ఫ్ర : మన పెదవులు ఎరుపు గా ఉంటాయి
ఎందుకు ?
జ: మన శరీరములో భాగాలైన అరికాళ్ళు , అరిచేతులపైన
ఉండే చర్మము దళసరిగా ఉంటుంది . పెదవులపై ఉండే చర్మము పలుచగా ఉంటుంది . అందువలన
పెదవులకింద రక్తనాళాల్లో ప్రవహించే రక్తం అర్ధపారదర్శకమైన పెదవుల ద్వారా బతటికి
కనిపిస్తుంది . అందుకే అవి ఎర్రగా ఉంటాయి .