ మాట వాడతారు.

 

గిల్లికజ్జాలు పెట్టుకోకు : అనవసరపు తగాదాలు తెచ్చుకోకు... అని అర్థం.

 

గీచి గీచి ఖర్చు పెడుతున్నాడు : వాడు పొదుపుగా ఖర్చు పెడు తున్నాడు. అని ఈ జాతీయానికి అర్థం.

 

గీచిన గీత దాటడు : చెప్పిన మాట వింటాడు. ఉదా: వాడు నేను గీచిన గీత దాటడు.

 

గుక్క తిప్పుకోనీడు : ఊపిరి ఆడనివ్వడు: ఉదా: వాడు వచ్చాడంటే ఊపిరాడ నివ్వడు.

 

గుటకలు మింగు తున్నాడు : ఏదో చెప్పడానికొచ్చి సందేహిస్తున్నాడు: ఉదా: ఏరా గుటకలు మింగు తున్నావు. ధైర్యంగా చెప్పు.

గుంట ఓనమాలు : "అక్షరాభ్యాసం" లేదా "ప్రారంభ విద్య". ఒకరు తెలివితక్కువతనం నుండి బయటపడి, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఈ జాతీయంలో "గుంట" అంటే పాత పద్ధతి లేదా అజ్ఞానాన్ని, "ఓనమాలు" అంటే ప్రాథమిక అక్షరాలు లేదా అక్షరాభ్యాసాన్ని సూచిస్తుంది.

 

గుంటపూలు పూయటం : క్షీణ దశకు చేరుకోవటం, క్షీణించి పోవటం .గుంటలో పెట్టడం అంటే సమాధి చేయటం

 

గుండం కావటం : సర్వం నశించటం. అగ్ని గుండంలో ఏ వస్తువైనా పడితే నిప్పుల సెగకు అది నామరూపాల్లేకుండా పోతుంది. ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు.

 

గుండె రాయి చేసుకొను : దుఖాన్ని దిగమింగు కొని, (అందరు నన్ను మోసం చేసినా గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను.)

 

గుండెలు తీసిన బంటు : అన్నింటికి తెగించిన వాడని .... ఎలాంటి పనైనా చేయగల సమర్థుడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ మాటను వాడతారు.

 

గుండె దిటవు చేసుకో : నిబ్బరించుకో: ఉదా: కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా? గుండె దిటవు చేసుకో? కష్టాలలో వున్న వారిని ఓదార్చడానికి ఈ మాటను వాడతారు.

 

గుండె లోతుల్లోనుండి రావాలి : ఉదా: అసలు విషయం చెప్పు. గుండె లోతుల్లోనుండి రావాలి.

 

గుండె మండు తున్నది : మనసులో బాధగా ఉంది. ఉదా: వాని మాటలు వింటుంటే గుండె మండుతున్నది.

 

గుండెల్లో రాయి పడింది : ఉదా: వాడు చేసిన పని వింటుంటే నా గుండెల్లో రాయి పడింది. (భయమేసింది)

 

గుండ్రాయిలాగా ఉండటం : బొద్దుగా, బలంగా ఉండటం ... ఏ పని చేయకుండా బెల్లం కొట్టిన రాయిలాగ ఒకేచోట కూర్చొని వుండటం.

 

గుంత ఓనమాలు : చదువు తొలిమెట్టు.. గతంలో పిల్లలకు చదువు నేర్పేటప్పుడు వారిని ఇసుకలో అక్షరాలు రాయించే వారు. వాటినే గుంత ఓనమాలు అనేవారు.

 

గుటకలు మ్రింగు : నిజం దాచి అబద్దాలు చెపుతుంటే కలిగే పరిస్థితి. అసలు విషయం చెప్పమంటే గుటకలు మింగు తున్నావు అంటుంటారు.

 

గుట్టు మట్టు : రహస్యం: వాని గుట్టు మట్లు అన్ని నాకు తెలిసాయి.

 

గుట్టుచప్పుడుకాకుండా : రహస్యంగా వచ్చాడని అర్థం.

 

గుడిసెకు చాందినీ అన్నట్టు : అసంబద్ధమైన వ్యవహారం, అనవసరమైన అలంకారం .చిన్న గుడిసె ముందు అందమైన చాందినీని వేస్తే నిరర్థకంగా అనిపిస్తుంది.

 

గుడ్లప్పగించటం : తదేక దృష్టితో చూడటం అలాగే చూస్తూ ఉండిపోవటం.

 

గుడ్లుపేలిపోవడం : బెడిసికొట్టడం, ప్రాణం కటకటలాడడం గుళ్లో ఇలాటి మాటలాడకురా, గుడ్లుపేలిపోతాయి. మధ్నాన్నం రెండున్నరకి పెళ్ళిభోజనం, గుడ్లు పేలిపోయాయి నీ గుడ్లు పేలిపోను! (తిట్టు)

 

గుదికొయ్య : స్వేచ్ఛకు అడ్డు తగిలేది. దొంగ గొడ్డుకి ఒక కొయ్యను మెదకు కడతారు. దాంతో అది ఇష్టం వచ్చినట్టు పరుగులెత్తకుండ అన్ని పశువులతోటి నడుస్తుంది. అడ్డు అదుపు లేకుండా తిరిగే వారిని అదుపులో పెట్టేందుకు ఈ మాట వాడతారు.

 

గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు : తామే గొప్ప అని భావించుకొనే వారు తమకంటే గొప్పవారి దగ్గర అల్పమైన తమ గొప్పతనాలను ప్రకటించుకోవటం.మంత్రజపం, సాధన చేయటంలో గురువు ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాడు. కానీ ఓ శిష్యుడు తాను గురువును మించిన వాడినని భావించుకొంటూ ఆ గురువుకే మంత్రోపదేశం చేయబోయాడట.

 

గురువింద చందాన : తన తప్పులు తెలుకోకుండా ఇతరుల తప్పులు వెతికేవారి గురించి ఈ మట వాడతారు

 

గుర్రపు తోకకు కళ్ళెం పెట్టినట్టు : నిరుపయోగమైన అసంబద్ధమైన, నిరర్ధకమైనపని .

 

గుర్రమెక్కాడు : బాగ తాగి వచ్చిన వాడిని గురించి ఈ మాట వాడతారు

 

గువ్వకుత్తుక : "కుల విద్యకు సాటిలేదు" లేదా "కులం లేకపోయినా విద్య లేకపోవడం తప్పు" అని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక వ్యక్తి విద్యతో తన ప్రతిభను ప్రదర్శించినప్పుడు కులం అడ్డుకాదని, జ్ఞానం ఎప్పుడూ గౌరవప్రదమని సూచిస్తుంది.

 

గువ్వసొచ్చిన ఇల్లు : గువ్వ అంటే గుడ్లగూబ . గుడ్లగూబ ఏదైనా ఇంట్లోకి ప్రవేశిస్తే అశుభం అని భావించి పాడు పెట్టిన కళావిహీనంగా, అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు.

 

గూడు పుఠాణి చేస్తున్నాడు : రహస్య కార్యక్రమం చేస్తున్నాడు. ఉదా: వారు ఏదో గూడు పుఠాణి చేస్తున్నారు.

 

గూబ గుయ్యి మంటుంది : కొడ్తానని బెదిరించడం. ఉదా: పిల్లలూ అరవకండి. అరిస్తే గూబ గుయ్యి మంటుంది. ఇలాంటిదే మరొక్క మాట కూడా ఉంది. అది. వీపు విమానం మోత మోగుతుందీ'


గుండెలు తీసిన బంటు : అన్నింటికి తెగించిన వాడని .... ఎలాంటి పనైనా చేయగల సమర్థుడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ మాటను వాడతారు.

 

గొడ్డుచాకిరి : అమితమైన శ్రమ . ఎంత ఎక్కువ పని అప్ప చెప్పినా గొడ్డు లాగా శ్రమిస్తూ పని చేయటం అదే విదంగా తగినంత ఫలితం లేని శ్రమ చేస్తే కూడా .... గొడ్డు చాకిరి అంటారు.

 

గొర్రె కసాయివాడిని నమ్మినట్టు : నమ్మించి మోసం చేయడం.

 

గొర్రెలకు తోడేలు కాపరి అన్నట్టు : సంరక్షణ బాధ్యతలను శత్రువులకు అప్పగించటం .

 

గొంతు కోశాడు : ఉదా: వాడు మాగొంతు కోశారు.. మోసం చేసారని అర్థం.

 

గొంతెమ్మ కోరికలు : తీర్చలేని కోరికలు: ఉదా: వారివన్ని గొంతెమ్మ కోరికలు.

 

గొంతు పట్టేసి నట్టుంది : మాట పెగలడం లేదు. ఉదా: వాడన్న మాటలకు మాకు గొంతు పట్టేసి నట్టుంది.

 

గొంతు ఎండి పోయింది : దాహంగా వున్నదని అర్థం. బాగా దాహంగా వుంటే ఈ మాటను వాడతారు.

 

గొంతు తడుపుకున్నారు : నీళ్లు తాగారని అర్థం. దాహం తీర్చుకున్నారని అర్థం.

 

గొడ్డుపోవటం : గొడ్డు, గొడ్డుమోతుతనం. వంధ్యత్వం: బిడ్డలు పుట్టక పోవడం: ( ఆమె గొడ్రాలు.) పద ప్రయోగం: దేశం గొడ్డు పోలేదు... ఈ మాత్రం పని ఎక్కడైనా చేసుకొని బ్రతగ్గలను......

 

గోడకు కొట్టిన సున్నం : ఎన్నటికి తిరిగి రానిది... ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఉదా: వాడికి డబ్బు ఇచ్చామంటే.... అది గోడకు కొట్టిన సున్నమె.

 

గోడకు చెప్పినట్టు : నిరర్థక కార్యం, వృధాశ్రమ, ప్రయోజన శూన్యం, స్పందించనితనం ఉదా: నీకు చెప్పినా ఒకటే.... ఆగోడకు చెప్పినా ఒకటే..

 

గోడకు చెవులుంటాయి : ఎవరైనా రహస్యంగా వింటుంటారని అర్థం

 

గోడ మీద పిల్లి వాటం : గోడ మీదున్న పిల్లి ఎటు వైపు దూకు తుందో ఇదిమిద్దంగా చెప్పలేం. అలా స్పస్టత లేని విషయం చెప్పినప్పుడు ఈ మాటను వాడతారు.

 

గొడారి బేరం : ఉదా:  గొడారి బేరం గొడ్డుకు లాభమా?: ఈ సామెతలో, మాదిగ (గొడారి) చేసిన బేరం గొడ్డుకు (ఆవుకు) కూడా లాభదాయకంగా ఉండదని, అనగా వారి బేరసారాలు చాలా తక్కువ లాభదాయకంగా ఉంటాయని లేదా తక్కువ విలువైన వస్తువుల పట్ల వ్యవహరిస్తారని అర్థం వస్తుంది.

 

గొడ్రాలు, గొడ్డుమోతు : గొడ్రాలు అంటే సంతానం లేని స్త్రీ. గొడ్డుమోతు అనేది గొడ్రాలు అనే పదానికి పర్యాయపదంగానూ, లేదా పనికిరాని వ్యక్తిని, నిస్సారమైన దానిని సూచించడానికి వాడే పదం

 

గొప్పోళ్లగోత్రాలు : పైపై మెరుగులని అర్థం.

 

గొంతులో (పచ్చి) వెలక్కాయ : మనసులో ఉన్నది చెప్పలేని, మాటలు బలంగా ఆపి పెగలకుండా ఉన్న పరిస్థితి.

 

గొంతెమ్మ కోరిక : అంటే యేమీ సాధ్యం కాకపోయిన లేదా తీరని కోరికలు; మనసులో ఉండి చెప్పలేని కోరికలను సూచిస్తుంది.

గొర్రెకు బెత్తెడే తోక : ఎంత సంపాదించినా మిగలదు

 

గొర్రె దాటు వ్వవహారం : వారిది గొర్రె దాటు వ్యవహారం అంటుంటారు. అనగా స్వంత అభిప్రాయం లేకుండా ఎవరో చెప్పిన దాని ప్రకారము నడుచుకునే వారిని గురించి ఈ మాట వాడతారు. వివరణ. గొర్రెల గుంపులో ఒక్క పొట్టేలు వుంటుంది. అది ఆ గొర్రెల గుంపుకు నాయకత్వం వహిస్తుంటుంది. అది ముందు నడుస్తుంటే మిగతా గొర్రెలు తల వంచుకొని దాని వెంబడే నడుస్తుంటాయి.. దారి మద్యలో ఏదేని చిన్న కాలువ గాని, చిన్న కంచె గాని అడ్డువస్తే గొర్రెలన్ని సందేహిస్తాయి దానిని దాటడానికి పొట్టెలతో సహా. కాని ఆ గొర్రెల కాపరి ఆ పొట్టేలుని దాన్ని దాటిస్తే మిగా గొర్రెలన్ని దాన్ని అనుసరించి వాటంతట అవే దాన్ని దాటేస్తాయి. దాన్ని అనుసరించి ఈ జాతీయం పుట్టింది.

 

గోచీలు ఎగ్గట్టారు : పోట్లాటకు సిద్ధపడ్డారని అర్థం: ఉదా:....వారిపై పోట్లాటకు వీరు గోచీలు ఎగ్గట్టారు.

 

గోడచేర్పు : గోడచేర్పు అంటే సాధారణంగా ఒక వ్యక్తిని జడుడు, అంధత్వం కలిగినవాడిగా, మూర్ఖుడిగా, జ్ఞాన లోటుతో కూడినవాడిగా అనడం

 

గోతికాడ నక్కలాగ కూర్చున్నాడు : అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడని అర్థం. (చెడుపనికి)

 

గోతిలో పడ్డాడు : కష్టాలలో పడ్డాడని అర్థం. ఉదా: వాడు ఎంతో ఆలోసించి పనిచేసినా చివరకు గోతిలో పడ్డాడు.

 

గోముఖ వ్యాఘ్రం : గోముఖ వ్యాఘ్రం అంటే 'ఆవు ముఖం ఉన్న పులి' అని అర్థం, అయితే ఇది ఒక శబ్దార్థం మాత్రమే కాదు, బయటకు సాధువుగా కనిపించి లోపల క్రూరంగా ఉండే మోసపూరిత వ్యక్తిని లేదా పరిస్థితిని సూచిస్తుంది. ఇది "మేకవన్నె పులులు", "పయోముఖ విషకుంభాలు" వంటి వాటితో పాటు తరచుగా ఉపయోగించే పదం.

 

గోరోజనం :


 

గోవత్సం :  గోవత్సం అంటే ఆవు దూడ. సంస్కృత మూలాలున్న ఈ పదం, ఆవుతో పాటు ఉండే దాని పిల్ల, అంటే ఆ దూడను సూచిస్తుంది.

 

గోదావరిలో కలుపు : వృధా చేయడం: గోదాట్లో కలిపెయ్. ఏదైనా వృధా అయిందంటే..... గోదాట్లో కలిసిపోయిందని అంటుంటారు.

 

గోజారు తున్నాడు : గీచి గీచి బేర మాడుతున్నాడని అర్థం.

 

గోడకు చెవులుంటాయి : ఈ రహస్యాన్ని మరొకరు వింటున్నారని అర్థం.

 

గోడమీద పిల్లి : గోడ మీద పిల్లి ఎటువైపు దూకుతుందో తెలియదు. అలా సందేహాస్పదంగా వున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు.

 

గోతులు త్రవ్వుతున్నాడు : ఎవరికో కష్టాలు కలిగించే పనిచేస్తున్నాడని అర్థం... ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఉదా: వాడు వెనక గోతులు త్రవ్వుతునాడు.


 

గోరంత : స్వల్ప పరిమాణంలో ఉన్నది, చాలాకొద్దిగా, చిన్నది. కొండంత అంటే ఎంతో పెద్దది అని గోరంత దీపం కొండంత వెలుగు" ఒక సామెతలో ఈ పద ప్రయోగము

 

గోరంతను కొండంత చేయటం : అతి చిన్న విషయాన్ని ఎంతో పెద్దదిగా చెయ్యటం

 

గోరోజనం : గోవు పిత్తాశయం నుంచి వెలువడే పదార్థమిది. వైద్యంలో దీనికి గొప్ప విలువే ఉంది. అహంకారం, తల బిరుసు తనం లాంటి అర్థాల్లో వాడికి గోరోజనం ఎక్కువే లేండి' అంటారు.

 

గోళ్లు గిల్లు కుంటున్నాడు : పని పాట లేకుండా వూరికె కాల యాపన చేసె వారిని ఇలా అంటారు.

 

గోవత్సంగాడు : విలువలేని వాడు .గోవత్సం అంటే ఆవుదూడ.ఆవు పక్కనున్న దూడలాగా పెద్దల పక్కనుంటూ సొంత వ్యక్తిత్వం లేకుండా ఆ పెద్దల ననుసరించే వాడు.

 

గోవింద.... గోవింద : అంతా అయి పోయిందని అర్థం: ఉదా: వాని పని అయి పోయింది.... గోవింద గోవింద.


 

గౌతముడి గోవు

గౌరీ కల్యాణం

ఘటశ్రాద్ధం

ఘటకుటీ ప్రభాతం : అనుకున్న పని జరగకపోవటం, ఎంత తప్పించుకుందామనుకున్నా దొరకకూడదనుకొన్న వారికి దొరికి పోవటం .ఘట్టం పన్నులు వసూలు చేసే ప్రదేశం, కుటీ అంటే గుడిసె, ప్రభాతం అంటే ఉదయం .ఓ వ్యాపారి సరుకు అమ్ముకొని వచ్చేటప్పుడు కాపలా వాళ్ల నుంచి తప్పించుకొని కోటలోకి వెళ్ళటానికి ఏవేవో పక్కదారుల్లో ఆ రాత్రంతా తిరిగాడట. ఎటు తిరిగినా మళ్ళా కోటసింహం ద్వారం దగ్గరకు చేరాడు. అయితే అక్కడికి చేరేసరికి ప్రభాతం (సూర్యోదయం) అయింది. కాపలావాళ్ళు అతడిని చూడనే చూశారు. రాత్రంతా ఎంత శ్రమపడ్డా ఫలించకపోగా పన్ను కట్టాల్సి వచ్చిందట.

 

ఘుణాక్షరం

ఘోటక బ్రహ్మచర్యం

ఘటకుటీ ప్రభాతం

ఘుణాక్షరం

ఘోటక బ్రహ్మచర్యం


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages