Draft New Pension Rules – ఉద్యోగుల ప్రశ్నలు & జవాబులు
ప్రశ్న 1:
పెన్షన్ కోసం గరిష్ఠ అర్హత సేవ ఎంత?
జవాబు:
పెన్షన్ లెక్కింపుకు గరిష్ఠ అర్హత సేవ = 33 సంవత్సరాలు.
33 సంవత్సరాలకు మించి చేసిన సేవకు అదనపు పెన్షన్ లాభం లేదు.
ప్రశ్న 2:
33 సంవత్సరాలు పూర్తయిన వెంటనే తప్పనిసరిగా రిటైర్ కావాలా?
జవాబు:
కాదు.
కానీ, “Public Interest” పేరిట నియామక అధికారి అవసరమైతే రిటైర్ చేయవచ్చు.
ఇదే వివాదాస్పద అంశం.
ప్రశ్న 3:
33 సంవత్సరాల సేవ పూర్తయితే ఎంత పెన్షన్ వస్తుంది?
జవాబు:
రిటైర్మెంట్ రోజున తీసుకున్న చివరి వేతనం (Last Pay Drawn) లో 50%
అదే పూర్తి పెన్షన్.
ప్రశ్న 4:
Average Emoluments పద్ధతి ఉందా?
జవాబు:
లేదు.
పాత పద్ధతి పూర్తిగా రద్దు చేశారు.
ఇప్పుడు పెన్షన్ పూర్తిగా చివరి వేతనం ఆధారంగా ఉంటుంది.
ప్రశ్న 5:
ఏ ఏ సెలవులు అర్హత సేవలో లెక్కిస్తారు?
జవాబు:
CL, EL, HPL, Commuted Leave
Medical, Maternity, CCL
ప్రభుత్వం అంగీకరించిన Study Leave
జీతనష్టం సెలవులు (LWP / EOL) లెక్కించరు.
ప్రశ్న 6:
జీతనష్టం సెలవులు ఎందుకు సమస్యగా మారాయి?
జవాబు:
ఎందుకంటే,
LWP అర్హత సేవలో లెక్కించరు.
దీంతో మహిళా ఉపాధ్యాయులు, అనారోగ్య కారణాలతో సెలవులు తీసుకున్నవారు
పెన్షన్‌లో నష్టపోతారు.
ప్రశ్న 7:
మేటర్నిటీ లీవ్ / చైల్డ్ కేర్ లీవ్ లెక్కిస్తారా?
జవాబు :
అవును.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మంజూరు అయితే
అర్హత సేవలో లెక్కిస్తారు.
ప్రశ్న 8:
సస్పెన్షన్ కాలం పెన్షన్‌లో లెక్కిస్తారా?
జవాబు :
డ్యూటీగా పరిగణిస్తే – లెక్కిస్తారు
శిక్షగా పరిగణిస్తే – లెక్కించరు
ప్రశ్న 9:
33 సంవత్సరాలకు ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
జవాబు :
అవును.
20 సంవత్సరాల అర్హత సేవ తర్వాత Voluntary Retirement తీసుకోవచ్చు.
కానీ పెన్షన్ అనుపాతంగా ఉంటుంది.
ప్రశ్న 10:
33 సంవత్సరాల తర్వాత పనిచేస్తే లాభం ఏమైనా ఉందా?
జవాబు :
పెన్షన్ విషయంలో లాభం లేదు.
కానీ జీతం మాత్రం కొనసాగుతుంది.
ప్రశ్న 11:
పెన్షన్ రూల్స్ 2026 ఎవరికీ వర్తిస్తాయి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు / ఉద్యోగులకు
ఈ రూల్స్ వర్తిస్తాయి
(ప్రత్యేక మినహాయింపులు ఉంటే తప్ప).
ప్రశ్న12 :
ఈ రూల్స్‌పై మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి?
జవాబు:
ఇది డ్రాఫ్ట్ దశలోనే ఉంది.
ఇప్పుడే స్పందించకపోతే
భవిష్యత్తులో సవరించుకునే అవకాశం ఉండకపోవచ్చు.
Social Plugin