Type Here to Get Search Results !

ఊ - అక్షరంతో జాతీయాలు

0

 

ఊకదంపుడు : ఊక అనగా వడ్లగింజపైనుండే పొట్టు. వడ్లను దంచితే పైపొట్టు పోయి బియ్యం బయడ పడతాయి. అందుకే వడ్లను దంచుతారు. కానీ ఊకను దంచితే ఏమి ఫలితముండడు. ఆ అర్థంలో అనవసరంగా వ్వర్థ ప్రసంగం చేసేవారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉటంకిస్తారు. వ్వర్థం అనే అర్థంలో.

 

ఊడలమర్రి :  నిర్మూలించడానికి వీలులేని విధంగా విస్తరించినది అని

 

ఊడలు పాకటం :  అధికంగా వ్యాపించటం వూడలు దిగటం

 

ఊ అన్నా... ఆ అన్నా... తప్పే :  మాటమాటకీ, తరచుగా అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ప్రత్యేకించి ఏ భావమూ వ్యక్తపరచకపోయినా ఏమాత్రం మాట్లాడినా ఆ మాటలకు కొంతమంది పెడార్థాలను చెప్పుకున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "వాడితో అసలు మాట్లాడలేము. వూ అన్నా.. కోపమే, ఆ అన్నా.. కోపమే, ఆ ఇంట్లోవాళ్ళు ఎలా భరిస్తున్నారో మరి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

 

ఊపునివ్వడం :  ప్రోత్సాహమివ్వడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. స్తబ్ధంగా ఉన్నప్పుడు ఒకచోట పడిఉండడం తప్ప మరేవిధమైన పని జరగడానికి వీలుండదు. అదే కదలికలో ఉన్నప్పుడు, అది కూడా మంచి వూపుతో ఉన్నప్పుడు కార్యసాధనకు వీలు కలుగుతుంది. ఈ చలనాత్మక దశలో ఉన్న శక్తిని సూచించే విధంగా వూపునివ్వడం అనేది కార్యసాధనకు ఉద్యమించేలా చేయడం, కదలికను తెప్పించడం, ప్రోత్సాహాన్ని కలిగించడం అనేలాంటి అర్థాలలో ప్రయోగంలోకి వచ్చింది. 'ఆ నాయకుడి ప్రసంగం అందరికీ మంచి ఊపునిచ్చింది' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

 

ఊపుమీద ఉన్నాడు : చాలా సంతోషంగా లేదా ఉత్సాహంగా వున్నాడు అని అర్థం

 

ఊర్మిళ నిద్ర  :  కుంభకర్ణుడు లాగానే లక్ష్మణుడి భార్య వూర్మిళ కూడా ఎక్కువగా నిద్రపోయేది.అలా ఎక్కువ సేపు నిద్ర పోయే ఆడవారిది ఊర్మిళనిద్ర అంటారు

 

ఊళ్ళోబిచ్చం, గుళ్ళోనిద్ర :  పేదరికంతో ఉన్న కొందరికి రోషం ఉంటుంది. భిక్షాటన చెయ్యటమంటే తప్పని వారు భావించి ఎలాగోలా ఒళ్ళొంచి పనిచేసి తమ జీవనభృతిని సంపాదించుకొంటారు. కానీ కొంతమంది కన్ను, కాలు అన్నీబాగున్నా బద్దకంతో ప్రవర్తిస్తూ భిక్షాటనకు దిగుతారు. అలాగే ఏ మఠంలోనో, గుళ్ళోనో తలదాచుకుంటారు. ఇదంతా వారి సోమరితనానికి గుర్తేతప్ప మరొకటికాదు. ఇలా ఎవరైనా అన్నీ బాగుండి కూడా సోమరితనంతో ప్రవర్తిస్తున్నప్పుడు "వాడికేంలే వూళ్ళోబిచ్చం, గుళ్ళోనిద్ర. ఇల్లూవాకిలి పట్టకుండా తిరుగుతుంటాడు. వాడితో నీకెందుకు" అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

 

ఊదర గొడుతున్నాడు :  అనవసరమైన మాటలు అతిగా వాగుతున్నాడు అని అర్థం.

 

ఊరికి మొనగాడు :  గొప్పవాడని అర్థం: దీన్ని నిందా వాచకంగా కూడా వాడతారు.

 

ఊచ కోత కోశారు :  చాల మందిని చంపేశారని అర్థం

 

ఊపిరి సలపనివ్వడు :  కొంతసేపు కూడా విరామమివ్వడని అర్థం.

 

ఊపు మీదున్నాడు :  చాల సంతోషంగా వున్నాడని అర్థం>

 

ఊబిలో దిగాడు :  కష్టాలు చుట్టు ముట్టాయని అర్థం.

 

ఊపిరితీసుకోనివ్వడు :  ఏమాత్రం విరామమివ్వడని అర్థం.

 

ఊపిరి ఆడడం లేదు :

ఊపిరి సలపడం లేదు :

ఊపిరి పోశాడు :  రక్షించాడని అర్థం.

 

ఊపిరి బిగబట్టి :  ఊపిరి బిగబట్టి” అనగా తెలుగులో ఉన్న సామెతల ప్రకారం “గాలికి కడుపు నింపదు,” అంటే ఆకలిని తీర్చదు లేదా తృప్తి ఇవ్వదు అనే అర్థం. ఇది ఒక ఆంగ్ల సామెత "with bated breath" కు తెలుగు అనువాదంగా కూడా వాడుతారు

 

ఊరు ఉసిరి కాయంత...... తగువు తాటికాయంత :

 

ఊసులాడు :  ఊసులాడు” అంటే చిట్-చాట్ చేయడం, టైము వృథా మాట్లడడం, చిరునవ్వుతో తేలికపాటి సంభాషణ అని అర్థం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages