Type Here to Get Search Results !

చ, ఛ - అక్షరాలతో జాతీయాలు

0

 

చకచకా : తొందరగా... వేగంగా.... అని అర్థం: ఉదా: చకచకా ఈ పని చేసేయాలీ

 

చక్కలిగిలి సంబరం : తాత్కాలిక ఆనందం . కొంతమంది తమపని చేయించుకొనేందుకు ముఖస్తుతి మాటల్ని మాట్లాడుతూ పొగుడుతుంటారు. ఆ పొగడ్తలు కాసేపే ఉంటాయి. ఇది ఎలాంటిదంటే చక్కలిగిలి పెట్టినప్పుడు కాసేపు నవ్వనిపిస్తుంది. చక్కలిగిలి ఆపగానే నవ్వూ ఆగిపోతుంది.

 

చక్రం తిప్పాడు : ఆతను చక్రమేమి తిప్పడంలేదు.. కాని రాజ్యమేలుతున్నాడు. అన్నింటా అతని మాటే చెల్లుబాటవు తున్నదని అర్థం. ==చక్కర్లు కొడుతున్నాడు== అనగా ఏమీ పని లేకుండా ఊరికే తిరగటం అనే సందర్భంలో వాడుతారు

 

చక్కెర చిలుక : మంచితనం, సహృదయత.ఎంతమందినైనా మెప్పించగలవ్యక్తి.అందరికీ ఇష్టుడు

 

చచ్చి చెడి వచ్చాడు : చాల కష్ట పడి వచ్చాడు అని అర్థం: ఉదా: వాడు చచ్చి చెడి వచ్చాడు.

 

చచ్చి బతికినట్టైంది : చాల కష్ట పడ్డాడని అర్థం: ఉదా: దాన్ని సాధించడానికి చచ్చి బతికినంత పనైంది.

 

చచ్చినోడి కళ్లు చారెడన్నట్టు : గతకాల వైభవం, మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి లాగా.

 

చచ్చినంత ఒట్టు : ఉదా: నేను నిజమే చెపుతున్నాను చచ్చినంత ఒట్టు.

 

చచ్చి పుట్టినట్టు : ఘోర ప్రమాదం నుంచి బయటపడటం.బతికి బయటపడటం. తిరిగి పుట్టడంతో సమానం.

 

చతుర్ముఖ పారాయణం :  పేకాట.చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలవాడు, బ్రహ్మదేవుడు. పేకముక్కకు ఉండే నాలుగు కోణాలు నాలుగు ముఖాలు. దైవానికి సంబంధించిన మంత్రాన్నో, కథనో ఏకాగ్రతతో పారాయణం చేసినంత దీక్షతో పేకాటను ఆడుతుంటారు.

 

చప్పగా ఉండడం : నిస్సారంగా ఉండడం రుచీపచీ లేకపోవటం: అతని ఉపన్యాసము చాల చప్పగా ఉంది. ఇక్కడ రుచితో పనిలేదు.. చప్పగా అంటే గొప్పగా లేదని అర్థము

 

చప్పట్లు చరచటం : హర్షాన్ని ప్రకటించటం ఆనందం, సంతోషం లాంటివి కలిగినప్పుడు కరతాళ ధ్వనులు చేస్తూ ఎదుటివారిని మెచ్చుకోవటం, తమ సంతోషాన్ని ప్రకటించటం

 

చరచర : వేగంగా వెళ్ళటం, చరచరా జరిగిపోవటం.

 

చర్విత చరణం : అంతకుముందు నమిలిన దాన్నే మళ్ళీ మళ్ళీ నమలటం, నెమరు వేయటం, మళ్ళీ మళ్ళీ చెప్పటం, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయటం

 

చల్లబడటం : ఆవేశం తగ్గటం. = ఉదా: వాడిప్పటికి చల్ల బడ్డాడు.

 

చల్లని సంసారం : ప్రశాంతమైన కుటుంబ జీవనం .ఏ గొడవలూ లేకుండా హాయిగా గడిచిపోయే చల్లని సంసారం

 

చవితి నిందలు : చెయ్యని తప్పునకు శిక్ష అనుభవించటం అనుకోకుండా అపవాదులొచ్చి పడటం లాంటివి .శ్రీకృష్ణుడు అనాడు పాలు పితుకుతూ పాల కుండలో చవితి చంద్రుడిని చూసినందు వల్లనే నిందల పాలయ్యాడన్న మూఢనమ్మకం.

 

చంకదుడ్డు శరణార్థి :  "శరణు కోరుతూ వచ్చినప్పటికీ, తన దురుద్దేశాలను లేదా ప్రమాదాన్ని బయటపెట్టకుండా దుడ్డుకర్రను దాచిపెట్టుకుని, మనుషులను నమ్మించి, వారిని మోసం చేసే వ్యక్తి" అని సూచిస్తుంది. ఇది పైకి అమాయకంగా కనిపిస్తూ, ఇతరుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుని, వారిని దెబ్బతీయాలని చూసే దుర్మార్గులను వివరించడానికి ఉపయోగించబడుతుంది.

 

చంచాగాడు : ఉదా: వాడొట్టి చంచాగాడు: ఒకరి మాటలను మరొకరికి చెప్పి కాలం వెళ్ల దీశె వాడు.అలాంటి వారిని గురించి ఈ మాట వాడతారు

 

చంకలు గుద్దుకున్నాడు : అతిగా సంతోష పడు తున్నాడు. ఉదా: వాడు సంతోషంతో చంకలు గుద్దుకుంటున్నాడు.

 

చెంపకు చారెడు కన్నులు : చారెడంత కన్నులు ఎక్కడా వుండవు. అతిశయోక్తిగ చెప్పేటప్పుడు అలా అంటారు. అనగా చాల పెద్ద కన్నులున్నవని అర్థము

 

చంకనెక్కించుకోవటం : ఎక్కువగా అభిమానించటం, గౌరవించటం. (ఆ విద్యార్థి గురువు గారి చంకనెక్కాడు

 

చండామార్కులు : చండామార్కులు అంటే హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడి గురువులైన శుక్రాచార్యుని కుమారులు. వారు ప్రహ్లాదుడికి విద్యను బోధించినప్పుడు, అతనిని హింసించడానికి, చాడీలు చెప్పడానికి ప్రయత్నించారు

 

చాకలి కూర : చాకలి కూరలో అన్ని రకాల కూరలు కలసి వుంటాయి. ఆ విదంగా అన్ని విషయాలు/పనులు కలగా పులగంగా చేస్తే ఈ మాటను వాడతారు.

 

చాకి రేవు పెట్టాడు : రహస్యమైన విషయాన్ని అందరికి చెప్పేశాడు. ఉదా: ఎవ్వరికి చెప్పొద్దని వానికి ఈ మాట చెపితే వాడు చాకి రేవు పెట్టాడు.

 

చాగ్గుడి ఇవ్వటం : అసహ్యించు కోవటం చి ఛీ అవతలికి పో అనడం. చ అక్షరానికి గుడి ఇస్తే చీ అవుతుంది అలా నిఘూడంగా చెప్పడం.

 

చావు కబురు చల్లగా చెప్పాడు

చాంతాడంత పొడవుంది

చాంద్రాయణ(వ్రత)ం

 

చాట చేపాయి : తిరిగిరాని అప్పు .చేపాయి అంటే చేబదులు . బస్తా ధాన్యం అప్పు తీసుకుంటే ఎవరికైనా లెక్కగా గుర్తుంటుంది. అలాకాక అప్పుడప్పుడు ఓ చాటెడు ధాన్యం అప్పు తీసుకుంటే ఇచ్చిన వారు కూడా త్వరగా అడగరు. ఇలా ఆ అప్పు తిరిగిరాని ఖాతాలో పడిపోతుంది.

 

చాటలో పడ్డనాడు : భూమ్మీద పడ్డవేళ, పుట్టిన మరుక్షణం .శిశువునుపుట్టగానే పూర్వం చాటలో ఉంచేవారు..

 

చాటలో బియ్యం, నూతిలో నీళ్ళు : సర్వం సిద్ధం అని, అన్నీ అమరి ఉండటం, సులువైనపని

 

చాటలో వెలగకాయ : చాలా స్పష్టంగా కనబడేది

 

చాప కింద నీరులాగ : చాపకిందికి నీరు చేరే టప్పుడు ఏ మాత్రం తెలియదు. చాపంతా తడిసి పోయేంత వరకు తెలియదు. అలాకె కొంత మంది మనవైపున చేరి మనకు తెలియకుండానె మన విషయాలను గ్రహించి మన శత్రువులకు చెప్తారు. ఆ సందర్భంగా ఈ మాటను వాడ తారు.

 

చావు కబురు చల్లగా చెప్పాడు. : అర్థం: అతి ప్రాముఖ్యమైన విషయాన్ని సాధారణ విషయం లాగ చెప్పాడు.... అని అర్థం.

 

చావో రేవో తేల్సుకో : ఉదా: ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట? ఈ సారి చావో రేవో తేల్చుకోవలసిందె

 

చాలు కొంటి చాలు : నాగటిచాలు పొలం దున్నేటప్పుడు ఒక చాలు పక్కన ఉండే చాలు మళ్ళీ అలాగే ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే అలవాట్ట్లు లక్షణాలు .నీవు నీ అయ్యకు చేసిన మర్యాదనే నేను నీకు చేస్తున్నాను అన్నాడట కొడుకు.

 

చాంతాడంత పొడవు : అతి పొడవైన: అక్కడ క్యూ చాంతాడంత పొడవుంది.

 

చిక్కని కాపురం

చిక్కు ముళ్లు వేశాడు

చిగురు టాకులా వణికి పోతున్నాడు

చిచ్చర పిడుగు

చిన్న చూపు చూశాడు

చిటికెలో వస్తా

చిదంబర రహస్యం

చిలక పలుకులు

చిలకా గోరింకల్ల వున్నారు

చిల్లి గవ్వకు కూడ సరిరాడు

చిలక్కి చెప్పినట్టు చెప్పాను

చిల్లి కాసుకు కూడ కొరగాడు

చిలికి చిలికి గాలి వాన గా మారింది

చించేశాడు : విజృంబించాడు అని అర్థం: ఉదా: సచిన్ ఈరోజు ఆటలో చించేశాడు. అటువంటి సందర్భంలో వాడే మాట ఇది.

 

చింతాకంత : అల్పమైనది, చాలా చిన్నది . అరిటాకు, తామరాకు పెద్దవి. .

 

చింతకాయలు రాలి నట్లు : ఏ చెట్టు కాయలైనా అవి పండినతర్వాత ఆచెట్టులోని కాయలు ఒకటో రెండో రాలి పడతాయి. మిగతావాటిని మనుషులే చెట్టెక్కి కోసుకోవాలి. కాని చింత చెట్టు కాయలు పండినతర్వాత బలమైన గాలి వీస్తే ఆ చెట్టులోని కాయలన్ని టప టప మని అన్ని ఒక్కసారిగా రాలి క్రింద పడతాయి. అలా అన్నీ ఒక్క సారిగా రాలిపోతే చింతకాయలు రాలినట్లు అని ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

 

చింపిరి బతుకులు : పేదరికం, కష్టాలతో కూడిన, దయనీయమైన జీవితం అని అర్థం

 

చిక్కు ముళ్లు వేశారు : అడ్డంకులు కల్పించారని అర్థం.

 

చిగురుటాకులా వణికి పోతున్నాడు : చాల భయ పడుతున్నాడు; ఉదా: వారు చిగురుటాకులా వణికి పోతున్నారు.

 

చిచ్చర పిడుగు : అల్లరి పిల్ల వాడని అర్థం: ఉదా: ఆ పిల్లవాడు చిచ్చర పిడుగు.

 

చిన్న ఇల్లు : రెండో భార్య ఇల్లు, చిన్నభార్య ఉండే ఇల్లు, వివాహేతర సంబంధం

 

చిన్నచూపు : చులకన చేయు. ఆ మంత్రి గారు బడుగు జీవులను చిన్న చూపు చూస్తున్నాడు.

 

చిన్న మాటలు : అవమానకరమైన మాటలు అని అర్థము: ఎవరైన అవమాన కరమైన మాటలు మాట్లాడుతుంటే ఈ సామెతను ఉదహరిస్తారు.

 

చిటికెల పందిరి వేయటం : ఉత్తుత్తి మాటలు చెప్పటం, క్రియా శూన్యం. పందిరంటే గుంజలు పాతటం, వాసాలు కట్టి ఆకులు కుట్టడం లాంటి పనులన్నీ చేయాలి. అలాకాక కేవలం అవన్నీ చేసినట్టు గాలిలో చిటికలు వేసి అభినయం చేసినంత మాత్రాన అక్కడ నిజంగా పందిరి ఏర్పడదు. చేయాల్సిన పని చేయక మాటలతో కాలక్షేపం చేయటం.

 

చిటికెలో : స్వల్ప వ్యవధిలో. ( ఉదా: చిటికెలో వచ్చేస్తా....)

 

చిటపటలాడటం : కలహించటం, ఎప్పుడూ అసహనంగా, దురుసుగా మాట్లాడటం

 

చిటపటలు : కోపతాపాలు, అల్లరులు . వంటకోసం పొయ్యిలో రాజేసిన మంట సజావుగా వెలుగుతూ ఉంటే వంట త్వరగా అయిపోతుంది.మంటకు బదులు చిటపటమంటూ నిప్పురవ్వలు వెలువడుతూ ఉంటే ఇబ్బంది.

 

చితికిల బడ్డాడు : బ్రతుకు పోరాటంలో ఓడి పోయాడని అర్థం:

 

చిత్తు చిత్తు చేశాడు : "చిత్తు చిత్తు చేశాడు" అనేది సాధారణంగా తెలుగులో "అంతా నాశనం చేశాడు" లేదా "ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టాడు" అనే అర్థాన్ని సూచిస్తుంది, ఇది దేనినైనా చెడగొట్టడాన్ని లేదా నాశనం చేయడాన్ని వివరిస్తుంది

 

చిన్న చూపు చూశాడు : ఒకరిని తక్కువగా చూడటం, అనాదరించడం లేదా వారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం.

 

చిందులేస్తున్నాడు : చాల కోపంగావున్నాడని అర్థం.

 

చిపచిప : ఎడతెగని ముసురు

 

చిప్ప చేతికొచ్చింది : బ్రతుకు చిద్రమై పోయిందని అర్థం.

 

చిప్ప కూడు తింటున్నాడు :  జైలు కెళ్లాడని అర్థం.

 

చిర్రు బుర్రు లాడు తున్నాడు : కోపంగా వున్నాడు అని అర్థం. ఉదా: వాడెప్పుడూ చిర్రు బుర్రు లాడుతుంటాడు.

 

చిల్లర శ్రీమహాలక్ష్మి : చిల్లరగా అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసే వారికి పెద్ద నష్టాలేమీ ఉండవు.ఖర్చులుపోగా మిగిలిందంతా లాభమే. రొట్టెలవాడి కన్నా ముక్కల వాడి పనే నయం అన్నట్లు.

 

చిల్లి కడవ తీరు : వచ్చిందేదీ నిలవకపోవటం.అధికంగా ఖర్చు చేస్తూ ఆస్తిని హరించటం

 

చిల్లి కాకపోతే బొక్క : నష్టాన్ని కలిగించటంలో అందరూ సమానులేనని .రంధ్రం, చిల్లు, చిల్లి, బొక్క అర్థాలన్నీ నష్టం అనేకదా?

 

చిల్లి కాసుకు కూడ సరి రాడు :  పూర్తిగా నిరుపయోగమైన వాడని అర్థం. ఉదా: వాడు చిల్లి కాసుకు కూడా సరి రాడు.

 

చిల్లి పేరే తూటు : ఏదైనా ఒకటే,..... అనే అర్థంలో పై మాటను వాడతారు

 

చిల్లి బొక్కెన తీరు : అలంకార ప్రాయం, నిరుపయోగమైనా అలాగే ఉంచుకోటం.బతికుంటే చాలని అనుకోవటం

 

చిలుక కటు కాలం : కరువుకాలం.చిలుకకు సాధారణంగా ఎప్పుడూ కరవు పరిస్థితి ఎదురు కాదు.అన్ని రుతువుల్లోనూ పంటలు, పండ్లు ఆహారంగా దొరుకుతూనే ఉంటాయి. అయితే ఒక్కోసారి చిలుకకు కూడా ఆహారం దొరకదు. ఆ సందర్భంగా ఈ మాటను వాడుతారు.

 

చిల్లులకడవ : పనికిరాని వస్తువు, నిరుపయోగకరం తెంపులతాడులాగా మూస:చిప్పకూడు చిప్పలో ఎవరు అన్నం తినరు. దీని అర్థం: వాడు జైలు కెళ్ళాడు అని.

 

చీకు చింత లేకుండా వున్నాడు : ఆనందంగా వున్నాడు అని అర్థం. ఉదా: వాడెప్పుడు చీకు చింత లేకుండా ఉన్నాడు.

 

చీకటి మడి : అనుభవం లేని వ్యక్తి కార్యాచరణకు పూనుకోవటం .ఆత్రం కొద్దీ వెలుతురున్నప్పుడే దొంగతనానికి వెళ్ళి పట్టుబడటం

 

చీడ పురుగు : ఉదా: వాడు చీడపురుగు.. = ధుర్మార్గుడు అని అర్థం.

 

చీదరించు కున్నాడు : అసహ్యించు కున్నాడని అర్థం. ఉదా: వానికెమైనా చెపితె చీదరించు కుంటాడు.

 

చీమ కుట్టినట్టు కూడా లేకపోవటం : పెద్ద పెద్ద ప్రమాదాలు, బాధలు వచ్చినా ఏ మాత్రం చలించకుండా, ప్రతిస్పందించకుండా ఉండటం.బాధ్యత లేకుండా ప్రవర్తించటం (ఇంత చెప్తున్నా వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.)

 

చీమకు రెక్కలొచ్చినట్టు : చీమలకు పక్షులకున్నట్టు రెక్కలు పుట్టుకొస్తే ఇకవాటి గమన వేగాన్ని ఎవరాపగలరు అని ఒక ఊహ. తక్కువస్థాయి వారికి ఉన్నట్టుండి అన్నీ కలిసొచ్చి గర్వంతో విర్రవీగుతున్నప్పుడు, తుళ్ళి పడుతున్నప్పుడు వారిని గురించి అంటారు.చీమ ఎంత చిన్నదో గర్వపడే వ్యక్తి కూడా అంత అల్పుడని, అయితే ఆస్తి కలిసి రాబట్టి అలా మిడిసి పడుతున్నాడన్నది భావన.నడమంత్రపుసిరి లాగ.

 

చీమ తలకాయంత : అతి స్వల్పమైనది. ఉదా:

 

చీమదూరే సందు : స్వల్ప అవకాశం. (అక్కడ చీమ దూరె సందు కూడా లేదు ఎలా వెళ్ళను?)

 

చీమబలం : పట్టుదలకు నిదర్శనం. చీమ తనకంటే ఎక్కువ బరువున్న ఆహారపు గింజను మోసుకుంటూ చాలాసార్లు జారి కిందపడుతుంటుంది. అయినా పట్టు వదలకుండా తనకు కావలసిన ఆహారాన్ని చేర్చుకుంటుంది.

 

చీమ చిటుక్కు మన్నా : సాధారణంగా "చీమ చిటుక్కు మన్నా" అంటే "చిన్న చిన్న తగువలు లేదా క్రమం తప్పక జరిగే చిటుక్లు మట్టి పరుచుకో" అనే విషయం అనేది అర్థమవుతుంది

 

చీము నెత్తురు లేని వాడు : సిగ్గు లేని వాడని అర్థం: ఉదా: వాడినెన్నన్నా సిగ్గు లేదు; వాడు చీము నెత్తురు లేని వాడు.

 

చీముపట్టినోడు : చీములాంటి అసహ్యకరమైన పనులుచేసి, అవినీతి పద్ధతుల్లో బాగా ధనాన్ని సంపాదించినవాడు.

 

చీము నెత్తురు లేదు :

 

చుక్కులు చూపించాడు :

 

చుక్క పొద్దున లేచి

చుక్కెదురు

చుప్పనాతి ముండ

చుట్టపు చూపుగా వచ్చాడు

చుట్టాల సురభి

చుర కత్తి లాంటి వాడు

చూపులగుర్రం

చెక్కేశాడు

చెట్టాపట్టాలేసుకొని

చెట్టంట కొడుకు

చెట్టంత మనిషిని నేనుండగా

చెట్టెక్కి కూర్చున్నాడు

చెట్టంత ఎదిగాడు

చెప్పు కుంటే సిగ్గు చేటు

చెప్పులు మోసె రకం

చెవిలొ సీసం పోసుకున్నావా

చెవిలో పువ్వులు

చెవిలో ఇల్లు కట్టుకొని పోరు : ఒక్క విషయం పదే పదే వినిపించడం.

 

చెవి కోసుకున్నారు

చెవిలో ఊదాడు : రహస్యంగా ఏదో చెప్పడని అర్థం.

 

చెవులు కొరుక్కుంటున్నారు : రహస్యంగా లేదరాచుగా మాట్లాడటం, పక్కన పక్కనే గుసగుసలు చేయటం అని అర్థం

 

చెవులు వేళాడేసుకొని వచ్చారు : వ్యంగ్య లేదా ఆశయపూర్వకంగా రహస్యంగా ఏదో చెప్పి, చుపలి పెట్టి వచ్చారనే అర్థం ఉంటుంది. ఈ మాట మనసులో ఏదో మాట్లాడతారు కానీ ప్రత్యక్షంగా చెప్పకుండా పక్కన పక్కనే సంభాషణ లేదా చుపులు చూపించి వచ్చారని సూచిస్తుంది

 

చెల రేగి పోయారు : రెచ్చి పౌయారు అని అర్థం

చెర బట్టాడు ఛ సాధారణగా "చిన్న చూపు చూశాడు", అంటే కోపంగా, హర్షంగా కొట్టాడు లేదా ఓడించాడు అని అర్థం. ఇది ఎవరో వ్యక్తిని కఠినంగా గట్టిగ నిషిద్ధంగా నిరాకరించడం లేదా ఎదురుదెబ్బ సరిగా కొట్టడం అనే అర్థంతో వాడతారు.

 

చెరిగేశారు :  దెబ్బ తీసారు," "నష్టం చేకూర్చారు," లేదా "తక్కువ చేసేశారు" అని అర్థం

 

చేజారి పోయింది : ఏదైనా చేతిలోంచి జారిపోయి తప్పిపోయిందని అర్థం. ఇది భౌతికంగా ఏదైనా వస్తువు పడిపోవడం లేదా ఒక అవకాశం చేజారిపోవడం వంటి సందర్భాలలో వాడతారు

 

చేటభారతం : "ఒక విషయాన్ని బాగా విస్తరించి చెప్పడం" లేదా "ఏదైనా అంశాన్ని ఆపకుండా, విస్తృతంగా చెప్పడం

 

చేయి ఇచ్చాడు  : సహాయం అందించాడు," "సహకారం ఇచ్చాడు,"  అన్న అర్థాల్లో వాడబడుతుంది.

 

చేతిలో పెడుతున్నాము :  అప్పగిస్తున్నాము

 

చేతిచమురు భాగవతం :  సొంత డబ్బుతో, నిష్కారణంగా నష్టపోయిన లేదా వృధా అయిన పనిని సూచిస్తుంది. భాగవత ప్రదర్శనలకు కొనే నూనె (చమురు) ఖరీదుచేసి, దాని వల్ల ప్రయోజనం లేకుంటే, ఆ ఖర్చును "చేతిచమురు భాగవతం" అని అంటారు, అంటే దండగ పని అని అర్థం

చేతి వాసి మంచిది : ఒక వ్యక్తి పనితనం, నైపుణ్యం, కష్టం చేసే విధానము బాగుందనే అర్థంలో వాడతారు. అంటే ఆ వ్యక్తి చేసే పని శ్రద్ధగా, జాగ్రత్తగా, మెరుగ్గా ఉంటుందని చెప్పటానికి దీనిని ఉపయోగిస్తారు.

 

చేతికి ఎముక లేదు : ఎక్కువ దానాలు చేశే వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతారు.

 

చేతి సమురు వదిలింది : "బాగా నష్టపోయాడని" లేదా "ధరలు పెరిగి చాలా ఖరీదు చేయాల్సి వస్తోందని". ఇది ఒక ఆర్థిక నష్టాన్ని లేదా అధిక ఖర్చుతో కూడుకున్న పరిస్థితిని సూచించడానికి ఉపయోగిస్తారు

 

చేతులు కాల్చుకున్నాడు : నష్టపోయాడు అని అర్థం. ఏదైనా వ్యాపారంలో లేదా ప్రయత్నంలో డబ్బు లేదా వస్తువుల రూపంలో నష్టం కలిగినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు

 

చేతులకు మట్టి అంటకుండా : "పని చేయడంలో జాగ్రత్తగా ఉండటం," లేదా "ఎలాంటి తప్పు లేకుండా, శుద్ధిగా, నేరుగా పనిచేయడం" అని అర్థం. దీనివల్ల ఎవరి నిందును లేక హాని జరగకుండా ఉండటం తెలియజేస్తుంది. ఈ మాటను ఉపయోగించి, ఒక వ్యక్తి తన పనులను సున్నితంగా, శుద్ధిగా, పరిపూర్ణంగా చేస్తుంటాడని అర్థం చేసుకుంటారు.

 

చుక్కవాలుగా ఉండటం : మేలు జరగటం, కలిసి రావటం, అదృష్టం వరించటం. చుక్క అంటే శుక్రగ్రహం.శుక్ర గ్రహానికి ఎదురుగా ప్రయాణం చేయటం కీడును కలిగిస్తుందంటారు. అయితే ఆ శుక్ర గ్రహానికి ఎదురుగా కాక దానికి భిన్నంగా వాలుగా ప్రయాణం చేస్తే కీడుకు బదులు మేలు జరుగుతుందని మూఢభావన.

 

చుక్కెదురైంది : అనుకున్న దానికి వ్వతిరేకంగా జరిగింది.: ఉదా: అతనికి కోర్టులో చుక్కెదురైంది. బైల్ దొరకలేదు.

 

చుట్ట కుతి : కుతి అంటే కోరిక . పొగాకు చుట్టను తాగటానికి అలవాటు పడి, దాన్ని విడిచి పెట్టలేకపోవటం

 

చుట్టం చూపు : అప్పుడప్పుడు ఎప్పుడో కుదిరినప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళటం. (ఏరా? బడికి చుట్టపు చూపుగా వస్తున్నావు......)

 

చుట్టమై వచ్చి దయ్యమై పట్టటం : మిత్రుడిగా వచ్చి శత్రువుగా ప్రవర్తించటం .అనురాగం పొందేవాడిలాగా ముందుగా ప్రవర్తించి, ఆ తర్వాత శత్రువుగా మారి పీడించటం

 

చురుకు ముట్టడం : కష్టాలు ప్రాప్తించడం, తెలిసిరావడం

 

చూపులకు చుక్క : బయట ఒకలా, అంతరంగంలో మరోలా ప్రవర్తించే మోసకారి.నమ్మి వెంట వెళితే మోసపోవాల్సి వస్తుంది. పైపై మెరుగులు చూసి మోసపోవద్దని ఈమాటకు అర్థం.

 

చూసి రమ్మంటే కాల్చి రావటం : చెప్పిన దానికన్నా అధికమైన అక్కరలేని పనిని కూడా చేయడం, అమితోత్సాహంతో ప్రవర్తించడం

 

చూరు నీళ్ళు ఎనగర్రకు ఎక్కినట్టు : జరగటానికి వీలులేని పనులు.ఇంటిచూరు వెన్నుగర్ర కంటే చాలా కిందకు ఉంటుంది. చూరు నీళ్ళు అక్కడి నుండి ఇంకా కిందికి దిగుతాయేకాని పైనున్న వెన్నుగర్ర వైపు వెళ్ళ లేవు.

 

చెక్క భజన చేస్తున్నారు : ఒకరికి వంత పాడుతున్నారని అర్థం. ఉదా: వాడొట్టి చక్క భజన గాడు.

 

చెట్టంత ఎదిగాడు : పెద్దవాడయాడు: ఉదా: వాడు చెట్టంత ఎదిగాడు ఏం లాభం ఏ పని చేత కాదు. ఆ సందర్భంలో ఈ మాటను వాడుతారు.

 

చెట్టుకింద గడ్డి : ఒకరి మీద ఆధారపడి జీవించేవాడు, నిరుపయోగి .దట్టమైన చెట్లకింద గడ్డి అంతగా మొలవదు. ఒక వేళ మొలిచినా ఆరుబయట మొలిచిన గడ్డిలాగా ఉపయుక్తంగా ఉండదు. నిస్సహాయుడై ఒకరి పంచన చేరిన వ్యక్తి కూడా అలాగే ఏ మాత్రం గుర్తింపు లేకుండా పడిఉంటాడు.

 

చెట్టుకొకరు, పుట్టకొకరుకావటం : ఎంతో దూరదూరంగా చెల్లాచెదురై పోవటం .అప్పటి దాకా కలిసి ఉన్నవారు.. ఒకరికొకరు సంబంధం లేకుండా దూరదూరంగా విడిపోవట

 

చెట్టు తొలిచే పురుగులు : దుర్మార్గులు అచ్చంగా చెడు పురుగుల్లాంటి వారే. పచ్చటి చెట్టులాంటి సమాజంలో ఆ చెడు పురుగులుంటే పురుగులు కనిపించకుండా చెట్టునెలా తొలచి నిర్వీర్యం చేస్తాయో దుర్మార్గులు సమాజాన్ని అలా నాశనం చేస్తారు.

 

చెట్టుమీది పిట్ట చందం : అజ్ఞానంతో తానే గొప్పని అనుకోవటం

 

చెట్టెక్కించి నిచ్చెన తీసినట్టు : ఉపకారం పేరుతో అపకారం చేయటం

 

చెట్టెక్కి కూర్చున్నాడు : అలిగాడని అర్థం: ఉదా: ఆ కొత్తల్లుడు కారు కొనివ్వలేదని చెట్టెక్కి కూర్చున్నాడు.

 

చెప్పి చెప్పి : ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోని సందర్భం. విసిగివేసారటం.

 

చెప్పు కింద తేలు : చెప్పు కిందనున్న తేలు పూర్తిగా చిక్కినట్టే. అది తప్పించుకోలేదు. అలా తప్పించుకోలేని పరిస్థితిలో వున్న వారి గురించి ఈ మాట వాడతారు.

 

చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని వున్నారు : వెళ్లి పోవడానికి సిద్దంగా వున్నాడని అర్థం: ఉదా: వాడప్పుడే చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని ఉన్నాడు./

 

చెప్పేస్తే కుండకు తగలదు : చెప్పు ఎంత కోపంగా విసిరినా ఒక్క కుండకూ తగిలే అవకాశం లేని, కుండలు కూడా లేని దుర్భర దారిద్య్రం ఉన్న ఇల్లు. నీ ఇంట్లో చెప్పేస్తే కుండకు తగలదు అంటారు.

 

చెప్పులరిగేలా తిరిగాడు : చాల ప్రయాస పడి తిరిగాడని అర్థం: ఉదా: ఆ సంబంధం కొరకు చెప్పులరిగేలా తిరిగాను.

 

చెబితే సిగ్గు దాస్తే దుఃఖం : మోసపోయామని బయటకు చెప్పుకోటానికి సిగ్గు, చెప్పకుండా మనసులోనే దాచుకుంటే దుఃఖం

 

చెమటలు పట్టించాడు : సామాన్యంగా చెమట పట్టింది అంటే అతిగా ఎండలో తిరగడమో, అతిగా శ్రమ చేయడమో... వాతావరణము అతి వేడిగా వుండడమో వంటి కారణాలుంటాయి. ఒకరు మరొకరిని చెమటలు పట్టించ లేరు. మాటలతో గాని, చేస్టలతో గాని ఆపని చేయలేరు. కానీ కొందరు ఎదుటివారికి అతి భయంకరమైన వార్తలు చెప్పితే ఎదుటి వాడు నమ్మితే ఆ సందర్భాన్ని ..... వాడికి చెమటలు పట్టించాడు అని అంటుంటారు. నిజంగా ఆభయానక సందర్భంలో కూడా చెమటలు పట్టవు. కాని జాతీయ ప్రయోగమున్నది. ఒక జాతీయము యొక్క నిజార్థం మొకటి వుంటే ..... దాని ప్రయోగార్థం మరొకటుంటుంది. అలాంటివి నిజమైన జాతీయాలు. అలాంటి వాటిలో ఇది ఒకటి.

 

చెయ్యి విరగి నట్టుంది : చేస్తున్న పనికి బాగా అంతరాయం కలగటం, పనివాడు, పనిముట్టు పోవటం. ఆ సందర్భంగా ఈ మాటను వాడతారు. ఉదా:.. ఈ రోజు పని వాడు రాక పోయే సరికి చెయ్యి విరిగి నట్టుంది.

 

చెరిగేశారు : ఉదా: ప్రతి పక్షాలు అధికార పార్టీ వారిని చెరిగేశారు.

 

చెరువంత : సువిశాలమైనది, చాటంత, ఎకరమంత, లంకంత .గుండె చెరువైంది అనేటప్పుడు మాత్రం చాల ఎక్కువ దుఃఖం కలిగినదని అర్థం.

 

చెరువులో పడ్డ వాణ్ణి తీసి బావిలో వేసినట్లు : సహాయమడిగితే చేతిలో ఉన్నది కూడా లాక్కుపోవటం.చెరువు విశాలంగా ఉంటుంది. బావి ఇరుకుగా ఉంటుంది.చెరువులో పడ్డప్పుడు దెబ్బలేం తగలవు కానీ బావిలో పడ్డప్పుడు దెబ్బలు తగలొచ్చు. తక్కువ కష్టాల నుంచి తప్పిస్తామని చెప్పి ఎక్కువ కష్టాలను కలిగించటం. ఇలాంటిదే మరొక సామెత: పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్టు\

 

చెరువులో సెనగేసినట్లు : అదృష్టం మీద ఆధారపడటం.పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకున్నా, అంతా బాగానే జరుగుతుందనుకున్నా అనుకోని అవాంతరాలు సంభవించటం వల్ల ముందు అనుకున్నదంతా తారుమారవుతుంది.

 

చెలరేగి పోయాడు : విజృంబించాడు. ఉదా: ధోని ఆటలో చెలరేగి పోయాడు.

 

చెల్లని నాణెం,చెల్లని కాసు : విలువలేనిది పనికిరానిది. = ఉదా: వీడొక చెల్లని కాసు. ఎవరికి పనికి రాడు.

 

చెవిన ఇల్లు కట్టుకొని పోరటం : నిరంతరం చెబుతుండటం వినేదాకా విసుగులేకుండా చెప్పటం. (నీ చెవిన ఇల్లు కట్టుకొని చెప్పాను.... నామాట విన్నావా? ఇప్పుడు చూడ ఎలా అయిందో?)

 

చెవి నులమటం : తప్పు చేసినప్పుడు హెచ్చరించటం

 

చెవి కెక్కిందా : వినబడిందా... ఉదా: నేను చెప్పింది చెవి కెక్కిందా?

 

చెవి కోసిన మేకలా అరుస్తున్నాడు : ఉదా: అతను చెవి కోసిన మేకలా అరుస్తున్నాడు. ఎవరైనా పిల్లలు ఎడతెరిపి లేకుండా ఏడుస్తుంటే ఈ మాట అంటారు.

 

చెవిలో పూలు పెట్టుకొని వున్నానా : నేనేమన్న అమాయకుడినా.. ఉదా: నేనేమైనా చెవిలో పూలు పెట్టుకొని వున్నానా... అమాయకత్వం, చాదస్తం .అర్చకుడు పువ్వునిచ్చినప్పుడు స్త్రీలైతే జడలో ముడుచుకుంటుంటారు. పురుషులకు అలాంటి అవకాశం లేదు. కానీ ఆ పువ్వు పవిత్రమైంది. దాన్ని శిరస్సున ధరించే తీరాలి అని అనుకొని చెవిలో ఉంచుతుంటారు.

 

చెమటోడ్చి...... : చాల కష్టపడి.....; అని అర్థం.

 

చెవిటికి పట్టిన శంఖం : ఫలితం లేని పని చేసే వారినుద్దేశించి ఈ సామెత వాడతారు

 

చెవిటి వాని ముందు శంఖం ఊది నట్టు : ప్రయోజనం లేని పని.చెవిటివాడి ముందు శంఖం వూదితే..... దాన్ని కొరకటం నీ అబ్బ తరం కాదు అన్నాడట ఉపయోగంలేని పని చేస్తే ఈ మాట వాడతారు.

 

చెవుల్లో చెట్లు మొలవటం : శ్రవణ శక్తి లోపించటం, చెబుతుంటే వినిపించుకోకపోవటం, మాట్లాడుతున్నప్పుడు పరధ్యానంగా, ఏదో ఆలోచిస్తూ ఉండటం

 

చెవులు కొరుక్కుంటున్నారు : రహస్యంగా మాట్లాడు కుంటున్నారు. ఉదా: వారిద్దరు చెవులు కొరుక్కుంటున్నారు. రహస్యంగా మాట్లాడుకుంటుంటే ఈ మాటను వాడతారు.

 

చెంప పెట్టు : గుణ పాటము: ఉదా: వానికి ఇది చెంప పెట్టు లాంటిది.

 

చెంపకు చారేడేసి కళ్లు : చాల పెద్ద కళ్లున్నాయని అర్థం.

 

చేట భారతం : ఒక విషయాన్ని బాగా విస్తరించి చెప్పటం, ఏదైనా విషయాన్ని ఆపకుండా చెప్పటం

 

చేతల మనిషి కాడు : ఒట్టి మాటల మనిషి అని అర్థం: ఉదా: వాని మాటలు నమ్మకు, వాడు చేతల మనిషి కాడు.

 

చేతలుడిగి పోయాయి. : నీరసం వచ్చింది: ఉదా: చేతలుడిగి పోయాయి నేను ఆ పని చేయలేను.

 

చేతి నిండా : తగినంత.... (వాడికి చేతి నిండా పని ఉంది.)

 

చేతికి రావటం : సొంతం కావటం, చేతికొచ్చేదాకా నమ్మకం లేదంటారు

 

చేతి వాటం చూపించాడు : దొంగ తనం చేశాడని అర్థం: ఉదా: వాడు సందట్లో సమారాధనంగా తన చేతి వాటం ప్రదర్శించాడు.

 

చేతిలో పెట్టడం : అప్పగించడం . పిల్లను ఓ అయ్య చేతిలో పెట్టాము అంటారు

 

 

చేతి వాసి మంచిది : ఉదా: ఆ డాక్టర్ చేతి వాసి మంచిది.

 

చేతికి ఎముకలేదు : ధర్మాత్ముడు అని అర్థం: ఉదా: అతను అడిగిన వారి కాదనడు: అతని చేతికి ఎముక లేదు.

 

చేతికి అంది వచ్చిన కొడుకు : ఎదిగిన కొడుకు. ఉదా: వాడికేం పర్వాలేదు కొడుకులందరు చేతికి అంది వచ్చారు.

 

చేతి చమురు వదిలింది : ఉదా: ఆ పని కావడానికి అతనికి చేతి చమురు బాగానె వదిలింది. బాగా నష్టపోయాడని అర్థం.

 

చేతి కింది మనిషి : సహాయకుడు అని అర్థం. ఒక పనిలో సహాయకునిగా వున్న వాడిని చేతి కింది మనిషి అంటారు.

 

చేతుసాపు : చేతు అంటే చేతులు . సాపు అంటే సాధన బాగా ఉండటం . చేతాళం, పేతాళం. ఒక పని చేయటానికి చేతులు బాగా అలవాటుపడటం, చేతులతో పని బాగా చేసే సాధన లేక నేర్పరితనం కలిగి ఉండటం

 

చేతులు చాచు : విస్తృతంగా వ్యాపించటం, ఆహ్వానించటం. (దీన్ని నిందా వాచకంకా గూడ వాడుతారు) ఉ: వాడు అందరిదగ్గరా చేతులు చాస్తున్నాడు. అందరి దగ్గరా యాచిస్తున్నాడని అర్థం

 

చేతులెత్తేశారు : పని విరమించు కున్నారు. ఉదా: ఈ పని తమ వల్ల కాదని వారు చేతులెత్తేశారు.

 

చేతులు కట్టుకోవటం : విధేయతతో ప్రవర్తించటం, అణిగి ఉండటం. పని లేక పోవటం. ( పని లేక పోవడం::: అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఇలా వాడుతారు. అలా చేతులు కట్టుకుని కూర్చోక పోతె ... వచ్చి వాళ్లకు సాయం చేయవచ్చు గదా )

 

చేతులు కట్టేసి నట్టుంది : పని లేక పోవడం: ఉదా: నాలుగు రోజుల నుండి పనిలేక పోయే సరికి చేతులు కట్టేసి నట్టుంది.

 

చేతులు కాల్చుకున్నాడు : నష్ట పోయాడు. ఉదా: అతను వ్వాపారంలో బాగా చేతులు కాల్చుకున్నాడు.

 

చేతులు ఖాలీగా లేవు : తీరిక లేదు అని అర్థం: ఉదా: చేతులు ఖాళీగా లేవు పక్కింటికి వెళ్లు.

 

చేతులు పడి పోయాయి : పని చేయలేక పోవడం: ఉదా: పనిచేసి, చేసి చేతులు పడి పోయాయి. నిందా వాచకముగా కూడా ఈ మాటను వాడుతారు: నీ చేతులు పడిపోనూ

 

చేతులకు మట్టి అంటకుండా : జాగ్రత్తగా: ఉదా: అతడు ఏ పనిచేసినా చేతులకు మట్టి అంట కుండా చేస్తాడు. నింద పడడు అని అర్థం. (మంచికి, చెడుకి కూడా ఈ జాతీయాన్ని వాడుతారు. )

 

చేతులు కలపడం : చేయి కలపడం, ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒకటి కావడం. ఒకరికొకరు సాయం చేసు కోవడం. (వారందరు చేతులు కలిపితేనె నా గెలుపు సాద్యమైంది.) (చెడు పనికి కూడా ఈ మాటను వాడతారు: ఉదా: ఆ దొంగలిద్దరు చేతులు కలిపారు

 

చేదు అనుభవం : గుణ పాటం: ఉదా: ఆ పని నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

 

చేదు నిజం : అసలు విషయం: ఉదా: ఇప్పటికైనా ఆ చేదు నిజం చెప్పావు సంతోషం.

 

చేదు మాత్ర మింగినట్టు : బాధాకరమైన విషయం ప్రయోజనం కూడా ఉంటుంది. ఆ సందర్భంగా ఈ మాటను వాడతారు.

 

చేప పిల్లకు ఈత నేర్పినట్లు : ఎవరూ నేర్పనక్కరలేదు. తాతకు దగ్గులు నేర్పినట్టు అలాంటిదె.

 

చేపల మార్కెట్లా వున్నది : గోలగా వున్నది: ఉదా: ఇదేమన్నా క్లాసా లేక చేపల మార్కెట్టా/. అలా అరుస్తున్నారు.

 

చేపాయి బతుకు : నిరంతరం ఒకరికి జవాబుదారీగా ఉండి బతకటం, స్వేచ్ఛ లేకుండా జీవించటం, ఇంకొకరి సూచనల మేరకు వ్యవహరిస్తూలెక్క చెప్పాలి.

 

చేయి పట్టడం : వధూవరులు ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడంతోటే వారికి వివాహ బంధం ఏర్పడుతుంది.చేయి పట్టి, జీవిత భాగస్వామిగా చేసుకోవటం

 

చేయి చాచటం : అడగటం,, అర్థించటం, యాచించడం. ఉదా: వాడెప్పుడు ప్రతి ఒక్కరిదగ్గర చేయి చాస్తుంటాడు.

 

చేయి చేసుకోవడం : ఎదుటివ్యక్తిపై ఆగ్రహంతో చేయి చేసుకోవటం, కొట్టటం, తన్నటం

 

చేయి తిరిగిన వాడు : చాల పని మంతుడని అర్థం. (వాడు ఈ పనిలో బాగా చేయి తిరిగిన వాడు.)

 

చేయి వదులవ్వటం : ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్తంత వెసులుబాటు కలగటం ఉదా: నాకష్టాలు తీరాయి. ఇప్పుడు నా చేయి కొంత వదులయ్యింది.

 

చేయ్యిచ్చాడు : ఉదా: వాడు సినిమాకు వస్తానని చెప్పి నాకు చెయ్యిచ్చాడు.

 

చేయుండటం : ప్రమేయం, పాత్ర ఉండటం.

 

చొప్ప తినే ఎద్దులా : విరామం లేకుండా మేస్తూనే ఉండటం. నిరంతరం ఏదో ఒకటి నములుతూ, ఏదో ఒక పని నిర్విరామంగా చేస్తుండటం. ఆ సందర్భంగా ఈ జాతీయాన్ని వాడుతారు.

 

చొప్పలో చొప్ప కలిసినట్లు : ఇరుగు పొరుగు చేలల్లోది ఒక చోటకు చేర్చి కలిపితే ఏ చేలోది ఏ చొప్పో అంత తొందరగా కనుక్కోలేరు.చొప్ప అంతా ఒకలానే ఉంటుంది. ఇలా రెండు కుటుంబాల్లోని సభ్యులు ఇరుగు పొరుగునే ఉండి వారంతా కలివిడిగా తిరుగుతున్నప్పుడు 'చొప్పలో చొప్ప కలిసినట్లు వారంతా కలిసిపోయారు అంటారు

 

చొప్ప వామిలో నిప్పు దాచినట్లు : ఒక విపత్తును లేదా నష్టాన్ని తెచ్చిపెట్టే అమాయకమైన లేదా తెలివితక్కువ పనిని సూచిస్తుంది. ఇది ఎక్కడైతే "చొప్ప" (పశుగ్రాసం) నిల్వ చేస్తారో, అక్కడ నిప్పు పెడితే అది మొత్తం వామిని కాల్చేస్తుందని, అలాగే తెలివి తక్కువ పనుల వల్ల అనుకోని నష్టం జరుగుతుందని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

 

చోద్యం చూస్తున్నారు : తమాషా చూస్తున్నారు; ఉదా: పని చేయ కుండా చోద్యం చూస్తున్నారా?

 

చోద్యం సొరకాయ గుడ్డు పెట్టిందట :

 

 

ఛీ కుక్కా అంటే ఏమక్కా అన్నదట : ఎదుటివారు నిందించినప్పుడు లేదా అవమానించినప్పుడు కూడా చాలా సులభంగా, నర్మగర్భంగా సమాధానం చెప్పగలగడం. అంటే, అవతలివారు తిట్టినా, దానికి తగ్గట్టుగా చిరాకు పడకుండా లేదా కోపడకుండా, చాకచక్యంగా "ఏమక్కా పిలుస్తున్నావు?" అని సమాధానమిచ్చినట్లు అని అర్థం.

ఈ జాతీయము వెనుక కథనం ఇలా ఉంటుంది: ఒక మహిళను మరో మహిళ "ఛీ కుక్కా" అని తిట్టిందట. దానికి ఆ మహిళ "ఏమక్కా నువ్వు నన్ను పిలుస్తున్నావు?" అని అడిగిందట. అంటే, తిట్టిన ఆమెకు కూడా "ఏమక్కా" అనే పదం వాడి తనను తాను ప్రశ్నించుకున్నట్లుగా

 

ఛీఛీ అనేదీ ఈ నోరే శివశివా అనేదీ ఈనోరే : "ఛీ ఛీ అనేది ఈ నోరే శివశివా అనేది ఈ నోరే" అనే సామెత, ఒకే వ్యక్తి ఒకే నోటితో వ్యతిరేక భావాలను వ్యక్తపరచడాన్ని సూచిస్తుంది. ఒకే వ్యక్తి "ఛీ ఛీ" అని అసహ్యం లేదా తిరస్కరణను వ్యక్తపరిచి, మరుసటి క్షణంలో "శివశివా" అని ఆశ్చర్యం లేదా భక్తిని వ్యక్తపరచడాన్ని ఇది వివరిస్తుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages