Type Here to Get Search Results !

తెలుగు సంవత్సరాలు ఫలితాలు

0

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.



No పేరుతెలుగు సంవత్సర ఫలితము.
1ప్రభవప్రభవించునది అంటే పుట్టుక.యజ్ఞములు విరివిగా జరుగుతాయి.
2విభవవైభవంగా ఉండేది. జనులు సుఖముగా ఉంటారు.
3శుక్లఅంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక పంటలు సమృద్ధిగా పండుతాయి.
4ప్రమోదూతఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత ప్రజలందరు ఆనందంగా ఉంటారు
5ప్రజోత్పత్తిప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి అంతటా అభివృద్ధి కనిపిచును
6అంగీరసఅంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థంభోగములు కలిగి ఉంటారు
7శ్రీముఖశుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం లోకమంతా సౌఖ్యముగా ఉంటుంది
8భావభావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు ఉన్నత భావమును కలిగిస్తుంది
9యువయువ అనేది బలానికి ప్రతీక ఇంద్రుడు వర్షములు కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది
10ధాతఅంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. అన్ని ఔషధులు (మొక్క ధాన్యాలు)పండును
11ఈశ్వరపరమేశ్వరుడు. అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును
12బహుధాన్యసుభిక్షంగా ఉండటం.అన్ని రకాల పంటలూ విరివిగా పండటం దేశమంతా సుభిక్షముగా ఉంటుంది
13ప్రమాదిప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు. ప్రమాదో ధీమతామపి అన్నారు.
14విక్రమవిక్రమం కలిగిన వాడు. మధ్యమ వర్షపాతము ఉంటుంది
15వృషచర్మం. అంతటా వర్షములు కురుస్తాయి
16చిత్రభానుభానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం. సూర్యునిలో మార్పులకు అవకాశం వుంటుంది. చిత్రవిచిత్ర అలంకారములను ఇస్తుంది
17స్వభానుస్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం క్షేమము ఆరోగ్యము ఇస్తుంది
18తారణతరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం. పంటలకు అనుకూలముగా వర్షములు కురుస్తాయి
19పార్థివపృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.సస్యములు సంపదలు సమృద్ధి ఔతాయి
20వ్యయఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం అతివృష్ఠి కలుగుతుంది
21సర్వజిత్తుసర్వాన్ని జయించినది ప్రజలు సుఖించునట్లు వర్షాలు పడతాయి.
22సర్వధారిసర్వాన్ని ధరించేది. సుభిక్షముగా ఉంటుంది.
23విరోధివిరోధం కలిగినట్టువంటిది. మేఘాలను హరించి వర్షము పడకుండా చేద్తుంది
24వికృతివికృతమైనటువంటిది. భయంకరముగా ఉంటుంది
25ఖరగాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.పురుషులు వీరులౌతారు
26నందనకూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది. ప్రజలు ఆనందముగా ఉంటారు
27విజయవిశేషమైన జయం కలిగినది. శత్రువులను హరించును
28జయజయాన్ని కలిగించేది. శత్రువులు, రోగముల మీద విజయము కలుగుతుంది
29మన్మథమనస్సును మధించేది. జ్వరాఫ్హిబాఫ్హలు కలుగును
30దుర్ముఖిచెడ్డ ముఖం కలది.ప్రజలు దుష్కర్మలు చేస్తారు
31హేవిలంబిసమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం సంపదలు కలుగును
32విలంబిసాగదీయడం. సుభిక్షముగా ఉంటుంది
33వికారివికారం కలిగినది. శత్రువులకు కోపము కలిగించును
34శార్వరిరాత్రి అక్కడక్కడా పంటలు పండును
35ప్లవతెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం కష్టాలనుంచి దాటిస్తుంది సమృద్ధిగా జలం ప్రవహించును
36శుభకృతుశుభాన్ని చేసి పెట్టేది ప్రజలు శుభముంగా ఉంటారు
37శోభకృతుశోభను కలిగించేది ప్రజలు శుఖంగా ఉంటారు
38క్రోధిక్రోధాన్ని కలిగినది కోపస్వభావం పెరుగుతుంది
39విశ్వావసువిశ్వానికి సంబంధించినది ధనసమృద్ధి కలుగుతుంది
40పరాభవఅవమానం. ప్రజలు ఒకరిని ఒకరు అవమానించుకుంటారు
41ప్లవంగకోతి, కప్ప. జలసమృద్ధి అధికంగా ఉంటుంది
42కీలకపశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య. సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది
43సౌమ్యమృదుత్వం.ప్రజలకు శుభములు కలుగుతాయి
44సాధారణసామాన్యంగా వుండునట్టిది. ప్రజలకు సామన్య శుభములు కలుగుతాయి
45విరోధికృతువిరోధాలను కలిగించేది ప్రజలలో విరోధభావం పెరుగుతుంది
46పరీధావిభయకారకం. ప్రజలలో భీతి అధికం ఔతుంది
47ప్రమాదీచప్రమాద కారకం.
48ఆనందఆనందమయం ప్రజలు ఆనందంగా ఉంటారు
49రాక్షసరాక్షసత్వాన్ని కలిగినది. ప్రజలులో క్రూర స్వభావం అధికమవుతుంది
50నలనల్ల అనే పదానికి రూపాంతరం.
51పింగళ (లేదా) పింగలఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52కాళయుక్తి (లేదా) కాలయుక్తికాలానికి తగిన యుక్తి.
53సిధ్ధార్థికోర్కెలు సిద్ధించింది.
54రౌద్రిరౌద్రంగా ఉండేది. ప్రకృయి విపత్తులు సంభవిస్తాయి
55దుర్మతిదుష్ట బుద్ధి. ప్రజలకు దుర్బుద్ధులు అధికమౌతాయి
56దుందుభివరుణుడు.
57రుధిరోద్గారిరక్తాన్ని స్రవింప చేసేది. రక్తధారలు ప్రవహిస్తాయి
58రక్తాక్షిఎర్రని కన్నులు కలది. ప్రజలకు ప్రకృతికారక కోప విపత్తులు కలిగే అవకాశం వుంటుంది
59క్రోధనకోప స్వభావం కలది. ప్రజలలో క్రోధం అధికమౌతుంది
60అక్షయనశించనిది. ప్రజలు సుభిక్షంగా ఉంటారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages