2వ తరగతి తెలుగు
ప్రశ్నపత్రానికి (Term 2 Model Paper 2025-2026) సరైన
సమాధానాలు మరియు వివరణలు కింద ఇవ్వబడ్డాయి:
మీరు Mobile లో చూస్తుంటే A4 size PDF Download చేసుకోవాలంటే Desktop Mode లో పెట్టుకొని చేసుకోండి A4 లో Download అవుతుంది
SA2 CLASS - 2 TELUGU kEY PAPER (2025-26)
1.
“తూనీగ” అనే పదానికి సరైన చిత్రాన్ని గుర్తించండి.
జవాబు: A
2. ఇవ్వబడిన వాటిలో కూరగాయను
గుర్తించండి.
జవాబు: B) వంకాయ
3. కింది పదాలలో ఐత్వం ( ై )
గుణింతాక్షరంతో మొదలయ్యే ఊర్ల పేర్ల జత ఏది?
జవాబు: A) కైకలూరు, మైదుకూరు
4. చిత్రంను చూసి ఖాళీలో సరైన
అక్షరాన్ని ఎంచుకోండి.
జవాబు: C) కజ్జికాయలు
5. కింది వాటిలో సరైన వాక్యాన్ని
ఎంపిక చేయండి.
జవాబు: C) పడవ ఒడ్డుకు చేరింది.
6. ముని, అడవిలో ప్రశాంతంగా _____ చేస్తున్నాడు.
జవాబు: B) తపస్సు
7. కూరలలో ఉపయోగించే వస్తువు ఏది?
జవాబు: A) ఉల్లిపాయ
8. ‘క - ఒత్తు' మరియు
'న - ఒత్తు' పదం ఉన్న చిత్రాన్ని ఎంపిక
చేయండి.
జవాబు: C) మొక్కజొన్న
9. కింది వాటిని (క్ర, ర్యు, ట,
ఢీ) ఏమంటారు?
జవాబు: B) సంయుక్తాక్షరాలు
10. కింది వాటిలో వేరుగా ఉన్న దానిని
గుర్తించండి. (అమావాస్య, పౌర్ణమి - తిథులు; ఆదివారం - వారం)
జవాబు: C) ఆదివారం
11. మేనత్త అంటే ఎవరు?
జవాబు: A) నాన్నకు అక్క (లేదా చెల్లి)
12. కింది వాక్యంలో ద్విత్వాక్షర
పదాన్ని గుర్తించండి. (ప్రతి మధ్యాహ్నం రాణి తన కుక్కతో ఆడుకుంటుంది.)
జవాబు: B) కుక్క
13. కింది వాక్యాన్ని అర్థవంతంగా
మార్చడానికి ఖాళీలలో ఉండవలసిన సరైన ఒత్తు అక్షరాలు ఏవి?
(అమ్మ బర్రె పాలతో తియ్యని
పాయసం చేసింది.)
జవాబు: A) ర్రె, య్య
14. కింది పదాలను చదివి ఖాళీకి సరిపడు
పదాన్ని ఎంచుకోండి. (వెదురు బుట్ట, తేనె తుట్టె, చెరువు ____)
జవాబు: C) గట్టు
15. కింది పదాలలో మొదటి అక్షరానికి
ఓత్వం ( ో ) చేర్చినచో ఏర్పడే సరైన పదాలు ఏవి? (పలీసు, మకాలు, సమవారం) జవాబు: C) పోలీసు, మోకాలు, సోమవారం
పేరాగ్రాఫ్
ప్రశ్నలు (కథ ఆధారంగా - 16
నుండి 20 వరకు):
- కథలోని స్నేహితులు కూరగాయలు ఎక్కడ పెంచేవారు?
జవాబు: B) వీధి చివరి ఖాళీ స్థలంలో
- పిల్లలు తాము పెంచిన కూరగాయలను ఏం చేసేవారు?
జవాబు: B) స్నేహితులకు ఇచ్చేవారు. (కొన్ని ఇళ్లకు, కొన్ని ముసలివారికి, మిగతావి స్నేహితులకు ఇచ్చారు)
- ముసలివారికి పండ్లు మరియు కూరగాయలు ఇవ్వడం అనేది
పిల్లల గురించి ఏం తెలుపుతుంది?
జవాబు: A) వారి మంచితనం
- ఈ కథ నేర్పే విషయం ఏమిటి?
జవాబు: C) పంచుకోవడంలోనే అసలైన సంతోషం ఉంటుంది.
- కథలో ఉన్న స్నేహితులెవరు?
జవాబు: A) అక్బర్ మరియు రాధ (అక్బర్, కమల,
రాధ ఉన్నారు)
విభాగము - B : చిన్న సమాధాన ప్రశ్నలు
21. గీత గీసిన
అక్షరాలకు సరైన గుణింతాక్షరం చేర్చి రాయండి:
- సైకిలుపై ప్రయాణం భలే సరదాగా ఉంటుంది. (స -> సై, య -> యా)
- పాప చుక్కల గౌను వేసుకుంది. (చక్కల -> చుక్కల, గను -> గౌను)
- కొండ మీద కోతి ఉంది. (కండ -> కొండ, కతి -> కోతి)
22. కింది ఖాళీలను
సరైన గుణింతాక్షరాలతో పూరించండి:
- క్క, క్కా, క్కి, క్కీ, క్కు, క్కూ,
క్కృ, క్కౄ, క్కె, క్కే, క్కై,
క్కొ, క్కో, క్కౌ,
క్కం, క్కః
- త్త, త్తా, త్తి, త్తీ, త్తు, త్తూ,
త్తృ, త్తౄ, త్తె, త్తే, త్తై,
త్తొ, త్తో, త్తౌ, త్తం, త్తః
23. పేరా చదివి,
ఖాళీలు పూరించండి:
- చాందిని వెళ్ళిన ఊరి పేరు విశాఖపట్నం.
- చాందిని సంతోషంగా బీచ్ లో ఆటలు ఆడుకుంది.
- చాందిని తిరుగు ప్రయాణం రైలు లో చేసింది.
24. దీర్ఘం ( ా ),
గుడి దీర్ఘం ( ీ ) ఉన్న గుణింతాక్షర పదాలు:
- దీర్ఘం ( ా ) ఉన్నవి: జవాబు:
కిరాయి, బఠాణీ, శీతాకాలం. మిఠాయి
- గుడి దీర్ఘం ( ీ ) ఉన్నవి: జవాబు: దీపం, మీసం, శీతాకాలం,
బఠాణీ
25. ఋత్వం ( ృ )
గుణింతాక్షరంతో మొదలయ్యే పదాలు:
A) గృహం B) వృక్షం C) హృదయం
26. మహాప్రాణాక్షరాలు
(ఒత్తు ఉన్న హల్లులు) గుర్తించి రాయండి:
శంఖము , భవనం , ఘనత, చిత్రకథ, సఫలం, పాఠశాల
జవాబు: ఖ , భ, ఘ , థ , ఠ
27. ‘బ' ఒత్తు, ‘ళ' ఒత్తు పదాలు రాయండి
(పట్టిక ఆధారంగా):
జవాబు: గబ్బిలం , కళ్ళజోడు , అబ్బాయి
28. చిత్రాలను చూసి
వాక్యాలు రాయండి:
- అరటి చెట్టు గెల వేసింది.
- పిచ్చుక నిచ్చెన పై కూర్చుంది.
- పిల్లలు జాతీయ జెండాకు వందనం చేస్తున్నారు.
29. వాక్యాలను
అందంగా రాయండి:
(ఇచ్చిన వాక్యాలను చూసి దస్తూరిగా రాయడం)
30. సరైన విధంగా జతపరిచి
రాయండి:
i) మల్లె – పూవు ii) రవ్వ – లడ్డు iii) తారా – జువ్వ
మల్లెపూవు , రవ్వలడ్డు
, తారాజువ్వ
విభాగము - C : ఖాళీలు మరియు వాక్యాల క్రమం
31. ఖాళీ గళ్లలో
అక్షరం నింపండి:
- పెళ్ళి భోజనం 6.
జిలేబి
- ఐదు పైసలు 7.
ఆకృతి
- బొప్పాయి 8.
పిడికిలి
- చౌక బేరం 9.
వానాకాలం
- కొండ చిలువ 10. సిపాయి
32. పదాల క్రమాన్ని
సరిచేసి అర్థవంతమైన వాక్యాలు రాయండి:
- పడవను తెడ్డుతో నడుపుతారు.
- బావికి మరో పేరు నుయ్యి.
- పిల్లలు వెన్నెలలో ఆడారు.
- లత బస్సులో వెళ్ళింది.
- శనివారానికి ముందురోజు శుక్రవారం.
Social Plugin