భీష్ముడు అంపశయ్యపై ఉన్నపుడు నాకు నా గత పదిజన్మలు గుర్తు ఉన్నాయి ఏ జన్మలో కూడా నేను ధర్మం తప్పలేదు అయినా నాకు ఈ జన్మలో ఈ అంపశయ్య శిక్ష ఎందుకు పడింది అని కృష్ణుడు ని అడిగినట్లు చదివాను భీష్ముడు అష్టవసువుల్లో ఒకడని చదివాను ఏది నిజం?
మహాభారతంలోని శాంతిపర్వం (ముఖ్యంగా మొక్షధర్మ పర్వము) చదవండి ,
అక్కడ భీష్ముడు కృష్ణుడికి స్వయంగా ఇవన్నీ వివరించి చెప్పినట్టు ఉంది.
ఆయనకు అంపశయ్య శిక్ష రావడం గత జన్మలో వశిష్ఠుని శాపం ఫలితం.ఆయన ధర్మవంతుడే అయినా, మనుష్యుల జన్మలో కర్మల ఫలితాన్ని తప్పించలేమని ఈ ఘటన భావార్థం.
భీష్మా, నీ శరీరానికి ఈ శిక్ష నీ గత కర్మ ఫలితం, కానీ నీ మనస్సుకు శిక్ష లేదు. నీ చిత్తం ధర్మములో స్థిరంగా ఉంది.
భీష్మపర్వం మరియు శాంతిపర్వం భాగాల్లో గమనిస్తాము
-భీష్ముడు అష్టవసువుల్లో ఒక్కడు అనే విషయం మహాభారతంలోని మౌలిక కథలో స్పష్టంగా ఉంది.
వసిష్ఠుడి ఆశ్రమంలోని నందిని అనే దివ్యపశువును దొంగలించడం వల్ల వసిష్ఠుడు అష్టవసువులను శపిస్తాడు. ఇది అందరికీ తెలిసిందే గౌతమీనది రావటానికి వెనుక ఉన్న కారణం.
అందులో ప్రధాన పాత్ర వహించిన వసువు (పేరు చాలా సంస్కరణల్లో “ద్యు”, కొన్ని లిస్టుల్లో “ప్రభాస”) మాత్రమే భూమిపై దీర్ఘాయుష్యంతో జన్మించి అనేక కష్టాలు అనుభవించి, స్త్రీ సంబంధం-సంతానం లేకుండానే, ఎవరి ఇష్టానికి చనిపోవాలో తన ఇష్టానుసారం మరణించాలనే శాపఫలితాన్ని పొందుతాడు.
ఆ వసువు దేవవ్రతుడిగా (భీష్ముడిగా) జన్మిస్తాడు.
అంపశయ్యపై ఉన్నప్పుడు భీష్ముడు తన గత పది జన్మలు గుర్తున్నాయని, నేను ధర్మం తప్పలేదు, అయితే ఇలాంటి శిక్ష ఎందుకు?”
కృష్ణుణ్ని అడిగాడని చెప్పే సంఘటన మాత్రం వ్యాస మహాభారతం లేదా భాగవత పురాణం వంటి మౌలిక సంస్కృత గ్రంథాలలో కనిపించదు.
భాగవతంలో (1.9 అధ్యాయం) భీష్మస్తుతి మాత్రమే ఉంది,అక్కడ ఆయన కృష్ణుడిని స్తుతించి, యుధిష్ఠిరునికి ధర్మోపదేశం చేయడానికి సన్నద్ధమవుతాడు.ఆదిత్యయోగీ.
“పది జన్మలు” గురించి ప్రశ్న భావం కొన్ని ప్రాంతీయ కధనాలలో,ఉపన్యాసాలలో ఉండవచ్చు, కాని క్రిటికల్ ఎడిషన్లలో ప్రత్యక్ష ఆధారం లేదు.
(కొంతమంది ప్రసంగాలలో ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు సభా నియమం తప్పకూడదని చూస్తూ ఉండటం ఇలాంటివి కూడా అంపశయ్య పై ఉండటానికి కారణంగా చెప్తారు సభా గౌరవాన్ని ఆడవాళ్ళ విషయంలో తప్పినప్పటికీ అది శాస్త్ర విరుద్ధం కాదు కదా ఇలాంటి ఎన్నో పోకర్లు ఉన్నాయి. ప్రతి దానికి కర్మ అని నేను అనుకుంటున్నాను….)
అయితే భీష్ముడి అంపశయ్య “శిక్ష”గా మాత్రమే కాదు, అనేక కారణాల సమ్మేళనంగా చెప్పబడింది.
కొన్ని నియమాలు కింద చెప్తున్నాను.
- వసిష్ఠుడి శాపఫలం (దీర్ఘాయుష్యం, కష్టానుభవం)
- కాశీ యజ్ఞంలో అపహరించిన అంబా కారణంగా వచ్చిన ప్రతిజ్ఞ,శాప సరమాల వల్ల శిఖండివలన ఆయనకు సంహారం సంభవించడం.
- తండ్రికి ఇచ్చిన ప్రతిజ్ఞలు, కౌరవుల పక్షాన యుద్ధం చేయవలసివచ్చిన పరిస్థితి.
- ఇచ్ఛామరణ వరం వల్ల ఉత్తరాయణం వరకూ స్వయంగా అంపశయ్యపై వేచి ఉండడం.
-“భీష్ముడు అష్టవసువుల్లో ఒక్కడు” ఇది మహాభారత ప్రామాణిక కథ ప్రకారం నిజం.
ఆత్మకు మరణం లేదు, శరీరానికి ఎన్ని శరీరాల్లో మానవమాత్రుల కైనా ,దైవ సంబోదలకైన ధర్మాన్ని పట్టుకుందాం సనాతన ధర్మం వర్ధిల్లాలి..
మీరు దేవుడిపై ఇష్టాన్ని మీ కష్టాలతో ముడిపెట్టకూడదు, ఎందుకంటే దేవుని ఆరాధన, సేవలు అనేవి ఇష్టం లేని పనులుగా కాకుండా, సంతోషంతో చేసేవిగా ఉండాలి. దేవునికి ఇష్టం లేని పనులు చేయడం, మనకు నచ్చని పద్ధతిలో ఆయనను ఆరాధించడం చేయకూడదు, ఎందుకంటే దేవుడు మన కష్టాన్ని బట్టి కాకుండా, మన నిజమైన విశ్వాసాన్ని, భక్తిని చూస్తాడు.
ఇష్టంగా ఉండాలి: దేవుని సేవ అనేది తప్పనిసరిగా చేయవలసిన పనిలా కాకుండా, సంతోషంగా చేయవలసినది.
విశ్వాసంతో ఉండాలి: దేవునిపై నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి, లేదంటే ఆయనకు ఇష్టులుగా ఉండటం సాధ్యం కాదు. కష్టాన్ని అంచనా వేయొద్దు: దేవుని కష్టానికి ప్రతిఫలం ఇస్తాడని అనుకోవడం తప్పు. ఆయన మన భక్తిని, విశ్వాసాన్ని చూస్తాడు.
స్వార్థం ఉండకూడదు: 'దేవునికి ఇస్తే నాకు రెట్టింపు ఇస్తారు' అనే స్వార్థంతో చేసే పనులు దేవునికి ఇష్టం ఉండదు..
.ధర్మం తార్కికం కాదు ధర్మం సనాతనం. అది, పరిణామబద్ధం కాదు. అందులో ఏ కొంచెం మార్పు వచ్చినా, ఈ విశ్వానికే ఆపత్తు వస్తుంది.
అన్ని ధర్మాలకూ వేదాలే మూలం. 'వేదోఖిలో ధర్మ మూలం'. వేదాలు అపౌరుషేయాలు. వాటి కర్తలను మనం ఎరగం.
ఈ ధర్మశాస్త్రాలను వ్యక్తిగతంగా కాని, పరిసరమూలకంగా కాని, సామాజికవ్యవస్థల ద్వారా గాని మార్పు చెయ్యడానికి వీలు లేదు.మార్పు చేస్తే ధర్మమే అస్థిరమై పోతుంది. అందుచేతనే అది సనాతన ధర్మ మన్నారు. శ్రీరాముడు మాటి మాటికీ “ఏషధర్మస్సనాతనః” అనడం అందుకే.
ధర్మంలో తర్కానికి తావు లేదు. “తర్కో అప్రతిష్ఠ” (తర్కం స్థిరత్వం లేనిది) ధర్మం తార్కికం కాదు, కర్తవ్యం..*
