ఆకాశరామన్న: పేరు లేని, చెప్పని. ఎవరో
గాని అతనంటే గిట్టని వాళ్ళు ఆకాశ రామన్న లేఖలు వ్రాస్తున్నారు.
ఆకాశానికెత్తటం : అతిగా పొగడటం: ఉదా: వాడిని
పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు.
ఆకాశమంత
పందిరి వేశారు : చాల
పెద్ద పందిరి వేశారు అనిఅర్థం. ఉదా: వారి పెళ్ళికి ఆకాశమంత పందిరి వేశారు.
ఆకాశపంచాంగము :
ఆర్చటం
తీర్చటం : కష్టాలను
పోగొట్టడం, కాపాడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలోఉంది.
కష్టాల వల్ల కలిగే బాధను సమసింపజేసి ఊరట కలిగించి చేయూతనిచ్చే సమయంలో ఈ జాతీయ
ప్రయోగం కనిపిస్తుంది. "ఇన్నాళ్ళూ నా కష్టాలను ఆర్చేదెవరో తీర్చేదెవరోనని
మదనపడ్డాను. ఇన్నాళ్ళకు ఈయన కనిపించాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ
ప్రయోగం కనిపిస్తుంది.
ఆదమరిచివుండు : అజాగ్రత్తగా ఉండటం. ఉదా: వాడు
ఆదమరచి నిద్ర పోతున్నాడు.... ఇంట్లో దొంగలు పడ్డారు.
ఆటలు
సాగలేదు : అనుకున్నది
జరగలేదు ఉదా: నీ ఆటలు ఇక్కడ సాగవు.
ఆదరాబాదరా : హడావుడి పడటం
ఆపదలో
మొక్కులు, సంపదలో మరపులు : మనుషుల తీరు.మేలు చేసిన వారిని
నాలుగు డబ్బులు కనిపించేసరికి మరచిపోవటం
ఆకాశరామన్న
ఆర్జీలు : సంతకం లేకుండా వ్రాయు ఉత్తరాలు =
తమ పేరు బయట పెట్టకుండా ఒకరిని నిందిస్తూ ఉత్తరాలు రాసే వారు.
ఆకాశదీపం : శివాలయాల్లో ధ్వజ స్తంభంపైన
గుమ్మటంలో ఉండే దీపం చుట్టూ గుమ్మటం ఎంతగా రక్షణగా ఉన్నా గాలి తాకిడికి అది వెంటనే
ఆరిపోతుంది.అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపదల్ని సమకూర్చుకొని అంతలోనే ఆ సంపదలన్నీ
నశించిపోయి దరిద్రులుగా మారేవారు.
ఆకు అలము : ఆకులు మొదలగున్నవి "నాకు
ఆకులు అలములు వేసి పెట్టినారు , ఆ అడవిలో భోజనము"। =
మహర్షులు అడవిలో వుండి ఆకులలములు తిని బ్రతికారంట.
ఆకు చాటు
పిందెలలాగా : ఆకు చాటు
నున్న పిందెలు, ఎండ వాన తగలకుండ సున్నితముగా ఉంటాయి। అలా
ఒకరి రక్షణలో ఉన్న అమాయకపు, సున్నితపు వారిని ఆకు చాటు
పిందెలలాగా అని అంటారు।
ఆగవేగము/ఆఘమేఘాల
మీద
: అతి వేగము == వాడు
ఆగమేగాల మీద వచ్చాడు' ===ఆడలేక మద్దెల ఓడు అన్నాడట===
(దీన్ని సామెతగా కూడా వాడవచ్చు) తన తప్పును కప్పిపుచ్చుకోడానికి ఎదుటి వాడిని
నిందించటము.
ఆగాన
వచ్చి గండాన పోవటం : ఆగం చేసి సంపాదించిన అక్రమ సంపాదన గండాన
చేతికి అందకుండా పోతుందని
ఆచంద్రార్కం : కలకాలము: ఉదా: అతని కీర్తి
ఆచంద్రార్కం నిలచి వుంటుంది.
ఆచి తూచి
మాట్లాడాలి : జాగ్రత్తగా
మాట్లాడాలి: ఉదా: వానితో ఆచి తూచి మాట్లాడాలి.
ఆట
పట్టించాడు : సరదాకి
ఏడిపించాడు: ఉదా: అందరు కలిసి ఆ చిన్న పిల్ల వాన్ని ఆట పట్టిస్తున్నారు.
ఆటవిడుపు : విశ్రాంతి దినము ....ఒకప్పుడు బడులలో, ఇప్పుడు
ఆదివారం లాగా, ఏ అమావాశ్యకో పౌర్ణమికో ఆటవిడుపు ఇచ్చేవారు
దానినే ఆటవిడుపు రోజు అని అంటారు।
ఆటు, పోటు : సముద్రములో వచ్చునవి..... జీవితములో కష్టాలను ఆటుపోటులతో పోల్చడము
సర్వసాధారణము।
ఆటపాటలు : ఆటలు, పాటలు
ఉల్లాసకరమైన క్రీడలు = చిన్నపిల్లలు ఆట పాటలతో కాలం వెళ్లబుచ్చు తారు.
ఆటలో
అరటిపండు : చిన్నపిల్లలకు ఆటలో దెబ్బ తగిలితే,బాధపడకుండా అరటిపండు తొక్కినట్లు భావించటం.ఎవరన్నా సరిగ్గా ఆడకపోయినా ఆటలో
అరటిపండు అంటారు.
అట్టుడుకినట్టుంది : వాడి వేడి మాటల యుద్దంజరిగిందని అర్థం: ఉదా: ఈ రోజు అసెంబ్లీ
అట్టుడికినట్టు ఉడికింది.
ఆడబోయిన
తీర్థం ఎదురైనట్టు : కాలం కలసిరావటం,శ్రమ
తగ్గటం,కావాలసిన వారెవరైనా అనుకోగానే ఎదురుగా రావటం, చేద్దామనుకున్న పనిని అప్పటికే ఎవరైనా చేసి పెట్టటం.
ఆడాలి
పాడాలి మద్దెలా కొట్టాలన్నట్టు :
నలుగురు చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేయాల్సి రావటం
ఆడిందే
ఆటగా
: ఇష్టానుసారంగా ==ఉదా::
ఇంత కాలం నీవు ఆడిందే ఆట గా సాగింది . ఇకపై అలా కుదరదు.
ఆడుచు, పాడుచు : శ్రమ తెలవకుండా సంతోషంగా హాయిగా
చేసే పని. ఆడుతు పాడుతు పనిచేస్తుంటె అలుపు సొలుపు ఏ మున్నది..... ఇది ఒక సినీ
గీతం.
ఆదమరచి
నిద్రించు : గాఢంగా
నిద్రించు = తన చుట్టు ప్రక్కలా ఏమి జరుగు తున్నదో గ్రహించ లేని స్థితి. ఎటువంటి
ఆలోచనలూ లేకుండా నిద్రించు తన రక్షణగురించిన చింత కూడా లేకుండా నిద్రించు
ఆదరా, బాదరా : హడావిడి
ఆనుపాను : పుట్టుపూర్వోత్తరం ఉదా: వాని అనుపానులన్ని మాకు తెలుసు. ==గుట్టుమట్లు
ఆరు గాల : ఉదా: ఆరుగాల కష్టపడి పండించిన
పంట వరదలకు కొట్టుక పోయింది.
ఆపసోపాలు : అలసట చెందినవారికి ఇది ఉపయోగిస్తారు ..... ఉదా:... ఈ చిన్న పని చేయడానికి
వాడు ఆప సోపాలు పడుతున్నాడు.
ఆముదం
తాగిన ముఖం : ఇబ్బందికర భావ వ్యక్తీకరణ.ఆముదం రుచి, వాసన గిట్టనందువల్ల, విరోచనాలై, ఆముదం తాగిన వాడి ముఖం అదోలా ఉంటుంది.అధికంగా పొట్ట ఖాళీ అయినందువల్ల కూడా
ముఖం నీరసంగా కనిపిస్తుంది.
ఆముదపు
విత్తులు : ఆణిముత్యాల్లాగా
మారవు.మంద బుద్ధులు, దుర్మార్గులు ఎంతగా చెప్పినా మంచిగా
మారరు.
ఆముదపాకుగాడు : బిక్షగాడు.ఆముదపాకు తెరచి ఉంచిన యాచకుడి అరచేయిలా కనిపిస్తుంది.
ఆముదం
రాసుకొని తిరగటం : ఎవరికీ దొరక్కుండా తిరగటం జారి
తప్పించుకుని పారిపోవటం == దొంగలు ఒంటికి ఆముదము రాసుకొని వుంటారు.
ఆరంభశూరత్వంబు : ఆంధ్రులు ఆరంభశూరత్వము అనే అపవాదు తెలిసినదే కదా! == ఒకపనిని ఆడంబరంగా
ప్రారంబించి ఏ చిన్న ఆటంకం వచ్చినా ఆ పనిని అపేస్తారు.
ఆరితేరు : మిక్కిలి నైపుణ్యం సంపాదించడం.
విలువిద్యలో అర్జునుడు ఆరితేరిన వాడు.
ఆర్చు
పేర్చు : విజృంభించు
ఆర్చు, తీర్చు : ఓదార్చు == నీవేమైనా ఆర్చే
వాడివా తీర్చే వాడివా?
ఆరు
నూరైనా, నూరు ఆరైనా :
ఎట్టిపరిస్థితుల్లోనైనా == ఆరు నూరైనా నూరు ఆరైనా నేను ఈ
పనిచేసి తీరుతాను.
ఆయారాం
గయారాం : వచ్చేవారు వస్తున్నారు..... పోయేవారు పోతున్నారు... ఎవరూ
పట్టించు కోవడం లేదు.
ఆవాలు ముద్ద
చేసినట్టు : కలయిక అసాధ్యం.విభిన్న మనస్తత్వాల వారిని
ఒక చోటకు చేర్చి ఒకే అభిప్రాయానికి తేవటం, ఐక్యత, అనుసంధానాలు కుదరవని
ఆవులించిన
పేగులు లెక్కపెట్టు : ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేవాడంటే చాలా
తెలివి గలవాడనీ, చురుకైనవాడనీ అర్థం -= వాడు ఆవులిస్తే పేగులు లెక్కించ
గలడు.
ఆశ లావు
గొంతు సన్నం : అత్యాశకు పోయి నోరు, గొంతు
పట్టణంత ఆహార పదార్థాన్ని తినాలని ప్రయత్నించినా అది వీలుకాదు.గొంతులో ఎంతవరకు
పడుతుందో అంత పదార్థాన్ని స్వీకరిస్తే మంచిది.
ఆస్తిమూరెడు
ఆశ బారెడు : అత్యాశ ... ఎవరి స్తోమత ప్రకారం ఆశలు
పెట్టుకోవాలి. స్తోమతకు మించిన ఆశలు వుంటే ఈ మాటను వాడతారు.