అమరావతి : అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల సేవలు మే 8 నుంచి నిలిపివేత
ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన నియమితులైన అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల సేవలను మే 8వ తేదీ నుంచి నిలిపివేయా లని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలు జారీచేశారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట బోధనకు 892 స్కూల్ అసిస్టెంట్లు, 254 ఎస్జీటీ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. వీరి కాంట్రాక్టు గడువు మే 7తో ముగుస్తున్నందున 8 నుంచి సేవలు నిలిపి వేయాలని సూచించారు.