ఒ
ఒంటి చేత్తో
సిగముడవటం : అసంభవం, ఎటువంటి
పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు వాస్తవదూరం
ఒంటి మీద ఒకటి
బండ మీద ఒకటన్నట్టు : పేదరికానికి
ప్రతీక.కనీసం కట్టుబట్టలు లేని స్థితి.ఒంటి మీద ఒక వస్త్రం ఆచ్ఛాదనగా ఉంటే మరొకటి
మాత్రమే ఉతకటానికి సిద్ధంగా ఉండటం.
ఒంటు పక్కన
సున్నా : స్వతహాగా కాకుండా ఎవరి సహాయం తోనైనా విలువను పెంచుకొనే
వ్యక్తి.ఒంటు అంటే అంకె.అంకెకు ఎడమవైపున ఎన్ని సున్నాలు పెట్టినా విలువ
ఉండదు.ఒంటుకు కుడివైపున ఏ ఒక్క అంకె వేసినా, లేదంటే ఒక్క సున్నా
పెట్టినా దాని విలువ అధికమౌతుంటుంది.
ఒంటెద్దు పోకడ : ఎవరి మాట వినని వాడని అర్థం:
...ఉదా: వానిది అంతా ఒటెద్దు పోకడ: ఎవరి మాట వినడు.
ఎవరితోనూ సంబంధం లేకుండా
ప్రవర్తించే తీరు తానొక్కడే ఆలోచించి తీసుకున్న నిర్ణయం
ఒంటి కాలిమీద
నిలబడ్డాడు : వెళ్లి పోవడానికి చాల తొందర పడుతున్నాడు:
ఉదా: వాడు ఒంటి కాలు మీద నిలబడ్డాడు ఎప్పుడు వెళ్లి పోదామా అని.
ఒంటికంటి
రామలింగం : ఒంటికంటి రామలింగం
అనేది తెనాలి రామలింగానికి సంబంధించిన పేరుగా ప్రజలలో ప్రసిద్ధి
ఒక అంకం
ముగిసింది : ఒక పని అయింది. ఉదా: ఆ పనిలి ఇప్పటికి ఒక
అంకం ముగుసింది. అనిశ్చిత స్థితి, సరిగా లేని సహాయం, క్షణానికో రకంగా ప్రవర్తించటం.ఒకసారి అనుకూలంగానూ, ఒకసారి
ప్రతికూలంగానూ వ్యవహరించట
ఒక కొలిక్కి
వచ్చింది : పని చివరి దశకు వచ్చిందని అర్థం.
ఒకనాడు విందు,ఒకనాడు
మందు : "ఒకరోజు ఒకరికి మంచే, మరోరోజు ఒకరికి చెడే
జరుగుతుంది" లేదా "ఒకరోజు ఆనందం, మరోరోజు
కష్టం". ఇది జీవితంలో వచ్చే హెచ్చుతగ్గులను, సుఖదుఃఖాలను
సూచిస్తుంది.
ఒక పంటి కిందికి
రావు
: ఏమాత్రం చాలవు, చాలా కొద్దిగా ఉన్నాయి.
ఒకటికి ఐదారు
కల్పించు : "నమ్మినది ఒకటి, వినిపించిందో,
ఊహించిందో ఐదు-ఆరు" అన్న భావంలో వాడతారు.
ఒక గుడ్డు పోయిననేమి? : తక్కువ
నష్టాన్ని తేలికగా తీసుకోవడాన్ని సూచించే సందర్భాల్లో వాడతారు
ఉదాహరణ: ఓ చోట చిన్న వస్తువు
పోయినా,
లేదా తక్కువ నష్టం జరిగినా, జీవితం
నిలిపేయకుండా, దాన్ని ఎప్పుడూ పట్టించుకోకూడదని, సాధ్యం అయితే దానిని మరిచి ముందుకెళ్ళాలని చెప్పే సమయంలో ఈ సామెత వాడతారు
ఒక కోడికూయు ఊరు : అతి తక్కువ ఇళ్లున్న వూరు.
ఒజ్జల పుచ్చకాయ : "ఒజ్జ" అంటే గురువు అన్న అర్ధం వస్తుంది. గురువులు లేదా ఉపాధ్యాయులు
తమ శిష్యులకు నిషిద్ధమని చెప్పిన వస్తువును వారే రహస్యంగా ఉపయోగించడం లేదా
నిలువచేయడాన్ని సూచిస్తుంది. ఇది వారి ద్వంద్వ వైఖరిని, చెప్పిన
మాటకు, చేసే పనికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సూచిస్తుంది.
ఒడిలోకొచ్చి పడడం : దక్కడం, లభించడం
ఒళ్లు మండడం : అయిష్టం, కోపం
రావడం == వీడంటే వాడికి బలే ఒళ్లు మంట ===ఒరగటం=== (వాడొచ్చి ఒరగ బెట్టిందేమి
లేదు) సమకూరటం, ప్రాప్తించటం, పరిస్థితులు
సానుకూలంగా మారటం, లాభం రావటం ఈ ప్రభుత్యం వచ్చి మాకు ఒరగ
బెట్టినదేమి లేదు.
ఒళ్ళో పెట్టటం : స్వాధీన
పరచటం చేతుల్లో పెట్టటం
ఒళ్లు మండు
తున్నది. : చాల కోపంగా వున్నదని అర్థం: ఉదా: వాన్ని
చూస్తుంటే నాకు వళ్లు మందు తున్నది.
ఓ
ఓడలు బండ్లగు : దిగజారిన పరిస్థితి.
ఒడలు చిదిమిన
పాలు వచ్చు : మిక్కిలి సుకుమారమైన.
ఒడినిండటం : సంతాన
భాగ్యం కలగటం, గోద్ భరనా
ఓనమాలు
తెలియనివాడు : అనుభవం లేనివాడు
ఓహరిసాహరి : తండోపతండంబులు
ఓ అనిన వ రాదు
అన్నట్టు : "ఏ ఒక్కసారి కూడా వస్తాడు అనే వాడు రావడం
లేదు" అని అర్థం. ఇది ఒక మనిషి లేదా విషయం నిరీక్షిస్తున్నట్లయినా, అటువంటి వ్యక్తి లేదా విషయం ఒకసారి కూడా కనిపించకపోవడం, లేక రాకపోవడం ఇంగితంగా ఉపయోగిస్తారు
ఔ
ఔరౌరా.... : ఆచ్యర్య పడటము. / మెచ్చుకోవడం కూడ.