Type Here to Get Search Results !

అమ్మా ఉయ్యాలా! చదువమ్మా Song Lyrics

0

 

అమ్మా ఉయ్యాలా! చదువమ్మా జింపాలా,

సర్కారు బడిలోనే చదువుకోవాలా

చదువుకోవాలా?

 

 పలకా ఉయ్యాలా, బలపం జింపాలా,

బడి సంచి జబ్బకేసి బడి బాట పట్టాలా,

బడి పాట పాడాలా?

 

అక్షరాలు నువ్వు దిద్దాలా

లక్షణాలు నువ్వు నేర్వాలా,

చదువమ్మా ఒడిలోనే సాగిపోవాలా

నువు   సాగిపోవాలా?

 

అమ్మా ఉయ్యాలా! చదువమ్మా జింపాలా,

సర్కారు బడిలోనే చదువుకోవాలా చదువుకోవాలా?

పలకా ఉయ్యాలా, బలపం జింపాలా.

 

 

 

రామా చిలుకాలాగా రాగం ఎత్తాలా,

గువ్వ గోరింక వలె రివ్వున ఎగురాలా

రివ్వున ఎగురాలా?

 

అల్లారు ముద్దోగా నువ్వు చదువుకోవాలా,

 

దాయమ్మా దాయి అని పద్యము చదవాలా,

పాటలు పాడాలా?

 

అమ్మా ఉయ్యాలా! చదువమ్మా జింపాలా,

సర్కారు బడిలోనే చదువుకోవాలా

చదువుకోవాలా చదువుకోవాలా.

బడి గంట కొట్టగానే బడిలో ఉండాలా,

చదువుల తల్లికి మొక్కి ప్రార్థన చేయాలా ప్రార్థన చేయాలా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages