Barata mataku jejelu telugu song lyrics భారత మాతకు జేజేలు
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు // 2//
ఆసేతు హిమాచల సస్యశ్యామల
జీవధాత్రికి
జేజేలు // 2//
// భారత మాతకు
//
త్రివేణి సంగమ పవిత్రభూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి // భారత మాతకు //
శాంతిదూతగా వెలసిన బాపూ ..
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు
విప్లవ వీరులు వీర మాతలు
ముద్దుబిడ్డలై మురిసే భూమి // భారత మాతకు //
సహజీవనము సమభావనము
మనతా వాదము వేదముగా
ప్రజా
క్షేమము ప్రగతి మార్గము
లక్ష్యములైన విలక్షణ భూమి .
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు ..
ఆసేతు హిమాచల సస్యశ్యామల
జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు