Type Here to Get Search Results !

ఎ, ఏ, ఐ - అక్షరాలతో జాతీయాలు

0

 

ఎంగిలికెగ్గులేదు :  ఎగ్గు అంటే కీడు అని అర్థం. ఎవరి ఎంగిలి అయినా తిన్నంత మాత్రాన కీడేమీ జరగదు.

 

ఎంగిలి మంగలము :

 

ఎండ కన్నెరుగక : అతి సుకుమారముగ పెరుగుట.ఎండకన్నెరగక ఉండటం.భోగభాగ్యాల నడుమ మాత్రమే పెరగటం అన్నది భావన.అసలేనాడు ఎండలోకే రాకుండా ఉండటం

 

ఎండకెండి, వానకు తడిసి :  అన్ని కష్టములకోర్చి

 

ఎండగట్టడం : బాగా బాధించటం, తీవ్రంగా విమర్శించటం == ఈ నాడు దేశంలో పాతుకు పోయిన అవినీతిని అన్నా హజారే ఎండగడుతున్నాడు.

 

ఎండిన తాటాకు : అతిగా స్పందించే గుణం .కొద్దిగా గాలి వీచినా పెద్దగా శబ్దం చేస్తుంది.

 

ఎండిన దానిమ్మ కాయ : బక్కచిక్కి, నీరసంగా ఉండటం.నునుపు నిగనిగ తగ్గిపోయి ఎండిపోయి కనిపించటం.

 

ఎంత పండినా కూటిలోకే : ఎంత పండినా కూటిలోకే, ఎంత ఉండినా కాటిలోకే .పంట ఎంత పండినా దాన్ని కలకాలం నిల్వ ఉంచరు. ఆహార పదార్థంగా ఆ పంట మారాల్సిందే.అలాగే నూరేళ్లు బతికినా అంతకంటే ఎక్కువ బతికినా, అంత ఎక్కువకాలం బతికాడని మరణించాక అతడిని ఇంట్లో ఉంచుకోరు. కాటికి పంపాల్సిందే. అంటే ఎప్పటికో ఒకప్పటికి మరణం తప్పదు కనుక ప్రాణం ఉన్న రోజుల్లోనే జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలనే సూచన

 

ఎకరమంత : సువిశాలమైనది బాగా పెద్దది

 

ఎక్కడ పుట్టిన గడ్డి అక్కడే :  జన్మస్థలాలను విడిచి వెళ్ళక జననం నుంచి మరణం దాకా ఒకే వూళ్ళో ఉండేవారు.ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండేవారు

 

ఎక్కడ తగలడ్డావు ఇంత సేపు : కోపంతొ ఎక్కడున్నావూ' ఇంతసేపు అనడానికి ఇలా అంటారు.

 

ఎగదిగ : తేరిపార చూచుట పైనుండి క్రిందివరకు చూచుట "పల్లెలోకి క్రొత్తగా వచ్చిన వారిని ఎగదిగ చూడటం సర్వసాధారణం"

 

ఎగదోయటం : విద్వేషాలను రెచ్చగొట్టడం == వారిరువురు పోట్లాడుకుంటుంటే వీరు పక్కన చే ఎగదోస్తున్నారు.

 

ఎగ నామం పెట్టాడు : తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకుంటే వాడు నాకు ఎగనామం పెట్టాడూ' అంటారు.

 

ఎగవేయు : అప్పు తీసుకొని ఇవ్వక పోతే ఎగరేశాడు అని అంటారు.

 

ఎగిరి గంతేశాడు : అధిక సంతోషంగా వున్న వాణ్ని చూసి ఇలా అంటారు.

 

ఎగిరే పిట్టలకు గురి చూసినట్టు : తెలివి తక్కువ వ్యవహారం, విఫల ప్రయత్నం చేయడం

 

ఎట్లయినా సాబునే : సాబు అంటే సాహెబ్, సాయుబు, గొప్పవాడు, పాలకుడు.ఓడినా, గెల్చినా నేను గొప్ప అని .కిందపడ్డా, మీదపడ్డా నాదే పైచేయిఅని.

 

ఎడమపక్క సున్నాగాడు : విలువలేనివాడు, నిరర్థక జీవితాన్ని గడిపేవాడు .అంకెలకు కుడివైపు ఉన్న సున్నాలు అంకెకు విలువను పెంచుతూ ఉంటాయి. అదే ఎడమ పక్కన పెట్టిన సున్నాకు విలువ ఉండదు.

 

ఎడమొఖం పెడమొఖం : ఒకరి మీద ఒకరికి ఇష్టం లేనప్పుడు వారిద్దరు ఎడమొఖం పెడమొఖంగా వున్నారూ అని అంటారు.

 

ఎడప దడప : అటు ఇటు రెండు వైపులా అని అర్థం.

 

ఎడా పెడా : ఉదా: వాణ్ణి ఎడా పెడా వాయించారు. రెండు వైపులా అని అర్థం.

 

ఎడ్డెమంటే తెడ్డెమనే రకం : ఔనంటే కాదనే రకం:

 

ఎత్తిన కత్తి దించకపోవటం : లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించక పోవటం, అనుకున్నది సాధించే వరకూ వూరుకోక పోవటం

 

ఎత్తిన పిడికిలి దించొద్దు : పోరాటం ఆపొద్దు అని అర్థం.

 

ఎత్తి పొడచు : మనసు గాయపడేలా సూదితో గుచ్చినట్లు మట్లాడటం. == వారు సూటి పోటి మాటలతో ఎత్తి పొడుస్తున్నారు.

 

ఎత్తుపళ్ళతో కొరికినట్టు : కొరకలేరు, నమలలేరు. పళ్ళు ఉన్నా ప్రయోజనం శూన్యమే.పని జరగదు. ఎత్తు పళ్ళతో కొరికినట్త్టెంది అంటారు

 

ఎత్తు పళ్ళ పోకట : భయపడాల్సిన పనిలేదు.మేకపోతు గాంభీర్యం . పోకట అంటే పొగరు .చూడ్డానికి ఓ రకంగానూ, కార్యసాధనలో మరో రకంగానూ కనిపించటం.

 

ఎత్తు మరగిన బిడ్డా : క్రిందకి దించిన ఏడ్చు బిడ్డ ఎల్లప్పుడూ ఎత్తుకున్న బిడ్డ

 

ఎత్తుపీట : ప్రముఖ స్థానం, అగ్రాసనం, ఎత్తుపీట పెద్దకుర్చీ వేసి గౌరవించడం

 

ఎద్దడుగులో ఏడుగుణాలు : ఒకే చోట విభిన్న లక్షణాలుండటం.ఆకాస్తలోనే తేడాలు చూపించటం

 

ఎదురీత ఈదుతున్నాడు : కొని కష్టాలు తెచ్చుకుంటున్నాడని అర్థం.

 

ఎదురు చుక్క :

 

ఎదుగు పొదుగు :  అభివృద్ధి లేకుండా వుండడము .... వాడి ఉద్యోగం ఎదుగు బొదుగు లేక ఎక్కడ వేసిని గొంగళి చందాన అక్కడే ఉంది.

 

ఎదురు బొదురు : చుట్టుపక్కల వారు అని అర్థం.

 

ఎనుబోతుపై వాన : ఏమిచెప్పినా అర్థం కాకపోవడం, ఏంతచెప్పినా వినిపించుకోకపోవటం.

 

ఎన్ని గుండెలురా : ఎంత ధైర్యం రా నీకు అని అడుగుట == నీకెన్ని గుండెలురా నాతోనే వాదనకొస్తావా?

 

ఎన్ని వేషాలేసినా కాటికే : ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయువు ఉన్నంతకాలమే అదంతా ఆ తర్వాత ఎవరైనా సరే పోయేది ఒక చోటుకే.

 

ఎన్నెర్ర కన్నెర్ర : ఎన్నుఅంటే వెన్ను కంకి, వెన్ను ఎర్రపడటం అంటే పంట,,4125

 

ఎముకలు మెళ్లో వేసుకు తిరిగినట్లు  : చెయ్యకూడని పనిని బాహాటంగా చేస్తూ ఉండటం.చేసిన పనికి సిగ్గుపడక అందరికీ చెప్పుకోవటం

 

ఎముకలు కొరికే చలి : చాలా ఎక్కువ చలి అని అర్థం.

 

ఎముకలేని చెయ్యి : అనగా గొప్ప దాత అని అర్థము./ ఉదా: వాని చేతికి ఎముక లేదు అని అంటుంటారు.

 

ఎవరికి వారే యమునా తీరే :  ఒకరికొకరు సహకరించు కోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎవరిష్టం ప్రకార వారు నడుచు కోవడం.

 

ఎరక్కపోయి వచ్చి ఇరుక్క పోయారు :  తెలియక వచ్చి ఆపదలో చిక్కుకున్నారు అని అర్థమొచ్చే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.

 

ఎరుగని వూళ్లో మొరగని కుక్క :  ఒక వూరి కరణం ఇంకో వూరికి వెట్టి, ఒక వూరి పోలీసు పటేలు ఇంకో వూరి సుంకరితో సమానం లాగా. స్థాన బలం.కుక్క యజమానుల దగ్గర కొత్త వారిని చూసి మొరుగుతుంటుంది. అదే కుక్క పొరుగూరికి వెళితే అక్కడున్న కుక్కలను చూసి తోక ముడుస్తుంది.

 

ఎర్రటోపీవాళ్లు : పోలీసువాళ్లు

 

ఎర్ర గొర్రె మాంసము :  మామిడి కాయ కారం, ఆవకాయ

 

ఎరుక పిడికెడు ధనం : మిత్రలాభం.ఎరిగి ఉండటం.బాగా తెలిసి ఉండటం, పరిచయమై  ఉండటం.తెలిసినవారుంటే సరుకు అప్పు తెచ్చుకొనే వీలుంటుంది.

 

ఎల్లయ్య మల్లయ్య చదువు : నామమాత్రపు చదువు, మనుషుల పేర్లు మాత్రమే రాసే వరకూ వచ్చి ఆగిపోయిన అక్షర జ్ఞానం

 

ఎలవెట్టి కయ్యం కొనుక్కున్నట్టు : లేనిపోనిది కొని తెచ్చుకున్నట్టు, వెల ఇచ్చి మరీ తగాదాను కొని తెచ్చు కోవటం

 

ఎల్లమ్మ కొలుపు : చాలాసేపు జరిగే పని.ఎల్లమ్మ కొలుపుల్లా ఇంకా ఎంతసేపు ఆ పని చేస్తారు, త్వరగా కానీయండిఅంటారు.

 

ఎల్లలు లేని : ఎదురు లేని.. అడ్డు అదుపు లేని అని అర్థం.

 

ఎలుక కోసం ఇల్లు తగలపెట్టడం : చిన్న తప్పు కోసం పెద్ద ముప్పుల్ని సంకల్పించటం చిన్న తప్పు దొర్లినప్పుడు సహన గుణం ప్రదర్శించకుండా పెద్ద ముప్పును తల పెట్టటం

 

ఎలుగు సలుగెరిగిన పని : నాగలికి దుంపను సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు.దుంప వదులుగా ఉన్నా బాగా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బంది.ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు.పనిలో జాగర్తగా ఉండమని, ఎలుగు సలుగెరిగి చేస్తేనే పనిసులువుగా జరుగుతుందని.

 

ఎలుగ్గొడ్డుకు తంటసం తీసినట్లు : వృధా ప్రయాస. ఎంత తీవ్రంగా పనిచేసినా దానికి తగిన ప్రతిఫలం దక్కదు. అసలు పని చేయలేదేమోనన్న భావన ఎదుటి వారికి కలిగి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తుంటాయి.త్వరగా అయ్యేపనికాదు

 

ఎళ్ళ బారిపోవటం : ప్రాణం పోవటం, వెళ్ళటం, పారిపోవటం .ఏదో ఈ జీవితం ఇలా ఎళ్ళబారిపోతే చాలు

 

ఎవరికైనా వేపకాయంత వెర్రి వుంటుంది :

 

ఏ ఎండకాగొడుగు పట్టే రకం :  పచ్చి అవకాశ వాధి అని అర్థం.

 

ఏండ్లూ పూండ్లు : చాలా కాలము

 

ఏకై వచ్చి మేకై కూర్చున్నాడు : 

 

ఏనుగు కూర్చున్నా గుర్రమంత ఎత్తే : ఉత్తములు కాలం కలిసిరాక కష్టాలపాలైనా వారి వ్యక్తిత్వం, సమాజంలో వారంటే ఉన్న మంచితనం ఏవీ పూర్తిగా తరిగిపోవు.మంచివారు ఒక్కోసారి కలిసిరాక చతికిలపడ్డా వారి పరువు పోదు.

 

ఏనుగు దాహం : పేరాశ, అత్యాశ

 

ఏకిపెట్టడం : ఎవరైనా తప్పులు చేసినప్పుడు ఆ తప్పులన్నిటినీ ఎదుటివారు ఏ ఒక్కదాన్నీ విడిచి పెట్టకుండా అన్నిటినీ తీవ్రంగా విమర్శిస్తున్న సందర్భం.దూదిని పరుపులు లేదా దిండ్ల కోసం సిద్ధం చేసేటప్పుడు దానిలో ఉన్న దుమ్ము, ధూళిని పోగొట్టటానికి ఏకుతుంటారు. ఏకిన తర్వాత దూది శుభ్రపడుతుంది.చేసిన తప్పులు దూదికంటుకున్న దుమ్ము, ధూళి లాంటివి. ఆ తప్పులను విమర్శించి చేసిన వారికి అవి తప్పులని తెలియచెబితే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం జరుగుతుందన్న భావన

 

ఏకు మేకవటం : మెత్తగా వచ్చి, గట్టివాడై ద్రోహం చేయటం..అల్పుడు అధికుడై, బలహీనుడు బలవంతుడై ఎదురు తిరగటం.

 

ఏకులు పెట్టిన బుట్ట : ఏకులు పెట్టిన బుట్ట చాలా ఏకులు తనలో ఇముడ్చుకోగలుగుతుంది. కష్టాలొచ్చినా దిగమింగుకుంటూ ఎప్పుడూ బయట పడకుండా ఉండే వ్యక్తులు

 

ఏకుల్లేని రాట్నం : పనికి రాకుండా వృధాగా ఉండటం .ఏకులే లేనప్పుడు ఇక ఆ రాట్నం వృథాగా పనికి రాకుండా ఉండిపోవాల్సిందే.

 

ఏటావలి గిలిగింతలు : సాహసోపేతం.దూర ప్రాంతాల్లో ఉండి ఆత్మీయుల దగ్గరకు సమయానికి చేరుకోలేని పరిస్థితి

 

ఏటికోళ్ళు : నమస్కారములు

 

ఏడులు పూడులు : చాలా కాలము

 

ఏడుకట్ల సవారీ : పాడే అని అర్థం

 

ఏటావలి గిలిగింతలు :

 

ఏనుగు తిన్న వెలగపండు : ఏనుగు తిన్న వెలగ పండు పేడలో కాయ లాగానే బయటకు వస్తుంది. కాని దాని లోపలి పదార్థమంతా మాయ మై ఖాళీగా వుంటుంది. (ఇది ఈ జాతీయం నిజార్థం. అసలర్థం ఏమంటే........ ఎదుటి వాడికి తెలియకుండా మోసం చేసి అతడిని నష్టపరిచే వారి గురించి ఈ జతీయము చెప్తారు.)

 

ఏనుగుదాహం : అత్యాశ, అధిక దాహం అనే సందర్భాలలో వాడుతారు.

 

ఏనుగుమీది సున్నము :

 

ఏనుగుపాడి : సమృద్ధి అని అర్థం.

 

ఏనుగు కొమ్ము

 

ఏనుగుకు కాలు విరగటం దోమకు రెక్కవిరగటం ఒకటే : కష్టాల తీవ్రత పెద్దవారికొకలాగా చిన్నవారికొకలాగా ఉండవు.కష్టాలు అందరూ అనుభవించాల్సిందే

 

ఏనుగు కోసం రాజు, పంది కోసం దొమ్మరి బాధపడినట్లు : కష్టాలు ఎవరి స్థాయిలో వారికుంటాయి.'రాజు ఏనుగుపోయి బాధపడితే... దొమ్మరి పందిపోయి బాధపడ్డట్టు

 

ఏనుగు దాహము :  చాలా ఎక్కువగు దాహము

 

ఏనుగు మేత : సింహభాగం అధిక భాగం లాగ. ఏనుగు దాని ఆకారానికి తగ్గట్టుగానే మేత మేస్తుంది. ఏనుగంత మేత ఏనుగు మేసేంత ఎక్కువమేత అని,

 

నే నెక్కడా తా నెక్కెడ : నేనెక్కడా తనెక్కడ? (నాతో నీవు ఏవిషయంలోను సమ ఉజ్జీ కాదని చెప్పడమే ఈ జాతీయం యొక్క అర్థం.)

 

ఏ నోరు పెట్టుకొని మాటలాడుదుము? : ఒకడు చేసిన తప్పును కప్పిపుచ్చుకొనడానికి అబద్ధం చెప్పి ఆతర్వాత అసలు విషయం తెలిసి పోతే ఈ మాట వాడతారు.

 

ఏపూరోని దీపం మలిగినట్టు : ఏపూరి వంశం వారు ప్రజలను ఇబ్బందులపాలు చేయటంతో ఆ బాధలు తట్టుకోలేక ఆ గ్రామాల్లోని ప్రజలంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారట. ఆ ప్రజల ఉసురు తగిలి ఆ వంశం అంతా నిర్వంశం అయిందట. ఆ ఇళ్ళలో దీపం మలగలేదు (వెలిగించే వారే లేకుండా పోయారని అంటారు). నిర్వంశం కావటం లేదా దీపం వెలిగించే దిక్కు లేకుండా పోవటం

 

ఏ బట్టకా బట్ట మాసిక : సమ ఉజ్జీగా ఉండేవాళ్ళే ఒకటిగా కలిసిపోగలరని చెప్పటం.ఏ గూటి పక్షి ఆ గూటికి చేరినట్టు .

 

ఏ మరకా అంట లేదు : ఏలాంటి నింద అతని మీద పడలేదు: ఉదా: ఈ వ్యవహారంలో అతనికి ఏ మరకా అంటలేదు.

 

ఏమాట కామాటె చెప్పుకోవాలి :  ఇదొక ఊత పదం.

 

ఏ మొఖము పెట్టుకొని వెళ్ళెదము? : తమ ఇంటికి వచ్చిన ఒకరిని వెళ్ల గొట్టి ఆతర్వాత అవసర నిమిత్తం వారింటి వెళ్లవలసి వస్తే ఇలా అనుకుంటారు.

 

ఏ యెండకాగొడుగు పట్టు : అవకాశవాదం నీతి నియమాలు మాని సందర్భాను సారం తనకు లాబమైన పని చేసే వారిని గురించి దీన్ని వాడతారు

 

ఎల్లలు లేని :

 

ఏలుముడి :  తక్కువ స్థాయి . సిగను వేలుతో ముడివేసుకోవటం

 

ఏరు ఎండినా వయసు ముదిరినా : ఏ పని చేయాలన్నా తగిన సమయానికే చేయాలి. సమయం మించి పోయాక అవకాశాలన్నీ అయిపోతాయి.వయస్సు మీరిన తర్వాత, నది ఎండిపోయిన తర్వాత చెయ్యగలిగింది ఏమీ లేదు అని

 

ఏలేశ్వరోపాధ్యాయుడు :

 

ఏసులేని కొంప : ఏసు అంటే అభివృద్ధి, ఎదుగుదల లేని ఇల్లు

 

ఐదు పది కావటం : ఓడిపోవటం రెండు చేతుల్నీ ఒక చోటికి చేర్చినమస్కారం పెట్టడం అనేది ఓడిపోవటానికి, పారిపోవటానికి, లొంగిపోవటం లేదా మర్యాదపూర్వకంగా దండం పెట్టడాన్ని ఇలా అంటారు నిఘూడంగా.

 

ఐపు ఆజ్ఞ

అజా పజా

 

ఐరావతం : మోయలేని భారం == దేవేంద్రుడి వాహనం ఐరావతం. ఇది తెల్ల ఏనుగు. ఇది దైవంతొ సమానం. దీని చేత పనులు చేయించ కూడదు. అయినా మంచి ఆహారం పెట్టలి. అది మోయ లేని భారం.

 

ఐరావటం : కలిసి రావటం, లాభపడటం.అయి వచ్చింది, అయ వచ్చింది, ఐ వచ్చింది అంటారు.

 

ఐసరు బొజ్జ : అయిసర బజ్జా అని ఊపుతెచ్చుకొని దూకటం లేదా భారమైన పనిచేసెటప్పుడు పాట పాడుతు ఈ మాట అంటారు./

 

ఐలెస్సా : ఐలెస్సా ఐలెస్సా.... అని పూపు తెచ్చుకిని అందరు కలిసి బరువులను లాగటము. ఐసర బొజ్జా లాంటిదే ఈ మాట కూడ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages