ఉంగరాలచేయి :
ఉట్టిలోగుమ్మడికాయ : ఉట్టిలోని గుమ్మడికాయ స్థిరంగా
ఉంటుంది. లేకుండా, కదలకుండా మెదలకుండా కూర్చున్న వ్యక్తిని ఆ
గుమ్మడికాయతో పోల్చటం మాటా పలుకూ అలనాలయింది మూగమొద్దులాగా బండబారినట్లున్న
వ్యక్తిని 'ఉట్టిలో గుమ్మడికాయ' అంటారు.
ఉంటే
లిక్కి పోతే కొడవలి : రాతకోత లేవీ లేకుండా, మరేసాక్ష్యాలు
లేకుండా ఇచ్చిపుచ్చుకోవటాలు.తక్కువ ఇచ్చి ఎక్కువ మొత్తాన్ని దబాయించి
తీసుకోటం.కొడవలి అరిగి చిన్నదైనప్పుడు లిక్కి అంటారు. ఓ వ్యక్తి ఓ సారి తన
లిక్కిని ఎదుటివారు అడిగినప్పుడు ఇచ్చాడట. ఆ తీసుకొన్న వారు ఆ లిక్కిని ఎక్కడో
పారేశారట. అప్పుడు లిక్కి ఇచ్చిన వ్యక్తి ఆ విషయాన్ని తెలుసుకొని తన కొడవలిని తనకు
ఇమ్మన్నాడట. అదేమిటయ్యా నువ్విచ్చింది లిక్కి కదా, కొడవలిని
అడుగుతావేమిటి అనంటే నేనిచ్చింది కొడవలే అని తగాదాకు దిగితే తీసుకొన్న వ్యక్తి
లిక్కి పోయింది కనుక వాస్తవమేమిటో రుజువు చెయ్యలేక కొత్త కొడవలి కొనిచ్చాడట.
ఉడతలు
పట్టేవాడు : ఏ పని
చేయని,
సోమరిపోతు వాడు అని అర్థం. దీనిని నిందా లేదా హేళనార్థకంగా
వినియోగిస్తారు. అంటే పనికిరావని వాడిని ఉద్దేశించి చెప్పబడే మాట ఇది.
అదేవిధంగా, ఎలాంటి
పనిలోనూ జోక్యం పెట్టని, ఆరవో తెలియని వ్యక్తిని ఉడతలు
పట్టేవాడని అంటారు. అంటే వ్యర్థసమయాన్ని వెచ్చించే వ్యక్తి అని భావిస్తారు
ఉండనా
ఊడనా అన్నట్లు : ఎప్పుడు రాలిపోతుందో తెలియని బలహీన
పరిస్థితి
ఉండనీడనిస్తే
పండ మంచం అడిగినట్లు : కొద్దిగా సహాయం చేస్తే ఇంకా ఇంకా సహాయం
చేయమని వెంబడి పడటం.కష్టాల్లో నుంచి బయటపడ్డ తర్వాత కూడా ఇంకా ఆ చేరదీసిన వారి
దగ్గరే ఉంటూ వారికి ఇబ్బందులు కలుగచేయటం. అలాంటి వరినుద్దేశించి ఈ మాటను వాడుతారు.
ఉక్కు
పిడికిలి : "ఉక్కు
పిడికిలి" అంటే "Iron Fist" అర్థంలో వివిధ
పరిస్థితులు, కార్యక్రమాలు లేదా ఉద్యమాల అవసరాలకు అనుసరించి
వాడబడుతుంది
కయ్యానికి
సిద్దం.. = గట్టి పట్టుదల గల వాడు.
ఉక్కుపాదం : ఉక్కుపాదం
మోపడం,
తీవ్రంగా అణచివేయటం == పోలీసులు తీవ్రవాదంపై ఉక్కు పాదం మోపారు.
ఉక్కుమనిషి : దృఢచిత్తుడు
గట్టి పట్టుదలతో ఉండేవాడు
ఉగ్గ
బట్టుకొని వున్నాడు : అతి బలవంతం మీద కోపం ఆపు కొని వున్నాడు:
ఉదా: వానికి కోపం వచ్చింది... కాని ఉగ్గబట్టుకొని ఉన్నాడు.
ఉగ్గుపాల
వయసు : పసితనం
....చిన్నప్పుడు... అని అర్థం.
ఉచ్చగుంటలో
చేపలు పట్టే రకం : పరమ నీచుడుడు: ఉదా: వాడు ఉచ్చగుంటలో చేపలు
పట్టే రకం.
ఉచ్చ
నీచములు : గౌరవ, అగౌరవములు == ఉచ్చనీచములు ఎరిగి సరైన
వారితో స్నేహం చేయాలి. ఆసందర్భంలో ఈ మాటను వాడుతారు.
ఉచ్చు
బిగిస్తున్నది : ప్రమాధంలో పడుతున్నాడని అర్థం:
ఉచ్చులోకిలాగటం : మోసంచేయాలని
చూడటం = పాపం అమాయకుడు. వాడినికూడ ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. అలాంటి
వారినుద్దేశించి ఈ మాటను వాడతారు.
ఉట్టిలో
పెట్టిన గుమ్మడిలా : కదలక, మెదలక పొంకముగా కూర్చొనుట
ఉడకేసుకొని
తిని...తడికేసుకొని పడుకున్నట్టు : పని ఒత్తిడేమీ
లేకుండా సాఫీగా కాలం సాగిపోవటం హాయిగా కావాల్సింది వండుకుని తినటం, చక్కగా
నిద్రపోవటం
ఉడ్డకు
ముగ్గురు తక్కువ : ఉడ్డ అనగా నాలుగు అని అర్థం: లెదా నలుగురు
అని అర్థం: కూలీలు ఎంత మంది వచ్చార్రా అని అడిగితే ఉడ్డకు ముగ్గురు తక్కువ"
అని జవాబుచెప్పాడు. అనగా ఒకడే వచ్చాడని అర్థం. హాస్యంగా చెప్పడం.
ఉడాయించాడు : పారి
పోయాడు అని అర్థం.
ఉడుత
భక్తి : చేతనైన సాయం
చేయటం.సేవాభావంతో చేసే చాల చిన్ని సహాయాన్ని ఉడుతాభక్తి అంటారు.
ఉడుము
పట్టు : పట్టిన పట్టు వదలకపోవటం,మొండిపట్టు
==ఉదా:.. ఈ విషయంలో వాడిది ఉడుము పట్టు. గట్టి పట్టుదల గల వారి గురించి ఈ మాట
వాడతారు.
ఉత్తరాషాఢ
పూర్వాషాఢ
ఉత్తడుఙ్ఙలు : ఈ పదం సాధారణంగా "ఉతికి
ఆరేశారు" వంటి అర్ధంలో వస్తుంది, అంటే "బాగా
చీవాట్లు పెట్టారు" అని అర్థం. ఉదాహరణకి, అసెంబ్లీలో
ప్రతి పక్షాలు ఎదుటివారిని ఉతికి ఆరేశారు అని వాడతారు.
అంటే
"ఉత్తడుఙ్ఙలు" అనేది ఒక దృష్టాంతపు, ఆరోపణాత్మక, లేదా విమర్శాత్మక అభివ్యక్తి, దానికి దగ్గరగా ఉండే
అర్థం "బాగా ఉటంకించడం, విమర్శించడం లేదా చీవాట్లు
పెట్టడం" అని చెప్పవచ్చు.
ఉతికి
ఆరేశారు : బాగా చీవాట్లు పెట్టారు; ఉదా: అసెంబ్లీలో ప్రతి
పక్షాలు ఎదుటి వారిని ఉతికి ఆరేశారు.
ఉత్సవవిగ్రహం
ఉద్దరించిది
చాలు : చేసినది చాలు ఇక
వెళ్లు అని అర్థం>
ఉన్నపళంగా
వచ్చేయ్ : వెంటనే
వచ్చేయమని అర్థం.
ఉప్పుతో
తొమ్మిది : ఉప్పు
తిన్నవాడు ఉపకారం చేస్తాడు, అంటే ఉప్పు తిన్నవాడు ఇతరులకు
సహాయం చేసే వ్యక్తి అవుతాడు. ఈ సామెతలో ఉప్పు అంటే సహాయం లేదా సహకారం అందించే
వ్యక్తిని సూచిస్తుంది.
ఇక "ఉప్పుతో
తొమ్మిది,
పప్పుతో పది" అనే సామెత కూడా ఉంది, దీనిలో
ఉప్పుతో చేసిన పని లేదా సహాయం గొప్పదనం కలిగి ఉంటుందని, పప్పుతో
చేసే పని లేదా సహాయం మరింతనే ఉంటుందని అర్థం.
ఈ సామెత ద్వారా
ప్రజలు తమ మాటకారిగా, తమంతో ఊరిమీద బ్రతికేస్తారని తెలియజేస్తారు,
అంటే మంచి సహాయం చేసే వారు సమాజంలో గౌరవంగా ఉంటారు.
ఉప్పు
నిప్పు లాగ : ఉదా:
వారిద్దరు కలిస్తే ఉప్పు నిప్పే: శతృత్వం, చిట పట లాడ తారు. ఆ
సందర్భంలొ ఈ మాటను వాడుతారు.
ఉప్పు
పిరికి : దీని అర్థం
పూర్తిగా నిరుపయోమైన వాడని, పనికి రాని వాడు అని
చెప్పుకోవడం. ఉదాహరణకు, "వాడు ఉప్పు రాతికికూడ
కొరగాడు" అంటే ఆ వ్యక్తి ఉప్పు రాతికి కూడా కారణం కాకపోవడం, మటుకు పనికలేని వాడని అర్థం. ఈ మాటను అవసరానికి, అనర్థానికి
పనికి రాని, అప్రయోజనకరమైన వ్యక్తుల గురించి ఉపయోగిస్తారు.
ఉప్పు
రాతికి కొరగాడు : పూర్తిగా నిరుపయోమైన వాడని అర్థం. ఉదా:
వాడు ఉప్పు రాతికికూడ కొరగాడు. అలాంటి వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
ఉప్పు
రాతి పని లేదు : పనేమి
లేదని అర్థం ; ఉదాహరణకు ఒక సామెత వున్నది. ఉప్పురాతి పనిలేదు
అరగడి తీరిక లేదు... ఇది ఒక సామెత.
ఉప్పు
పాతర వేయిస్తా : పెద్ద శిక్ష వేస్తానని బెదిరించడం.
ఉమ్మయ
జగ్గాయలు : ఉమ్మయ
జగ్గాయలు అంటే ఇద్దరు మిత్రులు కలసి అనుకొన్న పని చేయటానికి కలిసి సహకరించడం. పని
అయిపోయాక ఒక్కోరికి వేరే దారి పోవడం.
ఈ మాట
"ఉమామహేశ్వరుడు" మరియు "జగన్నాథుడు" అనే పదాల నుంచి వచ్చిందని
భావిస్తారు. ఉమామహేశ్వరుడు శివుడి రూపం, జగ్గాయ్లు (జగన్నాథుడు)
విష్ణువు రూపం. వీరు ఒకరినొకరు రక్షించుకోవటానికి కలిసి ఉంటారు. ఆ పని పూర్తయ్యాక
వారి వారి తీరును అనుసరిస్తారు.
అంటే, ఇద్దరు
స్నేహితులు కలిసికట్టుగా పని చేయడం కానీ, ఆ పని ముగిసిన
తర్వాత విడవడం అనే భావన ఇది.
ఉవాచ : సాధారణంగా ఇది సంభాషణల్లో ఒక
వ్యక్తి చెప్పినది అని సూత్రీకరించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు, భక్తి
గ్రంథాలు, పురాణాలు, ధర్మ గ్రంథాలలో
"ఉవాచ" అనే పదం ఒక దేవుడు, వ్యక్తి లేదా పాత్ర
మాటలు చెప్పిన సమయంలో ఉపయోగించబడుతుంది.
ఉసి
గొల్పడం : ఉదా: నిన్ను వానిపైకి ఉసి
గొల్పుతున్నారు జాగ్రత్త.
ఉండ బట్టలేని
వాడు : ఊరికే వుండకుండా
ఏదో ఒక పని చేసి చిన్న చిన్న కష్టాలను కొని తెచ్చుకొనే వారిని గురించి ఈ మాటను
వడతారు.
ఉడుము
వచ్చినట్లు : ఉడుము గుడ్లగూబ ఇంట్లోకి వస్తే అశుభం అని
మూఢనమ్మకం. ఆసూయపరులు, దుర్మార్గులు ఇళ్ళలోకి రావటం అసలు అశుభం
ఉత్తర
కుమారుడు : గొప్పలు చెప్పేవారు.బడాయిపోయేవారు.ప్రేయసీ
ప్రియుల నడుమ ఉత్తరాలందిస్తూ వారి ప్రేమ పెరగటానికి సహకరించేవాడు ఉత్తరాన్ని
రహస్యంగా తీసుకెళ్ళి ఇచ్చేవాడు
ఉత్తరకుమారుని
ప్రజ్ఞలు : పిరికివాని
ప్రగల్భాలు. == వాని మాటలు వట్టి ఉత్తరకుమార ప్రగల్బాలు.
ఉత్సవ
విగ్రహాలు : ఉత్తుత్తి
విగ్రహాలు.అసలు విగ్రహాలు వేరే.బ్రహ్మోత్సవాల్లో గర్భగుడిలోని మూలవిరాట్టుకు
బదులుగా వూరేగింపునకు వచ్చిన విగ్రహాలు. ఉదా:వాడొట్టి ఉత్సవ విగ్రహం.... ఉత్సవ
విగ్రహాన్ని కేవలం ఊరేగింపుకు మాత్రమె వాడతారు. పూజాదులకు మాత్రం. గర్బగుడిలోని
మూల విగ్రహానికె.
ఉన్నది
గట్టి పోయింది పొట్టు : ధాన్యాన్ని చెరిగితే పొట్టు, పొల్లు
ఎగిరిపోయి గట్టి గింజలు మాత్రం మిగులుతాయి. పోయిన వస్తువులు పొట్టుతో సమానమని
అనుకోవాలి.
ఉన్న
బలిమి : సంపదతో బలవంతులు,ధనవంతులు.
ఉప్పు
పత్రి : అడ్డు అదుపు లేని నోరు గురించి దీనిని వాడతారు
ఉప్పుడు
పెట్టడం : లోలోపల మధన పడేలా
బాధపెట్టడం
ఉప్పు
తిను : "మీ ఉప్పు తిన్న విశ్వాసం" అంటరు
చూడండి ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు.
ఉబ్బేయటం : పొగిడి
సంతోషపెట్టటం,ఉబకెయ్యటం,విపరీతంగా పొగడటం ==
వాడు నిన్ను బాక ఉబ్బేస్తున్నాడు.
ఉయ్యాలో
జంపాలో : చిన్న పిల్లలను
ఆడిస్తూ పాటపాడుతూ ఉయ్యాలలో ఊపుతూ నిద్రపుచ్చటం
ఉరమటం : కోపంతో గట్టిగా అరవటం == వాడు
నీమీదెందుకు అలా ఉరుముతున్నాడు.?
ఉరి
పెట్టడం : బాధ పెట్టడం ఉరి తీసినా, తీయక పోయినా అంతటి బాధను
అనుభవించి కుమిలి పోయేలా చేయటం
ఉరుకులు
పరుగుల మీద : అత్యంత శీఘ్రంగా వేగంగా == వారంతా ఉరుకులు
పరుగులు మీద వచ్చారు.
ఉల్లము
పల్లవించు : హృదయము పల్లవించు ,హృదయము
చిగురించు
ఉసూరుమను : నిరాశ చెందటం. == ఉదా: వారు
వెళ్లిన పని కాక పోయె సరికి 'ఉసూరు మంటు' తిరిగి
వచ్చారు. వెళ్లిన పని కాకుండ తిరిగి వచ్చిన వారి గురించి ఈ మాటను వాడతారు.
ఉస్సురను : బాగా పనిచేసి అలసినవారు బడలిక
తీర్చుకోటానికి చేసే నిట్టూర్పు