Type Here to Get Search Results !

AP Model School Entrance Exam Notification

0

 

ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు
2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ ప్రకటన
తేదీ: 16-02-2026

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు) లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేయబడింది.

ప్రవేశ పరీక్ష తేదీ: 12-04-2026 (ఆదివారం)
సమయం: ఉదయం 10:00 నుండి 12:00 వరకు

ఈ పరీక్ష ఆయా మండలాల ఆదర్శ పాఠశాలలలో నిర్వహించబడుతుంది.

ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు / ఇంగ్లీషు మాధ్యమంలో నిర్వహించబడుతుంది.
ఆదర్శ పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.

 

ప్రవేశ అర్హతలు:

1) వయస్సు:

  • OC / BC విద్యార్థులు:
    01-09-2014 నుండి 31-08-2016 మధ్య జననం అయి ఉండాలి.
  • SC / ST విద్యార్థులు:
    01-09-2012 నుండి 31-08-2016 మధ్య జననం అయి ఉండాలి.

 

2) విద్యార్హత:

  • 2024-25 మరియు 2025-26 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ / గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి.
  • 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.

 

3) దరఖాస్తు వివరాలు:

సమగ్ర సమాచారం కోసం:

 

4) దరఖాస్తు విధానం:

  • 23-02-2026 నుండి 31-03-2026 వరకు
  • Net Banking / Credit / Debit Card ద్వారా Payment Gateway ద్వారా ఫీజు చెల్లించాలి.
  • చెల్లింపు అనంతరం Journal Number పొందాలి.
  • Journal Number ద్వారా Online దరఖాస్తు పూర్తి చేయాలి.

 

5) పరీక్ష ఫీజు:

  • OC / BC: ₹200/-
  • SC / ST: ₹125/-

 

6) ప్రవేశాల సంఖ్య:

  • OC / BC విద్యార్థులకు: 35 సీట్లు
  • SC / ST విద్యార్థులకు: 30 సీట్లు

 

7) ఎంపిక విధానం:

ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక చేయబడుతుంది.

 

8) పరీక్ష విధానం:

  • Objective Type ప్రశ్నాపత్రం

ఇతర వివరాలకు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులను లేదా మండల విద్యాశాఖ అధికారులను సంప్రదించవచ్చు.

 

Vijay Rama Raju V, I.A.S.
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

 

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages