Type Here to Get Search Results !

ఇ - అక్షరంతో జాతీయాలు

0

 

ఇచ్చేవాడుంటే చచ్చేదాకా తిన్నట్టు : పరాధీనంగా బతికేవారు.కొంత మంది నిరంతరం ఎదుటివారినడిగి తమకు కావలసినవన్నీ సమకూర్చుకుంటుంటారు. అంతే కానీ తమకు తాముగా సంపాదించటం, ఖర్చు పెట్టడం అనేవి చేయరు.అన్నీ ఉచితంగా కావాలనుకునే వారి గురించి ఈ జాతీయాన్ని వాడు తుంటారు.

 

ఇడిచేసింది ఈ దికి పెద్ద.... వుంచుకున్నది ఊరికే పెద్ద

 

ఇల్లడ పెట్టడం : పూర్వం ఎవరైనా, తీర్థయాత్రలకు పోతూ తిరిగి వచ్చే దాకా తమ దగ్గరున్న విలువైన వస్తువులను, ధనాన్ని తెలిసిన వారి వద్ద భద్రంగా ఉంచమని చెప్పి వెళుతుండేవారు. ఇలా తమ సొమ్ము తాత్కాలికంగా భద్రతను కల్పించుకోవడాన్నే ఇల్లడ పెట్టడం అంటారు.

 

ఇల్లు-ఇరవాటు : ఇంటిలోకి కావలసిన వన్నీ మంచిగానే ఉన్నాయి అని

 

ఇల్లు ఇరకాటం ఆలి మరకటం :  ఇల్లు ఇరుకుగా ఉంటే చుట్టాలెవరూ రారు... ఒక వేళ వచ్చినా పొద్దు పోకముందే వెళ్ళిపోతారు. అలా వుంటే రాత్రి పడుకోడానికి స్థలం వుండదు. ఎక్కువకాలం ఆ ఇంట్లో ఉండలేరు. దాంతో వారికి వండిపెట్టే ఖర్చు, శ్రమ తగ్గుతాయి. ఆలి మరకటం అంటే భార్యరూపం కోతి రూపంలాగా వికృతంగా ఉంటే ఆమె వంక ఎవరూ చూడకపోతే ఆ భర్తకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈ అర్థంతో ఈ జాతీయాన్ని వాడుతారు.

 

ఇల్లు అలకంగానే పండుగ కాదు : కేవలం ఇల్లు ఒక్కటి అలికి కూర్చుంటే పండుగ ఎలా పూర్తికాదో అలానే ఏదో ఒక చిన్నపని చేసి ఇక అంతా అయిపోయిందిలే అనుకోవటం కూడా సమంజసంకాదని

 

ఇల్లు కాలుతుంటే వాసాలు దూసుకున్నట్టు : స్వార్థపరులు.ఎదుటివారు ఎంతగా కష్టనష్టాలకు గురౌతున్నాపట్టించుకోక పీడించి తెచ్చుకోవటం.

 

ఇల్లు పీకి పందిరేయటం :  అడ్డూ, అదుపూ లేకుండా అవగాహనా రాహిత్యంతో అల్లరి చేయటం

 

ఇల్లు వల్లు గుల్లయింది : ఇల్లు.. ఆరోగ్యము రెండు పాడయాయని అర్థం. దుర్వ్యసనాలకు బానిసలయిన వారి ఇళ్ళు, ఒళ్ళు గుల్లవడం ఖాయం అనే అర్ధంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

 

ఇల్లో నారాయణమ్మ :

ఇసక తక్కెడ, పేడ తక్కెడ :

ఇక్ష్వాకుల బారసాల :

ఇత్యపులు

ఇసక పాతర :

 

ఇనుపకచ్చడాలు :  వారే. కుటుంబంలో స్త్రీకి వున్న ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది ఈ జాతీయము.

 

ఇల్లు పీకి పందిరేయడం : అతి చిన్న విషయానికి నానా రబస చేయడము: అలాంటి వారినుద్దేసించి ఈ జాతీయాన్ని వాడుతారు. ఉదా: వాడు చిన్న విషయానికి ఇల్లు పీతకి పందిరి వేశాడు.

 

ఇల్లు వల్లకాడైంది : ఇల్లు నాసనమైనదని అర్థం.

 

ఇల్లు గుల్లయింది : చాల కష్టమొచ్చింది.: ఉదా: ఈ వరదలతో మా ఇల్లు గుల్లయింది.

ఇల్లు గుల్ల చేయు : ఇంటిలో ఉన్న ఆస్తి మొత్తం నాశనం చేయుట అని అర్థము. ఉదా: వాని వల్ల ఇల్లు గుల్ల అయింది అని అంటుంటారు.

 

ఇడిసేసింది ఈదికి పెద్ద :  అన్ని విడిచేసిన ఆడది అందరికి పెద్ద. అనగా ఆమెకు ఎవరు ఎదురు మాట్లాడ సాహసించరు. అందుచేత ఆ వీధివారందరు ఆమె నోటి దురుసుకి భయపడి వూరుకుంటారు. దాంతో ఆమె తనెంతో గొప్పదాన్నని గర్వపడుతుంటుంది. ఇక్కడ ఇడిసేసింది అనగా భర్తను వదిలేసినదని అర్థం.

 

ఇదిగోగుర్రం ఇదిగో మైదానం : స్వయంగా పరీక్షించి తెలుసుకోవచ్చు అనే అర్థం.గుర్రం నీ ఎదురుగానే ఉంది. మైదానం కూడా ఎదురుగానే ఉంది, ఎక్కి స్వారీ చేసి పరీక్షించి నువ్వే తెలుసుకో

 

ఇనుప గజ్జెల తల్లి : దరిద్రదేవతకు ఇది మారు పేరు. ఆ ఇంట్లో ఇనుపగజ్జెల తల్లి నాట్యమాడుతున్నది. అని అంటారు. అనగా ఆఇంట్లో దారిద్ర్యం ఉన్నదని అర్థం.

 

ఇనుప గుగ్గిళ్ళు నమలటం : అత్యంత కష్టమైన పని చేయటం ఎంతగా ఉడికించినా అవి ఉడికేదీ లేదు, మెత్తపడేదీ లేదు. వాటిని ముందు పెట్టి తినమన్నప్పుడు ఎంత కష్టమైన పనో

 

ఇప్ప పూల వాసన : వెతకనక్కరలేదు.ప్రతిభావంతుడికి పరీక్షలు పెట్టడం అనవసరం.ఇప్ప పూలకు వాసన వెదకాలా అన్నట్టు

 

ఇరుగు పొరుగు : ఇంటి చుట్టు పక్కల వారు అని అర్థం. ఇరుగు పొరుకు వారితో అన్యోన్యంగా వుండాలని ఈ జాతీయం యొక్క గూఢార్థం.

 

 

ఇసుక తక్కెడ, పేడ తక్కెడ :  ఒకరికి తెలియకుండా మరొకరు మోసపుచ్చుకోవడం.

 

ఇసుక చల్లినా రాలని జనం : విపరీతమైన జనం వచ్చారని అర్థం.

 

ఇసక పాతర : శ్రమ ఎక్కువగా ఉండే పని, విసుగు, చిరాకు కలిగించేపని. పూర్వం వస్తువులను దాచుకోవటం కోసం నేలను తవ్వి ఆ గుంతలో దాస్తుండేవారు. దీనినే పాతర అని అంటారు. ఇసక నేలలో గొయ్యి తీసేటప్పుడు పైనుంచి ఇసక జారి మళ్ళీ ఆ గోతిలో పడుతుంటుంది. పని ముందుకు సాగనివ్వక అడ్డుపడే వ్యవహారం. అటువంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతారు.

 

ఇక్ష్వాకుల బారసాల : ఎంతో పురాతనమైనది. కృతయుగం నాటిది. ప్రాచీనమైనది

 

ఇంగువ కట్టిన గుడ్డ : ఇంగువ అయిపోయినా కూడా అది కట్టిన గుడ్డలో ఇంగువ ఉన్నట్లుగానే అనిపించేలా చాలాకాలంపాటు వాసన వస్తుంటుంది.

 

ఇంద్రుడు, చంద్రుడు : విపరీతంగా పొగడడం . భోగాలను అనుభవించడంలో ఇంద్రుడికి, అందంగా ఉండడంలో చంద్రుడికి ఎవరూ సాటి లేరు.

 

ఇంచుమించు : సుమారుగా అని అర్థము: ఉదా: ఇంచుమించుగా వారిద్దరు ఒకటే..... అని అంటుంటారు.

 

ఇంపు సొంపులు :

ఇంటి గుట్టు :

 

ఇంటి సంగతులు:  ఉదా: ఇంటి గుట్టు రట్టు చేయ కూడదు. అనగా ఇంతి విషయాలు బయటికి తెలియకూడదు అని అర్తంలో ఈ జాతీయాను వాడుతారు.

 

ఇంటాబయటా :  అయినవారి దగ్గర, కాని వారి దగ్గర, స్వదేశంలోనూ, విదేశంలోనూ .తన వారి దగ్గర, బయట వారి దగ్గర కూడా .'ఇంట గెలిచి రచ్చ గెలవటం లాగా

 

ఇంటికి జ్యేష్ఠాదేవి పొరుగుకు లక్ష్మీదేవి : పని చేసిన వ్యక్తికి నష్టం, పొరుగువారికి లాభం. కొందరు ఇంట్లోని విషయాలను పట్టించుకోకుండా.... పొరుగు వారికి ఉపయోగించే పనులు చేస్తుంతారు వారి గురించి ఈ జాతీయాన్ని వాడుతుంటరు.

 

ఇంటికి తలుపు లేదు : ఆ ఇంటికి తలుపు లేదు ఈ ఇంటికి గడియ లేదు అన్నట్టు .ఒకదానికంటే మరొకటి మరీ నాసి రకమైనది అని.

 

ఇంటిదొంగ : ఇంటిదొంగ కన్నుండగానే... గుడ్డుమాయం చేస్తాడని కూడా అంటారు. అంటే అన్ని విషయాలు బాగా తెల్సిన సొంతవ్యక్తే నమ్మకద్రోహాన్ని తలపెట్టిన పరిస్థితుల్లో ఇలా అంటారు.అవినీతి పరుడు, అవినీతి అధికారి . ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని సామెత. అతడు లోపలి వ్యక్తే కదా. అతడికి అలా చెయ్యాల్సిన అవసరం ఉండదు అనే నమ్మకం

 

ఇంటికి దీపం ఇల్లాలు : ఇల్లాలు .ఇంటికి దీపం ఇల్లాలు .ఇల్లు మొత్తానికి దీపం లాగా కాంతినిచ్చేది కీర్తిప్రతిష్ఠలు కలిగించేది . ఇంటికి కీర్తిని తెచ్చిపెట్టే పని ఎవరు చేసినా వారంతా దీపాల్లాంటి

 

ఇంటిని సవరించారు : ఇంట్లో దొంగలు పడి దోచుక పోయారని అర్థం.

 

ఇంటిల్లపాది : ఇంటిలోని అందరూ

 

ఇంటి నారాయణుడు : భర్త .ఇంటికి యజమానే దైవమన్నభావన.

 

ఇంటిని సవరించటం : సవరించటమంటే చక్కదిద్దటమని అర్థం. అయితే జాతీయంగా దీని అర్థం ఇంటిని సవరించటం అన్నప్పుడు దొంగలు దోచుకుపోయారు అని. అంద చందాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages