ఈకకు ఈక, తోకకు
తోక : ఏ పార్టుకు ఆ పార్టు విడతీయుట
ఈకలు
పీకిన కోడి : కురూపిగా ఉండటం, అందహీనత,
బలహీనత .కోడి ఈకలన్నీ పీకేస్తే చూడబుద్ధి కాదు. ఆ జ్వరం వచ్చిన నాటి
నుంచి ఇదిగో ఇట్లా ఈకలు పీకిన కోడిలా అయ్యాడు' అంటారు.
ఈగలు
తోలుకుంటున్నాడు : అంగట్లో బేరం లేదని అర్థం: ఉదా: వానికి
బేరంలేక ఖాళీగా..... ఈగలు తోలుకుంటున్నాడు.
ఈగెంత
పేగెంత : వాడెంత.. వాడి బతుకెంత అని . ఈగ చిన్న ప్రాణి, ఇక
దాని లోపలి పేగు ఎంత చిన్నదిగా ఉంటుందో చెప్పనక్కర లేదు. ఈగ లాంటి అల్పుడు అని
ఈడు జోడు : సరి, సమానము
== వీరి ఈడు జోడు బాగున్నది.
ఈతాకిచ్చి
తాటాకు గుంజినట్టు : మోసకారి వ్యవహారం మాయమాటలు చెప్పి
ఎదుటివారికి ఏ కొద్దిగానో ఇచ్చి వారి నుంచి ఎక్కువ కాజేయటం
ఈనిన
పులి : అదుపు లేని ఆగ్రహంతో తన, మన చూసుకోకుండా
ప్రవర్తించటం.పులి తాను ఈనిన పిల్లల్ని కూడా తినేస్తుందట
ఈపాటేషానికి
ఇంత దూరమా : ఎంతో వూహించుకొంటే కొద్దిగా ప్రతిఫలం
లభించటం.
ఈశ్వరవేరు