హెలికాప్టర్ , విమాలన్లలో
వాడే బ్లాకు బాక్స్ అంతే ఏమిటి , అది ఎలా ఉపయోగపడుతుంది ?
నీటిలో తడిచినా ఏమీ కాదు , అత్యధిక
ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది .. కాబట్టి మంటలలో కాలిన పాడు అవదు . గట్టి పదార్ధం తో
తయారు చేస్తారు కనుక ఎంత ఎత్తి నించి కింద పడినా విరగదు . అదే బ్లాకు బాక్స్ . ..
విమానాలు , హెలికాప్టర్ లలో తప్పనిసరిగా వీటిని అమర్చుతారు .
చిత్రమేమంటే బ్లాకు బాక్స్ నల్లగా ఉండదు . నారింజ రంగులో ఉంటుంది . విమానము
పేలిపోయినా , ముక్కలైపోయినా ... ఇది మాత్రము సురక్షితం గానే
ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు . విమానము నడిపే సమయము లో పైలట్ల సంభాషణలను ఇతర శబ్దాలను
కొన్ని గంటలపాటు రికార్డ్ చేసే ఏర్పాటు దీనిలో ఉంటుంది . అంతే పమాదానికి ముందు
ఎవరేం మాట్లాడారో శబ్దాలు ఏమిటో లాంటి సమాచారాన్ని బ్లాకు బాక్స్ ద్వారా
తెలుసుకోవచ్చును . అందుకే దీని పాత్ర చాలా కీలకమైనది .
బ్లాకు బాక్స్ ఆంటీ ఒక వ్యవస్థ
లాంటిదన్నమాట , ఫ్లైట్ డాటా రికార్డర్ (FDR) కాకపిట్
వాయిస్ రికార్డర్ (CVR) అనే రెండు శబ్దగ్రాహక యంత్రాలు
ఇందులో ఇమిడి ఉంటాయి . ఇందులో fdr యంత్రం లో విమానము ఎంత
ఎత్తులో వెళ్ళింది , ఏ దిశలో వెళ్ళింది , ఎంత వేగం తో గాలి వీచింది లాంటి సాంకేతిక సమాచారము నమోదవుతూ ఉంటుంది . cvr
యంత్రము లో అన్ని రకాల శబ్దాలు కొన్ని గంటల పాటు నమోదై ఉంటాయి . ఈ
సమాచారము మొత్తాన్ని పరిశోధించి , విశ్లేషించడం ద్వారా
నిపుణులు వాయు వాహనాల ప్రమాదాలము కారణాలేంటో తెలుసుకో వచ్చును .
అందుకే ఎక్కడ విమాన ప్రమాదం
జరిగినా .. వెంటనే బ్లాకు బాక్స్ కోసమే వెతుకుతారు . నీటిలో మునిగిపోయినా సరే
సునిశితమైన ఆల్త్రసోనిక్ శబ్దతరంగాలను వెలువరించే ఏర్పాటు కుడా వీటిలో ఉంటుంది .
దీని ధర ఏడున్నర లక్షల రూపాయల వరకు ఉంటుంది . ఈ బ్లాకు బాక్స్ యంత్రాలతో అనుసంధానం
చేసిన సెన్సార్లు విమానమంతా అమర్చి ఉంటాయి .
విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్
కుడా కొంత సమాచారాన్ని నమోదు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసారని చెబుతారు ... అయితే
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వాడకం విస్తరించబడింది , ఇప్పుడైతే
విమానము లో బ్లాకు బాక్స్ తప్పనిసరి . మొదట్లో సమాచారము నమోదుకు మాగ్నటిక్ టేప్
లను ఉపయోగించినా ఇప్పుడు దృఢమైన మెమరీ చిప్ లను వాడుచున్నారు . మొదటిగా బ్లాకు
బాక్స్ ఫ్లైట్ రికార్డర్ ఉండాలనే అల్లోచన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త " డేవిడ్
వారెన్"కి వచ్చించి . అలా 1953 కల్లా ఆస్ట్రేలియాలో
దీన్ని తాయారు చేశారు .
.jpg)
A "black box" can refer to two
main things: a device in an aircraft that records flight data and cockpit
audio, or a system or process whose internal workings are secret or difficult
to understand. The aviation "black box," technically the Flight Data
Recorder (FDR) and Cockpit Voice Recorder (CVR), is a damage-resistant device
that helps investigators understand the cause of a plane crash by recording key
flight information and conversations between the pilots. In a broader sense,
the term is used to describe a system, like an artificial intelligence (AI)
model or a financial market, where the inputs and outputs are observable, but
the internal logic is not transparent.